Weight loss tips : 2 నెలల్లో 20 కేజీలు! అదరగొట్టిన అంజలి- ఈ టిప్స్​ ఫాలో అయితే మీరు కూడా..

బరువు తగ్గడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. నేటి కాలంలో ఖరీదైన డైట్ ప్లాన్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌ల కంటే ఇంట్లో లభించే సహజ ఆహారంతో బరువు తగ్గడానికే చాలామంది మొగ్గు చూపుతున్నారు. కంటెంట్ క్రియేటర్ అంజలి సచన్ కేవలం రెండు నెలల్లో 20 కిలోలు తగ్గి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

Published on: May 8, 2026, 15:28:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంటర్నెట్‌లో వెయిట్ లాస్ చిట్కాలకు కొదవ లేదు. అయితే, చాలా ప్లాన్‌లు పాటించడం కష్టంగా ఉంటాయి. కానీ అంజలి సచన్ అనే కంటెంట్​ క్రియేటర్ పంచుకున్న చిట్కాలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండటంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె తన వెయిట్ లాస్ జర్నీలో ఎటువంటి ఖరీదైన ‘హెల్త్ ప్రొడక్ట్స్’ వాడకుండా, ఇంటి భోజనంతోనే ఈ విజయం సాధించడం విశేషం.

2 నెలల్లో 20 కేజీలు తగ్గిన కంటెంట్​ క్రియేటర్..
2 నెలల్లో 20 కేజీలు తగ్గిన కంటెంట్​ క్రియేటర్..

అసలు రహస్యం: క్యాలరీ డెఫిసిట్..

బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది 'క్యాలరీ డెఫిసిట్'. అంటే మన శరీరం రోజూ ఖర్చు చేసే క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలను ఆహారం ద్వారా తీసుకోవడం. అంజలి తన ప్రయాణంలో దీనినే ప్రధాన సూత్రంగా పెట్టుకున్నారు. దీనికి తోడు ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఆకలిని అదుపులో ఉంచుకున్నట్లు ఆమె తెలిపారు.

అంజలి అనుసరించిన 12 కఠినమైన నియమాలు..

క్రమశిక్షణతో కూడిన జీవనశైలే తన మార్పుకు కారణమని చెబుతూ, ఆమె ఈ కింది 12 సూత్రాలను పంచుకున్నారు:

క్యాలరీ డెఫిసిట్: తీసుకునే ఆహార పరిమాణంపై నియంత్రణ.

ప్రోటీన్ + ఫైబర్: ప్రతి పూట భోజనంలో ఇవి తప్పనిసరి.

లో-కార్బ్: పిండి పదార్థాలను తగ్గించడం.

చక్కెరకు స్వస్తి: స్వీట్లు, కూల్ డ్రింక్స్‌కు పూర్తిగా దూరం.

తక్కువ నూనె, ఉప్పు: ఆహారంలో వీటి వాడకాన్ని బాగా తగ్గించారు.

15 వేల అడుగులు: ప్రతిరోజూ 15,000 అడుగులు నడవడం.

ఫాస్టింగ్: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం.

వెయిట్ ట్రైనింగ్: కండరాల బలం కోసం వెయిట్ లిఫ్టింగ్ చేయడం.

సమయానికి నిద్ర: కనీసం 7-8 గంటల గాఢ నిద్ర.

ఓఎంఏడీ (వన్ మీల్ ఏ డే): అవసరమైనప్పుడు రోజుకు ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం.

6 గంటలకే డిన్నర్: రాత్రి 6 గంటల తర్వాత ఏమీ తినకపోవడం.

స్నాక్స్‌కు నో: అనవసరమైన చిరుతిళ్లు, స్నాక్స్‌ను పూర్తిగా మానేయడం.

7 రోజుల డైట్ ప్లాన్ (వెజ్ అండ్ నాన్-వెజ్)..

ఆమె తన ఫాలోవర్ల కోసం ఒక వారపు డైట్ చార్ట్‌ను కూడా అందించారు:

శాకాహారులకు: పనీర్ భుర్జీ, తోఫు, సోయా చంక్స్, మొలకల సలాడ్, గ్రీక్ యోగర్ట్, పెసరట్టు (మూంగ్ దాల్​ చీలా), రాజ్మా, వెజిటబుల్ సూప్.

మాంసాహారులకు: గుడ్లు, చికెన్, చేపలు, ఓట్స్ విత్ వే ప్రోటీన్, చికెన్ సలాడ్ మరియు ఎగ్ భుర్జీ.

నిపుణుల హెచ్చరిక..

అంజలి సచన్ సాధించిన మార్పు స్ఫూర్తిదాయకమే అయినప్పటికీ, నిపుణులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో (నెలకు 10 కిలోలు) బరువు తగ్గడం అందరి శరీర తత్వాలకు సరిపడకపోవచ్చు! ఏదైనా డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు మీ శరీర రకం, జీవనశైలి, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More