Yawning Effect On Ears : ఆవలింత వల్ల ఎందుకు స్పష్టంగా వినిపిస్తుంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి?
ఎప్పుడైనా గమనించారా? ఆవలింత తర్వాత ఏ శబ్ధం అయినా స్పష్టంగా వినిపిస్తుంది. దీనికి కారణాలేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
ఆవలింత అనేది రోజులో చాలాసార్లు వస్తుంటుంది. నిద్ర వచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు, కొన్నిసార్లు బోర్‌గా ఉన్నప్పుడు.. మరికొన్నిసార్లు ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండా కూడా ఆవలింత వస్తుంది. దీనిని చాలావరకు నిద్రతో కనెక్ట్ చేసి మాట్లాడుతాం. ఇది సాధారణ శారీరక చర్య. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆవలింత తర్వాత వెంటనే చుట్టుపక్కల శబ్దాలు స్పష్టంగా, బిగ్గరగా వినిపిస్తాయి. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

మన చెవుల లోపల యూస్టాకియన్ ట్యూబ్ అని పిలిచే ఒక చిన్న గొట్టం ఉంటుంది. ఈ గొట్టం మన మధ్య చెవిని గొంతుకు కలుపుతుంది. సాధారణంగా ఇది మూసి ఉంటుంది. మనం ఆవలిస్తున్నప్పుడు, నోరు, దవడ సంకోచించడం వల్ల ఈ గొట్టం తెరుచుకుంటుంది. ఇది చెవి లోపల, బయట గాలి పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. కర్ణభేరి సరిగ్గా కంపించడం మొదలవుతుంది. దీంతో శబ్దాలు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. ఆవలింత అనేది ప్రాథమికంగా మీ చెవులలోని రీసెట్ బటన్‌ను నొక్కినట్లు అని చెబుతుంటారు.
ఆవలిస్తున్నప్పుడు చెవి లోపల ఉండే టెన్సర్ టింపాని కండరం, స్టెపీడియస్ కండరం అనే రెండు చిన్న కండరాలు తాత్కాలికంగా ఉత్తేజితమవుతాయి. ఈ కండరాలు తాత్కాలికంగా కర్ణభేరిని బిగుతుగా చేస్తాయి, దీనివల్ల శబ్దాలు మసకగా వినిపిస్తాయి. ఈ కండరాలు సడలగానే, మీ వినికిడి శక్తి మెరుగుపడుతుంది. అందుకే ఆవలింత తర్వాత మీరు శబ్దాలను మరింత స్పష్టంగా వింటారు.
ఆవలింత శరీరంలో రక్త ప్రసరణను కొద్దిగా పెంచుతుంది. దీనివల్ల మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది, వినికిడి శక్తి కొద్దిగా మెరుగుపడవచ్చు, మీరు చుట్టుపక్కల శబ్ధాలను మరింత శ్రద్ధగా వింటారు. ఆవలింత చెవి లోపల ఉన్న కండరాలను ఉత్తేజపరుస్తుంది.
మీరు పదేపదే ఎక్కువగా ఆవలిస్తుంటే.. లేదా ఒక చెవి తెరుచుకుని మరొకటి మూసుకుపోయినట్టుగా లేదా మీ చెవులలో నిరంతరం బరువుగా అనిపిస్తే, పదేపదే చెవులు మూసుకుపోతున్నట్లు అనిపిస్తే ఇది మీ యూస్టాకియన్ ట్యూబ్‌లో సమస్యకు సంకేతం కావచ్చు. ఇది అలర్జీలు, సైనస్ సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా సంభవించవచ్చు. ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


