Work from home : ‘వెంటనే ఆఫీసులకు వెళ్లిపోండి’- వర్క్ ఫ్రమ్ హోమ్‌తో లాభాల కన్నా నష్టాల్లే ఎక్కువ!
Work from home side effects : కరోనా కాలంలో మొదలైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' సంస్కృతి ఇప్పుడు శాపంగా మారుతోందా? ముఖ్యంగా కెరీర్, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలనుకునే మహిళల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందా? అంటే అవును అనే అంటున్నారు నిపుణులు.
Work from home disadvantages : 2020లో కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆ సమయంలో సమాజం అనివార్యంగా టెక్నాలజీ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఒక వరంలా వచ్చి చేరింది. మొదట్లో ఇది ఎంతో సౌకర్యంగా అనిపించినప్పటికీ, గడిచిన నాలుగేళ్లలో దీని వెనుక ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంపై గుర్గావ్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ సోషల్ మీడియా వేదికగా కీలక విషయాలను పంచుకున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 'బేన్' (శాపం) అని, ముఖ్యంగా కొత్తగా తల్లులైన వారికి ఇది మరింత ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.
ఇంటి పని.. ఆఫీసు పని.. మధ్యలో ఆరోగ్యం ఫసక్!
డాక్టర్ సెహ్రావత్ క్లినిక్‌కు వచ్చే రోగులలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి సంఖ్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. నిరంతరం ఇంట్లోనే ఉంటూ పని చేయడం వల్ల ప్రజల్లో కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఆమె గుర్తించారు:
మైగ్రేన్, తలనొప్పి: స్క్రీన్ టైమ్ పెరగడం, పని వేళల్లో స్పష్టత లేకపోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి బాధిస్తోంది.
నిద్రలేమి: ఇంటి వాతావరణంలో ఆఫీసు పని చేయడం వల్ల మెదడు విశ్రాంతి తీసుకోలేకపోతోంది.
మెడ నొప్పి : సరైన పోశ్చర్ లేకపోవడం, గంటల తరబడి ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం వల్ల వెన్నెముక సమస్యలు వస్తున్నాయి.
"వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వ్యక్తులు అటు ఇంటి పనిపై కానీ, ఇటు ఆఫీసు పనిపై కానీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ అయోమయమే ఒత్తిడికి ప్రధాన కారణం," అని డాక్టర్ ప్రియాంక వివరించారు.
కొత్త తల్లులకు 'మల్టీ టాస్కింగ్' గండం..
సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న తల్లులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతారు. బిడ్డను కళ్లముందే చూసుకోవచ్చు, అలాగే కెరీర్‌ను వదులుకోవాల్సిన పని లేదని భావిస్తారు. మహిళలు సహజంగానే మల్టీ టాస్కింగ్‌లో దిట్టలని, కానీ అదే వారికి శత్రువుగా మారుతోందని డాక్టర్ అభిప్రాయపడ్డారు.
"అన్నింటినీ చక్కబెట్టే క్రమంలో మహిళలు తమ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరోగ్యం వెనుక సీటుకు వెళ్ళిపోతోంది," అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పని మీద మాత్రమే కాకుండా, తమ శరీరం ఇచ్చే సంకేతాల మీద కూడా దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటి?
ఇది కేవలం మహిళలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, కుటుంబం మొత్తం బాధ్యత తీసుకోవాలని డాక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు.
తల్లి ఆఫీసు పనిలో ఉన్నప్పుడు పిల్లలను చూసుకోవడం, ఇంటి పనుల్లో సాయం చేయడం వంటివి కుటుంబ సభ్యులు చేయాలి.
ఆమెకు తగినంత నిద్ర, విశ్రాంతి లభించేలా చూడాలి.
మానసిక ప్రశాంతత కోసం ఆమెకు నచ్చిన హాబీలకు సమయం కేటాయించేలా ప్రోత్సహించాలి.
"ఇది ఒక ఉమ్మడి ప్రయత్నం కావాలి. అప్పుడే మహిళలు అటు వృత్తిలో, ఇటు వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యంగా ఉండగలరు," అని ఆమె సందేశాన్ని ఇచ్చారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏమిటి?
నిరంతరం డిజిటల్ స్క్రీన్ల ముందు ఉండటం వల్ల మైగ్రేన్, తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి, మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
2. మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు కష్టంగా మారుతోంది?
ఇంటి బాధ్యతలు, ఆఫీసు డెడ్ లైన్స్ మధ్య బ్యాలెన్స్ చేసే క్రమంలో మహిళలు 'మల్టీ టాస్కింగ్' ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.
3. కొత్త తల్లులు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
పని మధ్యలో విరామం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కుటుంబ సభ్యుల సహాయం కోరడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
4. కుటుంబ సభ్యులు ఎలా మద్దతు ఇవ్వాలి?
తల్లి పని వేళల్లో పిల్లల బాధ్యతను తీసుకోవడం, ఆమెకు తగినంత విశ్రాంతి దొరికేలా చూడటం ద్వారా కుటుంబం తోడ్పాటును అందించవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


