Tips and tricks : ఇంట్లోనే 10వేల స్టెప్స్​ ఎలా పూర్తి చేయాలి? ఈ సీక్రెట్​ టిప్స్​ తెలుసుకోండి..

Weight loss tips : బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ముందుగా వచ్చే సలహా.. రోజుకు 10వేల స్టెప్స్​ వేయమని! కానీ చాలా మందికి ఇది సాధ్యం కాదు. అయితే ఇంట్లోనే ఉంటూ 10వేల అడుగులు ఎలా పూర్తి చేయాలో ఒక ఫిట్​నెట్​ ట్రైనర్ వివరించారు. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 31, 2026, 05:32:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుందని వైద్యులు చెబుతుంటారు. అయితే నేటి బిజీ లైఫ్, ఆఫీస్ పని గంటలు, బయట ఉండే తీవ్రమైన ఎండలు లేదా వర్షాల కారణంగా చాలా మందికి బయటకు వెళ్లి నడవడం సాధ్యం కావడం లేదు. కానీ, ఎలాంటి జిమ్ సామాగ్రి లేకుండా, కనీసం ఇంటి బయటకు కూడా వెళ్లకుండా.. కేవలం 65 నిమిషాల లోపే.. ఇంటి లోపలే 10,000 అడుగులు పూర్తి చేయవచ్చని చెబుతున్నారు ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రీత్ కౌర్. ఇందుకోసం నిమిషానికి సగటున 167 అడుగులు వేసేలా ఆమె రూపొందించిన ఒక అద్భుతమైన ఇండోర్ వర్కౌట్ ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

ఇంట్లోనే 10వేల స్టెప్స్ వేయడం ఎలా..
ఇంట్లోనే 10వేల స్టెప్స్ వేయడం ఎలా..

ఇంటి లోపల బోర్ కొట్టకుండా, సులభంగా ఒకే గంటలో 10,000 అడుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి రీత్ కౌర్ సూచించిన పూర్తి వర్కౌట్ ప్లాన్ షెడ్యూల్ ఇక్కడ ఉంది:

1. వార్మ్-అప్ (వ్యాయామానికి ముందు - 5 నిమిషాలు)

వర్కౌట్ నేరుగా ప్రారంభించకుండా కండరాల నొప్పులు, గాయాలు కాకుండా ఉండేందుకు శరీరాన్ని సిద్ధం చేయాలి.

చేయాల్సినవి: ఒకే చోట నిలబడి మార్చింగ్ చేయడం, చేతులను తిప్పడం, లైట్‌గా పక్కలకు అడుగులు వేయడం.

లభించే అడుగులు: ఈ 5 నిమిషాల వార్మ్-అప్‌లోనే మీరు దాదాపు 500 అడుగులు పూర్తి చేస్తారు.

2. మెయిన్ ఇండోర్ వర్కౌట్ (50 నిమిషాలు)

ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి కింది వ్యాయామాలను మారుస్తూ చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటుంది:

హై-knee (నీ) మార్చింగ్ లేదా జాగింగ్ (5-10 నిమిషాలు): ఒకే చోట నిలబడి మోకాళ్లను పైకి లేపుతూ జోగింగ్ చేయాలి. చేతులను కూడా లయబద్ధంగా కదిలించడం వల్ల వేగంగా అడుగులు పడతాయి. దీనివల్ల 1,200 నుంచి 1,500 అడుగులు వస్తాయి.

మెట్లు లేదా కుర్చీపై స్టెప్-అప్స్ (5 నిమిషాలు): ఇంట్లో ఉండే మెట్లు లేదా ఏదైనా బలమైన కుర్చీపైకి ఒకదాని తర్వాత ఒకటిగా కాళ్లు మారుస్తూ ఎక్కి దిగాలి. ఇది కాళ్లకు బలాన్ని ఇస్తుంది. దీనివల్ల 600 నుంచి 800 అడుగులు లభిస్తాయి.

ఫ్రీస్టైల్ డాన్స్ లేదా జుంబా (10 నిమిషాలు): మీకు నచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ పెట్టుకుని ఫ్రీగా డాన్స్ చేయండి. ఈ ఉత్సాహభరితమైన మూవ్‌మెంట్ వల్ల ఏకంగా 1,500 కంటే ఎక్కువ అడుగులు యాడ్ అవుతాయి.

3. కాంబో, ఇంటర్వెల్ మూవ్‌మెంట్స్..

వాక్ అండ్ లంజ్ కాంబో (5 నిమిషాలు):

మీ రూమ్‌లో 10 అడుగులు సాధారణంగా నడిచిన తర్వాత, ఐదుసార్లు లంజెస్ (Lunges - మోకాళ్లపై ముందుకు వంగడం) చేయాలి. ఇలా రూమ్ అంతటా రిపీట్ చేయడం వల్ల లోయర్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల 500 అడుగులు వస్తాయి.

సైడ్ స్టెప్స్ అండ్ స్కేటర్ జంప్స్ (5 నిమిషాలు): పక్కలకు వెడల్పుగా అడుగులు వేస్తూ చిన్నగా గెంతడం (హాప్స్). ఇది కాళ్లు, కోర్ కండరాలకు మంచిది. దీనివల్ల 800 అడుగులు వస్తాయి.

ఫాస్ట్ స్టెప్ క్లైంబింగ్ (10 నిమిషాలు): ఇంట్లో మెట్లు ఉంటే వేగంగా ఎక్కి దిగడం లేదా స్పీడ్‌గా పవర్ మార్చింగ్ చేయడం ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే ఏకంగా 2,000 అడుగుల వరకు సాధించవచ్చు.

4. కూల్ డౌన్, స్ట్రెచింగ్ (చివరి 5 నిమిషాలు)..

హై-ఇంటెన్సిటీ వర్కౌట్ పూర్తయిన తర్వాత గుండె వేగాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు, కండరాల రికవరీకి ఇది చాలా ముఖ్యం.

చేయాల్సినవి: చాలా నెమ్మదిగా నడవడం, లోతుగా శ్వాస తీసుకోవడం, స్ట్రెచింగ్ (శరీరాన్ని సాగదీయడం) చేయాలి.

లభించే అడుగులు: ఈ ప్రశాంతమైన ముగింపుతో మిగిలిన చివరి 500 అడుగులు పూర్తవుతాయి.

ఈ విధంగా బయట వాతావరణంతో సంబంధం లేకుండా, రోజుకు కేవలం ఒక గంట సమయాన్ని కేటాయించి మీ ఇంట్లోనే 10,000 అడుగుల ఫిట్‌నెస్ లక్ష్యాన్ని సులభంగా, సరదాగా పూర్తి చేయవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More