Veteran Actress Sowcar Janaki Passes Away At 94 Age: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరోసారి తీరని లోటు ఏర్పడింది. దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన గొప్ప నటి, పద్మశ్రీ షావుకారు జానకి (94) ఇకలేరు.
తీవ్ర అనారోగ్యంతో మృతి

వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఆళ్వార్‌పేట కావేరి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న దిగ్గజ నటి షావుకారు జానకి శుక్రవారం (ఆగస్ట్ 21) మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) అధ్యక్షుడు నాజర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సినీ లోకమంతా దిగ్భ్రాంతికి గురైంది.
రాజమండ్రి నుంచి 'ఆకాశవాణి' ద్వారా వెండితెరకు!
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో సంకరమంచి జానకిగా జన్మించిన ఆమె జీవిత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. చిన్నతనంలోనే వివాహం చేసుకున్న జానకి గర్భవతిగా ఉన్న సమయంలోనే మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత గౌహతి విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు.
రేడియో జాకీగా కెరీర్ ప్రారంభం
మద్రాస్ ఆకాశవాణిలో రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన జానకి.. ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో 1950లో వచ్చిన 'షావుకారు' చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి చిత్రమే సంచలన విజయం సాధించడంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారి 'షావుకారు జానకి'గా గుర్తింపు తెచ్చుకున్నారు.
నాజర్ అధికారిక ప్రకటన
"లెజెండరీ స్టార్ షావుకారు జానకి మరణం తీరని లోటు. ఆమె భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం తేనాంపేటలోని సెంటోఫ్ రోడ్డు నివాసంలో ఉంచుతాం" అని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ పేర్కొన్నారు.
బాషల సరిహద్దులు దాటిన నటనా ప్రతిభ
తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో షావుకారు జానకి విలక్షణమైన పాత్రలు పోషించారు. 1952లో 'వలయాపతి' చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టిన ఆమె, 1959లో కన్నడ విలక్షణ నటుడు రాజ్ కుమార్‌తో కలిసి భారతదేశపు తొలి పాన్-ఇండియా చిత్రంగా భావించే 'మహిషాసుర మర్దిని'లో నటించారు.
బుల్లితెర సీరియల్స్‌లోనూ షావుకారు జానకి
{{/usCountry}}తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో షావుకారు జానకి విలక్షణమైన పాత్రలు పోషించారు. 1952లో 'వలయాపతి' చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టిన ఆమె, 1959లో కన్నడ విలక్షణ నటుడు రాజ్ కుమార్‌తో కలిసి భారతదేశపు తొలి పాన్-ఇండియా చిత్రంగా భావించే 'మహిషాసుర మర్దిని'లో నటించారు.
బుల్లితెర సీరియల్స్‌లోనూ షావుకారు జానకి
{{/usCountry}}ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా తెలుగులో గొప్ప నటిగా వెలుగొందడం విశేషం. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఆమె, బుల్లితెరపై దూరదర్శన్ నాటి నుంచీ జీ తెలుగులో వచ్చిన 'వరుధినీ పరిణయం' వరకు అలరించారు.
చివరిగా నందినిరెడ్డి సినిమాలో
ఇటీవల బీవీ నందిని రెడ్డి (మా ఇంటి బంగారం డైరెక్టర్) దర్శకత్వం వహించిన 'అన్నీ మంచి శకునములే' (2023) చిత్రంలో చివరిసారిగా కనిపించారు షావుకారు జానకి. చిత్రసీమకు ఆమె చేసిన అసమాన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2022లో 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.
సౌత్ సినీ పరిశ్రమల నుంచి సంతాపం
షావుకారు జానకి భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం సిద్ధం చేశారు. జానకి మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, షావుకారు జానకి కుటుంబ సభ్యులకు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు సానుభూతిని తెలియజేస్తున్నారు.