...
...
Next Story

Monthly Horoscope: సెప్టెంబర్‌లో గ్రహాల మహా సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే?

సెప్టెంబర్ 2026లో శుక్రుడు, బుధుడు, సూర్యుడు, కుజుడు రాశులు మారడం, అలాగే శని వక్రగతిలో, రాహు–కేతువులు తమ స్థానాల్లో సంచరించడం వల్ల 12 రాశులపై భిన్నమైన ప్రభావాలు ఉండవచ్చని ఈ కథనం చెబుతోంది.

Published on: Aug 31, 2026, 16:00:38 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెల అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మాసంలో అనేక ప్రధాన గ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. దీనివల్ల మేషం మొదలుకుని మీన రాశి వరకు అన్ని రాశుల వారి ఆర్థిక, ఉద్యోగ, విద్యా మరియు కుటుంబ జీవితాలపై ప్రత్యేక ప్రభావం పడనుంది.

Monthly Horoscope: సెప్టెంబర్‌లో గ్రహాల మహా సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే? (AI)
Monthly Horoscope: సెప్టెంబర్‌లో గ్రహాల మహా సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే? (AI)

సెప్టెంబర్ 2న శుక్రుడు తులా రాశిలోకి, సెప్టెంబర్ 7న బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. అలాగే సెప్టెంబర్ 17న సూర్యుడు, సెప్టెంబర్ 18న కుజుడు తమ స్థానాలను మారుస్తారు. నెల చివరిలో సెప్టెంబర్ 26న బుధుడు మళ్లీ తులా రాశిలోకి వస్తాడు. మరోవైపు శని మీన రాశిలో వక్రగతిలో, రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల గమనం ఆధారంగా సెప్టెంబర్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

మేష రాశి

మేష రాశి వారికి సెప్టెంబర్ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో అదృష్టం మీకు పూర్తిగా తోడుగా నిలుస్తుంది. ఎప్పట్నుంచో నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలుగొందుతాయి, శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులకు చక్కటి అవకాశాలు దక్కుతాయి. సమాజంలో మంచి ప్రభావం ఉన్న వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ధన రాబడి మెరుగ్గా ఉంటుంది, కెరీర్‌లో పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. అయితే బంధాలు, సంబంధాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నోటి మాటపై నియంత్రణ లేకపోతే ప్రియమైన వారిని నొప్పించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురైనా, జీవిత భాగస్వామి మద్దతుతో అధిగమిస్తారు. నెల ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

మిథున రాశి

కర్కాటక రాశి వారికి వ్యాపారపరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఎదురైనప్పటికీ, మిగతా నెలంతా అద్భుతంగా సాగిపోతుంది. నెల ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. ఉపాధి నిమిత్తం చేసే ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది, కాకపోతే చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతిని పాడుచేసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను అందించనుంది. నెల ప్రారంభం అద్భుతంగా ఉన్నప్పటికీ, మధ్య కాలంలో పరిస్థితులు కొద్దిగా సవాలుగా మారవచ్చు. స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మనసులో చిన్నపాటి అశాంతి ఉన్నప్పటికీ, మీ చొరవతో సరైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు.

కన్య రాశి

కన్య రాశి వారికి సెప్టెంబర్ నెల ఎంతో చక్కటి ఫలితాలను ఇస్తుంది. మీరు ఆశించిన విజయం దక్కడంతో మనస్సు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. పైఅధికారుల అండదొరుకుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో కొత్త అతిథి రాకతో సంతోషం నిండుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఆర్థికపరమైన లావాదేవీల్లో మాత్రం ప్రతి అడుగు ఆచితూచి వేయాలి.

తులా రాశి

తులా రాశి వారు ఈ నెలలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో లేదా కార్యాలయంలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగవద్దు, లేదంటే కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు రావచ్చు. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటూ, ఉన్న డబ్బును కూడబెట్టడంపై దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు పడే కష్టానికి నూటికి నూరు శాతం ప్రతిఫలం దక్కుతుంది. వృత్తి జీవితంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అయితే అకస్మాత్తుగా వచ్చే పెద్ద ఖర్చులు మీ మనసును ఆందోళనకు గురిచేయవచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు, కాబట్టి మరింత శ్రమ అవసరం. కుటుంబ సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. లవ్ లైఫ్ ఆహ్లాదకరంగా సాగుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల సుఖశాంతులను, అద్భుతమైన అవకాశాలను తెస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లేందుకు చక్కటి మార్గాలు ఏర్పడటంతో పాటు ధనలాభం కలుగుతుంది. శుభవార్తలు మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పరాక్రమం మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

మకర రాశి

మకర రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని వృద్ధిని చూస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. పాత పెట్టుబడుల నుంచి భారీ రాబడులు వస్తాయి. అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగాలున్నాయి. ఆశించిన ఫలితాలు దక్కడంతో మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. అయితే మాటతీరుపై సంయమనం పాటించాలి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లాభాలతో పాటు ఒడిదుడుకులు ఎదురవుతాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల అండదొరుకుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఎవరితోనూ అనవసర వివాదాలకు పోవద్దు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ విపరీతమైన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. పిత్రార్జితం ద్వారా లబ్ది పొందుతారు. తొందరపాటు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ కాలం సాధారణ ఫలితాలను ఇస్తుంది. అనుకున్న పనులు పూర్తి కావడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. బంధాల్లో ఒడిదుడుకులు రావచ్చు, భాగస్వామి భావాలను గౌరవించడం ముఖ్యం. ప్రస్తుతానికి ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్ద మార్పులు చేయకపోవడమే మంచిది. ప్రేమ బంధాలు బలపడతాయి. నెల చివరి నాటికి ఒక ప్రముఖ వ్యక్తి పరిచయం మీ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe