Dharmasthala Niyojakavargam Press Meet Vithika Sheru Comments: తెలుగులో వస్తున్న సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ‘ధర్మస్థల నియోజకవర్గం’. హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు సీనియర్ హీరోలు సుమన్, సాయి కుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర ఇతర కీ రోల్స్ చేశారు.
సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా రిలీజ్

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ధర్మస్థల నియోజకవర్గం సినిమాను మేరుం భాస్కర్ నిర్మించారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా ధర్మస్థల నియోజకవర్గం సినిమా రిలీజ్ కానుంది.
ధర్మస్థల నియోజకవర్గం ప్రెస్ మీట్
ఈ చిత్రాన్ని "పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 21) హైదరాబాద్‌లో ధర్మస్థల నియోజకవర్గం సినిమా ప్రెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు.
వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు కామెంట్స్
ఈ కార్యక్రమంలో హీరోయిన్ వితికా షెరు మాట్లాడుతూ.. "నేను హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం కంటే ఒక నటిగా మంచి గుర్తింపు పొందాలని కోరుకున్నాను. నటిగా నాకు మంచి పేరు తెచ్చే క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎంతో బాగా చూసుకున్నారు" అని అన్నారు.
ఆలోచింపజేసే చిత్రమిది
నటి కస్తూరి మాట్లాడుతూ.. "అర్థం పర్థం లేని కామెడీ, డ్రామా ఉన్న సినిమా కాదిది. ఒక పర్పస్ ఫుల్ మూవీ. ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే చిత్రమిది. ఇలాంటి సినిమా ఇప్పుడున్న సొసైటీకి కావాలి. ఈరోజు జెన్ జీ ఆటపాటలతో సరదాగా సమయం గడపడం లేదు. ఆలోచిస్తున్నారు. అలాంటి యువతకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట గారికి, నిర్మాత భాస్కర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా" అని తెలిపారు.
మంచి ఎమోషనల్ టచ్‌తో సినిమా
"మా సినిమాలో సంగీతానికి మంచి స్కోప్ ఉంది. మ్యూజికల్‌గా మంచి ఎమోషనల్ టచ్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా డెఫినెట్‌గా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సినిమా ఆ రోజు నుంచి మీది కాబోతుంది
{{/usCountry}}"మా సినిమాలో సంగీతానికి మంచి స్కోప్ ఉంది. మ్యూజికల్‌గా మంచి ఎమోషనల్ టచ్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా డెఫినెట్‌గా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సినిమా ఆ రోజు నుంచి మీది కాబోతుంది
{{/usCountry}}"ఇప్పటిదాకా ఈ సినిమా మాది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి మీది కాబోతోంది. ప్రేక్షకులంతా మా సినిమాను తమదిగా భావించి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమాతో సుమన్ గారు, వితిక.. ఇలాంటి కాస్టింగ్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది" అని హీరో నటరాజ్ చెప్పారు.
ప్రతి ఒక్కరూ బాగుందంటున్నారు
నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ.. "ఈ రోజు మా సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది, తప్పకుండా విజయం సాధిస్తుందని చెబుతుండటం సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు.
మీ రెస్పాన్స్ చెప్పాలి
"సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్స్‌లో మా ధర్మస్థల నియోజకవర్గం సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మీరంతా చూసి మీ రెస్పాన్స్ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నా" అని కోరారు ప్రొడ్యూసర్ మేరుం బాస్కర్.