...
...
Next Story

దేశభక్తి మన గుండె చప్పుడు, అలా అంటే అవమానించడమే.. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కామెంట్స్

2025లో బాలీవుడ్‌ను ఊపేస్తున్న ‘ఛావా’, ‘ధురంధర్’ చిత్రాల భారీ హిట్స్‌పై హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ రియాక్డ్ అయ్యాడు. దేశభక్తిని అలా చూడటం అనేది ఆ ఎమోషన్‌ను అవమానించడమేనని విక్కీ కౌశల్ అభిప్రాయపడ్డాడు. దేశభక్తి అనేది మన గుండె చప్పుడు అని అభివర్ణించాడు ఛావా హీరో విక్కీ కౌశల్.

Published on: Dec 22, 2025, 22:00:47 IST
Advertisement

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది దేశభక్తి మంత్రం చాలా గట్టిగా పనిచేసింది. ఇలా అనడం దేశభక్తి ఎమోషన్‌ను అవమానించడమే అని హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ అభిప్రాయ పడ్డాడు. అయితే, 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి రెండు హిందీ చిత్రాలైన ‘ఛావా’ (Chhaava), ‘ధురంధర్’ (Dhurandhar) మధ్య చాలా పోలికలు ఉన్నాయి.

వీరుల త్యాగాలను

దేశభక్తి మన గుండె చప్పుడు, అలా అంటే అవమానించడమే.. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కామెంట్స్
దేశభక్తి మన గుండె చప్పుడు, అలా అంటే అవమానించడమే.. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కామెంట్స్

ఈ రెండు సినిమాలూ జాతీయవాదాన్ని ఇతివృత్తంగా తీసుకున్నవే. పాపులర్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రెండు సినిమాల్లో మన వీరుల త్యాగాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సినీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది.

ఫార్ములా అనడం అవమానమే

"దేశభక్తి అనేది బాక్సాఫీస్ వద్ద సేఫ్ గేమ్ ఆడేందుకు ఒక ‘ఫార్ములా’గా మారిందా?" అన్నదే ఆ చర్చ సారాంశం. అయితే, ‘ఛావా’ హీరో విక్కీ కౌశల్ ఈ వాదనను ఏమాత్రం అంగీకరించ లేదు. తాజాగా ఎన్డీటీవీ (NDTV)తో జరిగిన సంభాషణలో ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

"దేశభక్తిని ఒక ఫార్ములాగా చూడలేం. అలా అనడం ఆ గొప్ప భావోద్వేగాన్ని అవమానించడమే అవుతుంది. దేశభక్తి అనేది మనందరిలో ఉండే నిజం. దాన్ని మన సినిమాలు, సాహిత్యం, క్రీడల ద్వారా ఎప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంటాం" అని విక్కీ కౌశల్ పేర్కొన్నారు.

ఇదొక గొప్ప మార్గం

దేశంపై తమకున్న గర్వాన్ని చాటుకోవడానికి ఫిల్మ్ మేకర్స్‌కు ఇదొక గొప్ప మార్గమని విక్కీ కౌశల్ అన్నారు. "మన దేశంలోని వైవిధ్యం, వారసత్వం, సత్యం గురించి మేము గర్వంగా చెబుతున్నాం. అంతర్జాతీయ స్థాయిలో భారతీయతను భయం లేకుండా రిప్రజెంట్ చేస్తున్న ఈ గొప్ప సమయంలో నేను కూడా ఒక చిన్న భాగం కావడం నాకు గర్వంగా ఉంది" అని విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం థియేటర్లలో రచ్చ చేస్తోంది. రణ్‌వీర్ సింగ్ ఒక అండర్ కవర్ ఏజెంట్‌గా పాకిస్థాన్ టెర్రర్ నెట్‌వర్క్‌ను కూల్చే పాత్రలో మెప్పించారు.

వెయ్యి కోట్ల వైపుకు ధురంధర్

అక్షయ్ ఖన్నా, మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమా విడుదలైన కేవలం 17 రోజుల్లోనే రూ. 845 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే దురంధర్ రూ. 1000 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe