...
...
Next Story

OTT Crime: ఓటీటీలోకి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్-డ్రమ్ కేసుతో ప్రోమో-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bigg Boss Winner Nikhil OTT Web Series Vikram On Duty Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా తెరకెక్కిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీ. ఇటీవల ఈ సిరీస్ ప్రోమోను రిలీజ్ చేశారు. విక్రమ్ ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Feb 28, 2026, 12:15:09 IST
Advertisement

తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా తెరకెక్కిన ఓటీటీ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’. తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇటీవల విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

డ్రమ్ కేసుతో

ఓటీటీలోకి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్-డ్రమ్ కేసుతో ప్రోమో-స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్-డ్రమ్ కేసుతో ప్రోమో-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పుడు సోషల్ మీడియాలో విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రోమో వైరల్ అవుతుంది. డ్రమ్ కేసుతో చూపించిన ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. అన్ని రకాల అంశాలను జోడించి ఈ ఓటీటీ సిరీస్‌ను తెరకెక్కించినట్టుగా ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది. నిఖిల్ మాలియాక్కల్ ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా అదరగొట్టబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్షన్

ఇక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో నిఖిల్ కనిపించనున్నాడు. ఓ వైపు సీరియస్‌గా కేసు గురించి చెబుతూ ఉండటం.. మరో వైపు ఆటో వాడితో బేరం ఆడుతూ విక్రమ్ పాత్రలో నిఖిల్ ఎంట్రీ ఇవ్వడం.. అదిరిపోయింది. డ్రమ్‌లో బాడీ పెట్టారేంటీ, స్ట్రెచర్ రాలేదా అంటూ సైటెర్లు వేయడం, ఏడుస్తున్న ఆవిడతో ఆకలేస్తుంది, తినడానికేమైనా ఉందా అని అడగడం వంటి డైలాగ్స్ బాగున్నాయి.

సెల్యూట్ అయిన బుల్లెట్ అయిన

ఆస్తి కోసం బాబును చంపి డ్రమ్‌లో పెట్టింది ఎవరో విక్రమ్ కనిపెట్టిన తీరు బాగుంది. ఆ తర్వాత విక్రమ్ పాత్రకు తన పై అధికారి "వీడికి యూనిఫామ్ అవసరం లేదు" అంటూ ఎలివేషన్ ఇచ్చే డైలాగ్స్ బాగున్నాయి. "కనీసం మీకు సెల్యూట్ కూడా చేయలేదు?" అని మరో ఆఫీసర్ అంటే.. "సెల్యూట్ అయిన బుల్లెట్ అయిన అవసరం ఉన్నప్పుడే" అని విక్రమ్ చెప్పే డైలాగ్‌తో ప్రోమోను ఎండ్ చేశారు.

ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో క్రైమ్

నేరాలు ఏంటీ?, మరి ఆ నేరాల్ని ఎవరు చేశారు? వాటి వెనుకున్న రహస్యాలు ఏంటి? ఎవ్వరూ పట్టించుకోని చిన్న చిన్న ఆధారాలతో విక్రమ్ కేస్‌ని ఎలా పరిష్కరిస్తాడు? అన్నదే ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీ కథాంశం.

కీలక పాత్రలో అషు రెడ్డి

కాగా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)లోని ఓ డిఫరెంట్ స్టైల్‌లో పని చేసే పోలీసు అధికారి విక్రమ్ వాసు పాత్రలో నిఖిల్ చాలా కొత్తగా కనిపించనున్నారు. అలాగే, ఈ సిరీస్‌లో అషు రెడ్డి కీలక పాత్రలో నటించారు.

విక్రమ్ ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్‌లో విక్రమ్ ఆన్ డ్యూటీ ఓటీటీ రిలీజ్ కానుంది. మార్చి 6 నుంచి హాట్‌స్టార్‌లో విక్రమ్ ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks