టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల (Virosh Wedding) వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న ఒక్కటైన ఈ జంట, బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ (Virosh Reception) ఏర్పాటు చేశారు. ఈ వేడుక ముగిసిన తర్వాత కెమెరా కళ్లకు చిక్కిన ఒక దృశ్యం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
భార్యను రక్షించుకున్న రౌడీ స్టార్!

రిసెప్షన్ వేడుక ముగిశాక విజయ్, రష్మిక కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో అభిమానులు, ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. రష్మికకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విజయ్ తన చేతులతో ఆమెను దగ్గరకు తీసుకుని, రక్షణ కవచంలా నిలబడ్డారు.
వేలు చూపిస్తూ
జనం ఒత్తిడి ఆమెపై పడకుండా జాగ్రత్త పడుతూనే.. ఎటో చూస్తున్న ఒక ఫోటోగ్రాఫర్‌ను ఉద్దేశించి హిందీలో "ఉదర్ దేఖ్" (అటు చూడు) అంటూ కెమెరా వైపు వేలు చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రౌడీ హీరో తీరును
"తన భార్యను తాను రక్షించుకుంటున్న తీరు అద్భుతం.. వీరు నిజంగా 'మేడ్ ఫర్ ఈచ్ అదర్'" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, "విజయ్ హిందీ చాలా బాగుంది" అని మరొకరు మెచ్చుకున్నారు. మొత్తానికి ఈ జంట ‘హజ్బెండ్-వైఫ్ గోల్స్’ సెట్ చేస్తున్నారని నెటిజన్లు మురిసిపోతున్నారు. భార్యను హత్తుకుని కాపాడిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీరును నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.
వేడుకలో సందడి చేసిన తారలు
ఇకపోతే విరోష్ రిసెప్షన్ వేడుకలో విజయ్ క్రీమ్ కలర్ కుర్తా, ధోతీలో ఎంతో హుందాగా కనిపించగా.. రష్మిక మందన్నా ఎరుపు, బంగారు రంగు కలనేతలో ఉన్న పట్టుచీర, భారీ బంగారు ఆభరణాలు, నుదుటన సింధూరంతో మెరిసిపోయారు.
అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోవాలనుకుంటున్నాం
ఫోటోగ్రాఫర్లతో సరదాగా మాట్లాడిన విజయ్ దేవరకొండ "ఈ వేడుక ముగిశాక మేమిద్దరం ఎవరికీ తెలియకుండా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోవాలనుకుంటున్నాం (అంటే ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాం)" అని జోక్ చేయడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
మెరిసిన టాలీవుడ్ తారలు
{{/usCountry}}ఫోటోగ్రాఫర్లతో సరదాగా మాట్లాడిన విజయ్ దేవరకొండ "ఈ వేడుక ముగిశాక మేమిద్దరం ఎవరికీ తెలియకుండా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోవాలనుకుంటున్నాం (అంటే ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాం)" అని జోక్ చేయడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
మెరిసిన టాలీవుడ్ తారలు
{{/usCountry}}విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, నాని వంటి టాలీవుడ్ దిగ్గజాలతో పాటు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, కృతి సనన్, మృణాల్ ఠాకూర్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రేమ నుంచి పెళ్లి దాకా..
చాలా కాలంగా ప్రేమలో ఉన్నారన్న వార్తలపై ఎప్పుడూ నోరు విప్పని విరోష్ జంట గత ఏడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫిబ్రవరిలో తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించి, ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. తమ సంతోషాన్ని పంచుకుంటూ వివిధ నగరాల్లోని అభిమానులకు మిఠాయిలు పంపడంతో పాటు, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అభిమానుల కోసం విందు కూడా ఏర్పాటు చేయడం విశేషం.