ఇప్పటివరకు సముద్రపు దొంగ జాక్ స్పారోగా హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. కరెబియన్ ఆఫ్ పైరెట్స్ సిరీస్‌తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జానీ డెప్‌ను ఇక మర్చిపోయేలా చేసేందుకు వస్తోంది బ్యూటిఫుల్ అండ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

అత్యంత క్రూరమైన, రక్తపాతంతో కూడిన సముద్రపు దొంగగా ప్రియాంక చోప్రా కనిపించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ది బ్లఫ్’ (The Bluff) చిత్రం నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను బుధవారం (జనవరి 7) రిలీజ్ చేశారు మేకర్స్.
ఒళ్లు గగుర్పొడిచే ‘బ్లడీ మేరీ’ అవతారం
ది బ్లఫ్ సినిమాలో ప్రియాంక చోప్రా ‘బ్లడీ మేరీ’గా కనిపిస్తున్న తీరు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పోస్టర్లను పంచుకుంటూ.. "తల్లి.. రక్షకురాలు.. సముద్రపు దొంగ.. బ్లడీ మేరీని కలవండి" అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు.
ఫస్ట్ లుక్ చిత్రంలో ప్రియాంక గాలిలోకి ఎగిరి సహ నటుడు కార్ల్ అర్బన్‌పై ఆయుధంతో దాడి చేస్తున్న దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ముఖమంతా రక్తం, ఒళ్లంతా దుమ్ముతో, శత్రువుపై విరుచుకుపడుతున్న ప్రియాక చోప్రా తీరు సినిమాలోని యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుందో హింట్ ఇచ్చింది. ఒక చేతిలో శంఖాన్ని పంచ్‌లాగా పట్టుకుని శత్రువును దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉన్న వారణాసి హీరోయిన్ ప్రియాంక లుక్ వైరల్ అవుతోంది.
నెట్టింట స్పందన.. దేశీ గర్ల్ ఈజ్ బ్యాక్!
ఈ ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు ప్రియాంక మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు. "దేశీ గర్ల్ ఈజ్ బ్యాక్.. అది కూడా ఒక కటిక వేటగాడిలా (Butcher)" అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఆమెను కాళికా మాతతో పోల్చుతున్నారు.
{{/usCountry}}ఈ ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు ప్రియాంక మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు. "దేశీ గర్ల్ ఈజ్ బ్యాక్.. అది కూడా ఒక కటిక వేటగాడిలా (Butcher)" అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఆమెను కాళికా మాతతో పోల్చుతున్నారు.
{{/usCountry}}ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా ఈ లుక్‌ను రీ-పోస్ట్ చేస్తూ.. "ప్రపంచం ఈ అద్భుతాన్ని చూసే వరకు నేను ఆగలేను" అని తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఓటీటీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ తర్వాత రూసో బ్రదర్స్ నిర్మాణంలో ప్రియాంక చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ది బ్లఫ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్‌లో ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 25న ది బ్లఫ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఇకపోతే ది బ్లఫ్ కథ విషయానికొస్తే.. 1800వ కాలం నాటి కరేబియన్ దీవుల నేపథ్యంలో సాగే ఈ 'ఆర్-రేటెడ్' (R-rated) అడ్వెంచర్ థ్రిల్లర్ ఇది. ఎర్సెల్ 'బ్లడీ మేరీ' బోడెన్ అనే మాజీ పైరేట్ క్వీన్ కథ ఇది.
ఇదిలా ఉంటే మరోవైపు ప్రియాంక చోప్రా వారణాసి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసి మూవీపై వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి.