టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్

నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, పార్తిబన్, రావు రమేశ్, గౌతమి, కేఎస్ రవికుమార్, టెంపర్ వంశీ తదితరులు
దర్శకత్వం: హరీష్ శంకర్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
బీజీఎమ్: ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ: అయానకా బోస్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
విడుదల తేది: మార్చి 19, 2026
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ హరీష్ శంకర్. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన గబ్బర్ సింగ్ కాంబో పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో అలాగే ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఏర్పడ్డాయి.
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, బ్యూటిపుల్ రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఇవాళ (మార్చి 19) ఉగాది పండుగ సందర్బంగా థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పవన్-హరీష్ కాంబో వర్కౌట్ అయిందా? గబ్బర్ సింగ్‌లా మ్యాజిక్ క్రియేట్ చేసిందా? లేదా? అనేది నేటి ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (కెఎస్ రవికుమార్) దాడి జరుగుతుంది. తాను సీఎం కావాలన్న కోరికతో ఆ అటాక్ చేయిస్తాడు చదలమర్రి నల్ల నాగప్ప (పార్థిబన్). అటాక్ తర్వాత నాగప్ప కొడుకు నల్లమల అడవుల్లోకి వెళ్లి అదృశ్యమవుతాడు. ఈ మిస్సింగ్ వెనుక ఉంది ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కల్యాణ్) ఉన్నాడని తెలుస్తుంది.
{{/usCountry}}ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (కెఎస్ రవికుమార్) దాడి జరుగుతుంది. తాను సీఎం కావాలన్న కోరికతో ఆ అటాక్ చేయిస్తాడు చదలమర్రి నల్ల నాగప్ప (పార్థిబన్). అటాక్ తర్వాత నాగప్ప కొడుకు నల్లమల అడవుల్లోకి వెళ్లి అదృశ్యమవుతాడు. ఈ మిస్సింగ్ వెనుక ఉంది ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కల్యాణ్) ఉన్నాడని తెలుస్తుంది.
{{/usCountry}}ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు? ముఖ్యమంత్రిని కాపాడటానికి నాగప్ప కొడుకు మిస్సింగ్‌కు సంబంధం ఏంటీ? సీఎంకు భగత్ సింగ్‌కు ఉన్న సంబంధం ఏంటీ? భయంకరమైన టెర్రరిస్ట్‌తో నాగప్ప వేసిన ప్లాన్ ఏంటీ? ఈ క్రమంలో లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) పాత్రలు ఏంటీ? ఉస్తాద్ భగత్ సింగ్ అసలు పేరు ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి దళపతి విజయ్ తేరి మూవీకి రీమేక్ అని ప్రచారం సాగింది. కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశాకా ఫ్యాన్స్‌కు దక్కే రిలీఫ్ ఇది రీమేక్ కాదని. పక్కా ఒరిజినల్ కథతోనే డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆడియెన్స్ ముందుకు పవన్ కల్యాణ్‌ను మరోసారి పవర్‌ఫుల్ పాత్రతో తీసుకొచ్చారు.
ఓజీ, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి తరహలో సీరియల్స్ రోల్స్ కాకుండా ఈ మూవీలో వింటేజ్ పవన్ కల్యాణ్‌ను చూపించే ప్రయత్నం చేశారు. తనపై తాను సెటైర్లు వేసుకోవడం, మహేశ్ బాబు వంటి ఇతర హీరోల పాటలకు డ్యాన్స్ చేయడం వంటి ఎలిమెంట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు.
ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే
చాలా వరకు పవన్ కల్యాణ్ లుక్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. సీఎంపై అటాక్‌తో మొదలైన మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. కానీ, కొంతవరకు కథ ఊహించేలా ఉంటుంది. మూవీ ఓవరాల్ ప్లాట్ తెలిసేసరికి రెగ్యులర్ కథలాగే అనిపిస్తుంది. కానీ, టేకింగ్, డైలాగ్స్, సీన్స్‌తో ఎంగేజింగ్‌గా ప్రజంట్ చేశారు డైరెక్టర్ హరీశ్ శంకర్.
ముఖ్యమంత్రిపై అటాక్, నాగప్ప ఇంటెన్షన్, అతని కొడుకును భగత్ సింగ్ అడ్డుపెట్టుకోవడం, చంద్రశేఖర్‌కు భగత్ సింగ్‌కు ఉన్న సంబంధం వంటి సీన్లతో రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఫార్మాట్‌లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సాగుతుంది. కొన్నిచోట్ల గబ్బర్ సింగ్ కనిపిస్తాడు.
మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్
సెకండాఫ్‌లో మాస్ ఆడియెన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి. కొన్ని పాత పాటల రీమిక్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. వాటికి పవర్ స్టార్ ఎనర్జీ బాగా మ్యాచ్ అయింది. ఇంతకు మించి కథ గురించి చెబితే స్పాయిలర్ అవుతుంది.
ఫస్టాఫ్‌లో రాశీ ఖన్నా పాత్ర గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ అలరిస్తాయి. పవన్ కల్యాణ్‌ను శ్రీలీల ఇమిటేట్ చేసే సీన్స్ విజిల్స్ పెట్టించేలా ఉన్నాయి. తమిళ అగ్ర నటుడు, దర్శకుడు పార్థిబన్ యాక్టింగ్ బాగుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
మరో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ నటన కూడా మెప్పిస్తుంది. గౌతమి, రావు రమేష్ వంటి సీనియర్ నటీనటులు పర్ఫామెన్స్ తన పరిధి మేర ఆకట్టుకుంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలతో విజిల్స్ వేయించేలా ఉంది.
ఫైనల్‌గా చెప్పాలంటే
సంగీతం బాగుంది. బీజీఎమ్ పర్వేలేదు. సినిమాటోగ్రఫీ, విజువల్స్, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మరోసారి తన మార్క్‌తో పవన్ కల్యాణ్‌ను చూపించారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఫైనల్‌గా చెప్పాలంటే ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చే ఉస్తాద్ భగత్ సింగ్.