Vaibhav Sooryavanshi Accused Of Using AI Chip In Bat: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను చీల్చిచెండాడుతున్న ఈ కుర్రాడి ఆటతీరుపై పాకిస్థాన్ క్రికెట్ నిపుణుడు నౌమన్ నియాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏఐ చిప్ వాడుతున్నాడు

'స్మాష్ హిట్' అనే కార్యక్రమంలో నౌమన్ నియాజ్ మాట్లాడుతూ.. "ఈ పిల్లాడి (వైభవ్ సూర్యవంశీ) బ్యాట్‌ను ఒకసారి చెక్ చేయండి. వాడా (WADA) ఎలాగైతే డోప్ టెస్టులు చేస్తుందో, అలాగే ఇతడి బ్యాట్‌ను ల్యాబ్‌కు పంపాలి. బహుశా ఇతడు తన బ్యాట్‌లో ఏఐ (AI) చిప్‌ను వాడుతున్నాడేమో. 18 ఏళ్ల వయసు వస్తే తప్ప శరీరంలో కండరాలు, బలం రావు. కానీ 16 ఏళ్ల లోపు ఉన్న ఇతడు ఇంత పవర్ ఎలా జనరేట్ చేస్తున్నాడు? విరాట్ కోహ్లీ వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు పుట్టిన ఈ పిల్లాడు 360 డిగ్రీల్లో ఆడుతుంటే నమ్మలేకపోతున్నాను" అంటూ విడ్డూరపు ఆరోపణలు చేశారు.
రికార్డుల వేటలో వైభవ్
నౌమన్ నియాజ్ ఆరోపణలు ఎలా ఉన్నా, వైభవ్ సూర్యవంశీ మాత్రం మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును మిస్ చేసుకున్న వైభవ్ శనివారం (ఏప్రిల్ 25) సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మాత్రం కనికరించలేదు.
కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది తన సత్తా చాటాడు వైభవ్ సూర్యవంశీ. మధ్యలో కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైనా, కీలక సమయంలో సెంచరీతో చెలరేగి విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్-19లో ఈ కుర్రాడి జోరు చూస్తుంటే భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ లేపుతున్నాడు
ప్రస్తుతం ఐపీఎల్ పరుగుల వేటలో వైభవ్ సూర్యవంశీ దిగ్గజ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 357 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక భారీ సెంచరీ ఉన్నాయి.
{{/usCountry}}ప్రస్తుతం ఐపీఎల్ పరుగుల వేటలో వైభవ్ సూర్యవంశీ దిగ్గజ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 357 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక భారీ సెంచరీ ఉన్నాయి.
{{/usCountry}}కేఎల్ రాహుల్ (3వ స్థానం), శుభ్‌మన్ గిల్ (5వ స్థానం), విరాట్ కోహ్లీ (6వ స్థానం) వంటి సీనియర్లను వెనక్కి నెట్టి వైభవ్ దూసుకుపోతున్నాడు. టాప్-10లో హెన్రిచ్ క్లాసెన్ మినహా మిగిలిన వారంతా భారతీయులే ఉండటం గమనార్హం.
"వైభవ్ ఆటతీరు అద్భుతం. అతని టెక్నిక్, రిస్ట్ వర్క్ అమోఘం. కేవలం పవర్ మీదే కాకుండా టైమింగ్‌తో బంతులను బౌండరీలకు పంపుతున్నాడు" అని భారత క్రికెట్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
టీమ్ ఇండియా పిలుపు ఎప్పుడంటే?
గత ఏడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అనితరసాధ్యంగా ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డలపై సెంచరీలు బాదడమే కాకుండా ఈ ఏడాది జనవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు.
బీసీసీఐ సెలక్టర్ల కన్ను
ఈ క్రమంలోనే బీసీసీఐ సెలక్టర్ల కన్ను ఇతనిపై పడింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే జూన్ నాటికి ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్రెయిన్ లారా లాంటి లెజెండరీ ఆటగాళ్ల తరహాలో వైభవ్‌ను కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దాలని మాజీలు సూచిస్తున్నారు.