2026 Maruti Suzuki Brezza : మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు, వాటి ఫీచర్లు..
Maruti Suzuki Brezza facelift : మారుతీ సుజుకీ.. 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 7.40 లక్షల ఆరంభ ధరతో లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ ఇంజిన్ ఆప్షన్లు, వేరియంట్లు, వాటి ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన మారుతీ సుజుకీ బ్రెజ్జా ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్లోకి వచ్చింది. 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, మరింత ప్రీమియం ఇంటీరియర్, సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, వైవిధ్యమైన ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 7.40 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.

కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది — ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ+. కొనుగోలుదారులు తమ అభిరుచికి తగినట్లుగా 9 రకాల రంగులలో (మోనోటోన్, డ్యూయల్-టోన్) ఈ కారును ఎంచుకోవచ్చు. డ్యూయల్-టోన్ రంగులు జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ+ వంటి టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్..
1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్: ఈ కొత్త డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అన్ని వేరియంట్లలోనూ లభిస్తుంది.
1.5-లీటర్ కే15సీ పెట్రోల్: ఇది ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ మోడళ్లలో 6-స్పీడ్ మాన్యువల్‌గాను, వీఎక్స్ఐ నుంచి పై వేరియంట్లలో 6-స్పీడ్ ఆటోమేటిక్ (ఏటీ) గాను అందుబాటులో ఉంటుంది.
1.5-లీటర్ సీఎన్జీ (ఫ్యాక్టరీ ఫిట్టెడ్): ఇది ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. అయితే టాప్-ఎండ్ జెడ్ఎక్స్ఐ+ మోడల్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్- వేరియంట్ల వారీగా ఫీచర్ల వివరాలు..
1. బ్రెజ్జా ఎల్ఎక్స్ఐ (బేస్ వేరియంట్)-
తక్కువ బడ్జెట్‌లోనూ మెరుగైన భద్రతతో కూడిన ఎస్‌యూవీని కోరుకునే వారికి ఇది అనుకూలం.
భద్రత: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్-హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ యాంకర్లు, అందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టైర్ రిపేర్ కిట్.
ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్: టిల్ట్-అడ్జస్ట్ స్టీరింగ్, కీలేస్ ఎంట్రీ, డ్రైవర్ వైపు ఆటో అప్/డౌన్ పవర్ విండో, రియర్ ఏసీ వెంట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టైల్-ల్యాంప్‌లు, రూఫ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, వీల్ కవర్లతో 16-అంగుళాల స్టీల్ వీల్స్, ఫ్యాబ్రిక్ సీట్లు.
టర్బో వర్షన్ ప్రత్యేకత: ఎల్ఎక్స్ఐ టర్బో ఎంచుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, రియర్ డిఫాగర్ అదనంగా లభిస్తాయి.
2. బ్రెజ్జా వీఎక్స్ఐ (వాల్యూ ఫర్ మనీ)-
కనీస కనెక్టివిటీ ఫీచర్లు, వినోదాన్ని కోరుకునే వారికి వీఎక్స్ఐ బెస్ట్ ఆప్షన్.
ఎల్ఎక్స్ఐ కంటే అదనపు ఫీచర్లు: 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే- ఆండ్రాయిడ్ ఆటో, అర్కమిస్ సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, సుజుకి వాయిస్ అసిస్టెంట్, రిమోట్ ఇన్ఫోటైన్‌మెంట్ యాప్.
సౌకర్యాలు: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్ డిఫాగర్.
టర్బో వర్షన్ ప్రత్యేకతలు: వీఎక్స్ఐ టర్బో ఎంచుకుంటే రివర్స్ పార్కింగ్ కెమెరా, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్వీఎంలు లభిస్తాయి.
3. బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ (ఫీచర్ రిచ్ మోడల్)-
ప్రీమియం లుక్, సన్‌రూఫ్ కోరుకునే కొనుగోలుదారులకు మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ జెడ్ఎక్స్ఐ సరైన ఎంపిక.
వీఎక్స్ఐ కంటే అదనపు ఫీచర్లు: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, 60:40 స్ప్లిట్ సీట్లు, రూఫ్ రైల్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కప్‌హోల్డర్‌తో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, యంబియంట్ లైటింగ్, పార్సెల్ ట్రే.
టర్బో వర్షన్ ప్రత్యేకతలు: జెడ్ఎక్స్ఐ టర్బోలో ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రియర్ వైపర్, వాషర్, క్రూయిజ్ కంట్రోల్, ట్వీటర్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, బ్లైండ్-స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి అత్యాధునిక రక్షణ ఫీచర్లు ఉన్నాయి.
4. బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ+ (టాప్-ఎండ్ ఫ్లాగ్‌షిప్)-
టెక్నాలజీ, లగ్జరీకి పెద్దపీట వేసే వారి కోసం పూర్తిగా లోడ్ చేసిన వేరియంట్ ఇది.
జెడ్ఎక్స్ఐ కంటే అదనపు ఫీచర్లు: 10.1-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అర్కమిస్ సరౌండ్ సెన్స్ ఆడియో, సుజుకీ కనెక్ట్ (కనెక్టెడ్ కార్ టెక్నాలజీ), లగ్జరీ లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 64 రంగుల యాంబియంట్ లైటింగ్, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్.
సౌకర్యాలు, సేఫ్టీ: 360-డిగ్రీ కెమెరా, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్వీఎంలు, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, అలెక్సా ఆటో వాయిస్ అసిస్టెంట్, లైవ్ ట్రాఫిక్‌తో ఇన్-బిల్ట్ నేవిగేషన్, PM2.5 ఎయిర్ ఫిల్టర్ (ఏక్యూఐ డిస్‌ప్లేతో), రియర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్బీ పోర్టులు (టైప్-ఏ అండ్ టైప్-C), బ్లైండ్-స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్.
మీ బడ్జెట్, అవసరాలను బట్టి ఈ మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో సరైన వేరియంట్‌ను ఎంచుకోవడం ద్వారా అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


