...
...
Next Story

లిక్కర్ కేసు తీర్పు : కేటీఆర్ ట్వీట్ పై కవిత సీరియస్ - ఇది కరెక్ట్ కాదంటూ సూటి ప్రశ్నలు...!

లిక్కర్ కేసు తీర్పుపై కవిత స్పందించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. కోర్టు తీర్పు రాకుండానే తనపై కొందరు అనుచితంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ ట్వీట్ పై కవిత సీరియస్ అయ్యారు.

Published on: Feb 27, 2026, 16:09:24 IST
Advertisement

లిక్కర్ కేసులో కోర్టు తీర్పుతో ఊరట దక్కిన నేపథ్యంలో కవిత స్పందించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదట్నుంచి చెబుతూనే వచ్చానని… ఇవాళ అలాగే వచ్చానని వ్యాఖ్యానించారు.

కవిత
కవిత

ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పానని కవిత గుర్తు చేశారు. ఇవాళ కోర్టు తీర్పుతో అదే నిజమైందన్నారు. “ఈ కేసుతో నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. కోర్టు తీర్పు రాకుండానే నాపై కొందరు అనుచితంగా మాట్లాడారు. కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను” అని కవిత స్పష్టం చేశారు.

కేటీఆర్ ట్వీట్ - కవిత సీరియస్

ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వైఫల్యానికి నేనా కారణం..? అని ప్రశ్నించారు.

“నాపై కేసు ఎందుకు పెట్టారు… పార్టీ కోసం కాదా..? ఇదే విషయం కేసీఆర్ చెప్పలేదా…? నేను జైలుకు వెళ్లే అంత వరకు కూడా కేటీఆర్ ఎందుకు ప్రెస్మీట్ కేసీఆర్ పెట్టలేదు. అనాడు నేను ఒంటరిగా ఫేస్ చేశా. పార్టీ సపోర్ట్ చేయలేదు. బీజేపీ సోషల్ మీడియా ఇష్టానుసారంగా ట్వీట్లు చేసింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా..? నాడు ఇండ్లు ఇవ్వకపోవటం, ఉద్యోగాలు ఇవ్వకపోవటం, దోపిడీ దారులకు టికెట్లు, అహంకారం వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. ఇవాళ తీర్పును మీరు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు” అంటూ కవిత కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ ట్వీట్ లో ఏముందంటే..?

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks