33ఏళ్ల పాటు ప్రపంచ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా.. జెన్సన్ హువాంగ్ పేర్లు వేరు వేరు కాదన్నట్టు సాగిన అద్భుత ప్రస్థానానికి గురువారం తెరపడింది. ఒక సాధారణ రెస్టారెంట్ టేబుల్ వద్ద ముగ్గురు మిత్రులు, 40 వేల డాలర్ల పెట్టుబడితో మొదలై నేడు 4.5 ట్రిలియన్ డాలర్ల మహా సామ్రాజ్యంగా ఎదిగిన ఎన్విడియా సీఈఓ పదవితో పాటు డైరెక్టర్ల బోర్డుకు 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు.
గత 14 రోజులుగా బహిరంగంగా, అంతకుముందు ఎన్నో నెలలుగా తెరవెనుక రగులుతున్న ఒక వివాహేతర సంబంధం చివరకు అమెరికా జాతీయ భద్రతకే ముప్పుగా పరిణమించడంతో హువాంగ్ తప్పుకోవాల్సి వచ్చింది.
టాయిలెట్లు కడగడం నుంచి టెక్ రారాజు వరకు..
1963లో తైపీలో 'జెన్-హున్'గా జన్మించిన హువాంగ్, బాల్యంలో థాయ్‌లాండ్‌లో పెరిగారు. అమెరికాకు వలస వెళ్లిన తర్వాత ఉచ్చారణ సులభంగా ఉంటుందని తన పేరును 'జెన్సన్'గా మార్చుకున్నారు. చిన్నతనంలో ఒక బంధువు సలహా మేరకు తల్లిదండ్రులు ఆయన్ని, ఆయన సోదరుడిని కెంటకీలోని ఒక చిన్న పట్టణంలో ఉన్న బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. అది ఎంతో ప్రతిష్ఠాత్మక పాఠశాల అని వారు భావించారు కానీ, వాస్తవానికి అది దారితప్పిన యువతను సంస్కరించే కేంద్రం! వయసు చిన్నది కావడంతో అక్కడ ఉంటూనే సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పొగాకు రైతుల పిల్లలతో కలిసి జెన్సన్ చదువుకున్నారు. ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో తోటి విద్యార్థులు ఆయన్ని హేళన చేసేవారు.
జెన్సన్ హువాంగ్ అక్కడ టాయిలెట్లు కూడా శుభ్రం చేయాల్సి వచ్చింది.
"మేము చాలా కష్టపడి పనిచేశాం, కష్టపడి చదువుకున్నాం. అక్కడి పిల్లలు చాలా కఠినంగా ఉండేవారు. కానీ కథ ముగింపు ఏంటంటే.. నేను ఆ సమయాన్ని ఎంతో ఇష్టపడ్డాను," అని హువాంగ్ గతంలో అమెరికా రేడియో సంస్థ ఎన్పీఆర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
ఆ తర్వాత ఒరెగాన్‌లో స్థిరపడిన తల్లిదండ్రులు ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. టీనేజ్‌లో ‘డెన్నీస్’ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తూనే పోర్ట్‌ల్యాండ్ హైస్కూల్ కంప్యూటర్ క్లబ్లో చేరారు. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే తన (కాబోయే) భార్య లోరీని కలుసుకున్నారు. 20 ఏళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, నేడు తమకు ప్రత్యర్థిగా ఉన్న ఏఎండీ సంస్థలో, ఆ తర్వాత ఎల్ఎస్ఐ లాజిక్‌లో చిప్ డిజైనర్‌గా పనిచేశారు.
{{/usCountry}}ఆ తర్వాత ఒరెగాన్‌లో స్థిరపడిన తల్లిదండ్రులు ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. టీనేజ్‌లో ‘డెన్నీస్’ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తూనే పోర్ట్‌ల్యాండ్ హైస్కూల్ కంప్యూటర్ క్లబ్లో చేరారు. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే తన (కాబోయే) భార్య లోరీని కలుసుకున్నారు. 20 ఏళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, నేడు తమకు ప్రత్యర్థిగా ఉన్న ఏఎండీ సంస్థలో, ఆ తర్వాత ఎల్ఎస్ఐ లాజిక్‌లో చిప్ డిజైనర్‌గా పనిచేశారు.
{{/usCountry}}1993లో సిలికాన్ వ్యాలీలోని డెన్నీస్ రెస్టారెంట్లో కూర్చుని ఇద్దరు మిత్రులతో కలిసి ఎన్విడియాకు పునాది వేశారు. "సాధారణ కంప్యూటర్లు పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలను 3డీ గ్రాఫిక్స్ చిప్‌ల సాయంతో పరిష్కరించాలని నేను కోరుకున్నాను," అని 'నో ప్రయర్స్' పాడ్‌కాస్ట్‌లో ఆయన తన లక్ష్యాన్ని వివరించారు.
1999లో ఎన్విడియా తొలి జీపీయూ తయారు చేసింది. తొలుత వీడియో గేమ్స్ కోసం రూపొందించిన ఈ చిప్లే నేడు చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌కు ప్రాణవాయువుగా మారాయి. ఈ విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని కూడా కంట్రోల్ చేసే స్థాయికి జెన్సన్ ఎదిగారు.
నేడు ఎన్విడియా చిప్‌లకు సరఫరాకు మించిన డిమాండ్ ఉంది. కంపెనీ ఏకంగా 70 శాతానికి పైగా లాభాల మార్జిన్‌తో విక్రయాలు జరుపుతోంది.
లెదర్ జాకెట్ బ్రాండ్.. కఠినమైన పనితీరు!
నాలుగేళ్ల క్రితం వరకు సామాన్యులకు పెద్దగా తెలియని హువాంగ్, ఏఐ విప్లవంతో సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఎప్పుడూ నల్లటి టీ-షర్ట్, లెదర్ జాకెట్ ధరించి, చేతిపై ఎన్విడియా లోగో పచ్చబొట్టుతో కనిపించే వారు. ఆయన జీవిత చరిత్ర రచయిత స్టీఫెన్ విట్ ప్రకారం.. ఆ లెదర్ జాకెట్లను ఆయన భార్య లోరీ ఎంపిక చేసేవారు. కంపెనీలో ఉన్న 3.6 నుంచి 4 శాతం వాటా ద్వారా ఆయన సంపద 160 బిలియన్ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.
సెమీకండక్టర్ల తయారీ కేంద్రమైన తైవాన్‌లో హువాంగ్‌కు సినీ హీరో రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడతారు. జర్నలిస్టులు ఆయన వెంట బార్బర్ షాపులకు, ఆయనకు ఇష్టమైన నైట్ మార్కెట్లకు కూడా వెళ్లేవారు. ఎన్విడియా చిప్‌లను తయారు చేసే టీఎస్ఎంసీ వ్యవస్థాపకుడు మోరిస్ చాంగ్ వంటి దిగ్గజాలతో జెన్సన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అయితే పని విషయంలో ఆయన ఎంతో కఠినంగా ఉండేవారని సహచరులు చెబుతారు.
"నేను కలిసిన వ్యక్తుల్లో అత్యంత పట్టుదల ఉన్న వ్యక్తి ఎన్విడియా (మాజీ) సీఈఓ జెన్సన్. ఆయన వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది. ఒకవైపు సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే, తప్పులు జరిగితే నిర్దాక్షిణ్యంగా చీల్చిచెండాడేవారు," అని ఒక మాజీ ఉన్నతోద్యోగి చెప్పారు.
"కంపెనీ దివాలా తీయడానికి ఎప్పుడూ కేవలం 30 రోజుల దూరంలోనే ఉంటుందని గుర్తుంచుకోండి," అని హువాంగ్ తన ఉద్యోగులను నిరంతరం హెచ్చరించేవారట.
వాషింగ్టన్ రాజకీయాలు.. ట్రంప్‌తో చెలిమి!
కెరీర్లో ఎక్కువ కాలం వాషింగ్టన్ రాజకీయాలకు దూరంగా ఉన్న హువాంగ్.. 2022 చివర్లో బైడెన్ ప్రభుత్వం చైనాకు అధునాతన చిప్‌ల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో రంగంలోకి దిగారు. ఈ ఆంక్షలు అమెరికా చిప్ పరిశ్రమనే దెబ్బతీస్తాయని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆయనతో హువాంగ్ అత్యంత సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో క్లబ్, వైట్ హౌస్‌లను సందర్శించి ట్రంప్ ఆర్థిక విధానాలను ప్రశంసించారు. అలా.. అమెరికాకు అనధికారిక ఏఐ సలహాదారుగా మారారు.
ఫలితంగా 2025 డిసెంబర్లో, ఎన్విడియాలో పెట్టుబడులు కూడా ఉన్న ట్రంప్, అమెరికాకు అమ్మకాల్లో వాటా ఇచ్చే షరతుపై అధునాతన హెచ్200 చిప్‌లను చైనాకు విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు. ఇది హువాంగ్‌కు పెద్ద విజయంగా నిలిచినా, చైనా వ్యతిరేక రాజకీయ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. జాతీయ భద్రత కంటే లాభాలకే హువాంగ్ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు విమర్శించారు.
జాతీయ భద్రతా సంక్షోభంగా మారిన అఫైర్!
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. చైనా పౌరురాలైన ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సంబంధంపై 2025 అక్టోబర్‌లో నిఘా వర్గాల దృష్టి పడింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ‘మెగాస్పీడ్’ అనే డేటా సెంటర్ కంపెనీలో ఆలిస్ గతంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. రెండేళ్లలో ఎన్విడియా నుంచి 4.8 బిలియన్ డాలర్లకు పైగా విలువైన చిప్‌లను కొనుగోలు చేసిన మెగాస్పీడ్, నిబంధనలకు విరుద్ధంగా వాటిని చైనా సంస్థలకు తరలిస్తోందా అన్న కోణంలో అమెరికా వాణిజ్య శాఖ దర్యాప్తు చేపట్టింది. ఆలిస్ హువాంగ్ బీజింగ్ కోసం సమాచారం సేకరిస్తున్నారని నిఘా అధికారులు ఏడాది క్రితమే ట్రంప్‌నకు నివేదించినా, అప్పట్లో ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదట.
2026 మే నెలలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అయ్యేందుకు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరారు. సరిగ్గా అంతకుముందే, విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో విమానంలోనే ట్రంప్‌ను అప్రమత్తం చేశారు. అనుమానిత చైనా గూఢచారితో హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందని అమెరికా నిఘా వర్గాల వద్ద ఆధారాలు ఉన్నాయని హెచ్చరించారు.
రాజీనామాకు దారితీసిన చివరి 14 రోజులు..
అక్టోబర్ 29న న్యూయార్క్ టైమ్స్ ఈ గూఢచర్యం, వివాహేతర సంబంధం వివరాలను బహిర్గతం చేయడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు అంగీకరిస్తూ నవంబర్ 8న హువాంగ్ ఉద్యోగులకు లేఖ రాశారు.
"నేను చేసిన పనికి ఎలాంటి సాకులు చెప్పలేను. నన్ను క్షమించండి," అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ మహిళ పేరును ప్రస్తావించలేదు. అదే రోజు ఎన్విడియా అంతర్గత విచారణకు ఆదేశించింది. "జెన్సన్ ఎలాంటి ఆటంకం లేకుండా సీఈఓగా ఎన్విడియాను నడిపించడానికి కట్టుబడి ఉన్నారు," అని కంపెనీ ప్రతినిధి జాన్ రిజ్జో అప్పట్లో ప్రకటించారు.
నవంబర్ 9న ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆలిస్ గూఢచారి అన్న సంగతి తనకూ తెలియదని హువాంగ్ తనతో చెప్పారని పేర్కొంటూ, "నేను ఆయనను నిజంగా నమ్ముతున్నాను," అని ట్రంప్ వెనకేసుకొచ్చారు.
కానీ నవంబర్ 11న న్యూయార్క్ టైమ్స్ మరో బాంబు పేల్చింది. ఎన్విడియాలోనే తన కింద పనిచేసే మరో ఉన్నతోద్యోగినితోనూ హువాంగ్‌కు సన్నిహిత సంబంధం ఉందని వెల్లడించింది. వరుస వివాదాల నేపథ్యంలో సమావేశమైన ఎన్విడియా బోర్డు, హువాంగ్ భవిష్యత్తుపై చర్చించింది. చివరకు గురువారం 33 ఏళ్ల తన సొంత కంపెనీ నుంచి జెన్సన్ హువాంగ్ నిష్క్రమించారు. శాశ్వత సీఈఓ ఎంపిక పూర్తయ్యే వరకు కొలెట్ క్రెస్ బాధ్యతలు చేపట్టనున్నారు.
జెన్సన్ రాజీనామా తర్వాత మరో బాంబు పేలింది! ఎన్విడియాలోని మరో ఉద్యోగినితో జెన్సన్కు వివాహేతర సంబంధం ఉందని వార్తలు బయటకు వచ్చాయి. 'మూడో అఫైర్' గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రపంచ ఏఐ విప్లవానికి దిశానిర్దేశం చేసిన ఒక అసాధారణ టెక్ మేధావి ప్రస్థానం ఇలా వివాదాల సుడిగుండంలో ముగిసిపోవడం సాంకేతిక చరిత్రలో ఊహించని మలుపుగా నిలిచిపోయింది.
ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. “ఏఐనే కంట్రోల్ చేసిన వ్యక్తి.. తన లస్ట్ని (కామం) నియంత్రించుకోలేకపోయాడు,” అని నెటిజన్లు అంటున్నారు.