టైటిల్: 3 రోజెస్ సీజన్ 2 (ఓటీటీ వెబ్ సిరీస్)

నటీనటుల: ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, సత్య, ప్రభాస్ శ్రీను, ఇనయా సుల్తానా తదితరులు
దర్శకుడు: కిరణ్ కె కరవల్ల
సంగీతం: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: శక్త అరవింద
ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు
నిర్మాత: ఎస్‌కేఎన్
షో రన్నర్: మారుతి
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా
ఎపిసోడ్స్: 4
ఓటీటీ రిలీజ్ డేట్: 13 డిసెంబర్ 2025
2021లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి సూపర్ హిట్ అయన తెలుగు సిరీస్ 3 రోజెస్. ఈ సిరీస్ నుంచి సీక్వెల్‌గా వచ్చిందే 3 రోజెస్ సీజన్ 2. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన 3 రోజెస్ ఆహాలో డిసెంబర్ 13 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం నాలుగు ఎపిసోడ్స్‌తో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సిరీస్ ఎలా ఉందో నేటి 3 రోజెస్ సీజన్ 2 రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రితిక అలియాస్ రీతూ (ఈషా రెబ్బా), మేఘన (రాశి సింగ్), సృష్టి (కుషిత కల్లపు) ముగ్గురు ముంబైలో ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. బ్రేకప్ అయిన రీతూ కెరియర్‌పై ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. విడాకులు తీసుకున్న మేఘన ఆ విషయాన్ని తమ కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది.
మరోవైపు కొరియన్ డ్రామాస్ అంటే ఇష్టపడే సృష్టి మాత్రం కొత్త వ్యక్తులతో డేటింగ్ చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారి కొత్త యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు. దాన్ని రన్ చేసేందుకు చాలా కష్టడుతుంటారు. కానీ, వారికి ఒక్క క్లయింట్ కూడా రాడు.
ట్విస్టులు
{{/usCountry}}మరోవైపు కొరియన్ డ్రామాస్ అంటే ఇష్టపడే సృష్టి మాత్రం కొత్త వ్యక్తులతో డేటింగ్ చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారి కొత్త యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు. దాన్ని రన్ చేసేందుకు చాలా కష్టడుతుంటారు. కానీ, వారికి ఒక్క క్లయింట్ కూడా రాడు.
ట్విస్టులు
{{/usCountry}}ఈ సమయంలోనే, రీతూ పెళ్లికి రెజెక్ట్ చేసిన ప్రసాద్ (హర్ష చెముడు) వారికి తన గోల్డ్ జ్యూవెలరీ ప్రాజెక్ట్ యాడ్ ఇవ్వడానికి వస్తాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితుల జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటీ? ఆ యాడ్ చేసేందుకు ముగ్గురు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? యాడ్ ఎజెన్సీ ఎలా పెట్టారు? భర్తతో మేఘనకు ఉన్న సమస్య ఏంటీ? ప్రసాద్ గురించి తెలిసిన నిజం ఏంటీ? ముగ్గురు ఎలాంటి ప్రమాదంలో పడ్డారు? అనేది తెలియాలంటే ఈ 3 రోజెస్ సీజన్ 2 చూడాల్సిందే.
విశ్లేషణ:
3 రోజెస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయిన తరువాత దాదాపు ఐదేళ్ల విరామం తీసుకుని మేకర్స్ ఇప్పుడు సీజన్ 2తో మన ముందుకు వచ్చారు. అయితే, ఈసారి నటీనటుల్లో మార్పు జరిగింది. ఈషా రెబ్బాతో పాటు ఈ కొత్త సీజన్‌లో కుషిత కల్లపు, రాశి సింగ్‌లు జత కట్టారు. వీళ్ల నటన చాలా వరకు ఆకట్టుకుంటుంది.
సీజన్ 1 కథ హైదరాబాద్‌లో సాగితే ఈ కొత్త సీజన్ మాత్రం ముంబై నేపథ్యంగా సాగుతుంది. ముంబైలో జీవన శైలి మరింత పాష్ అండ్ బోల్డ్‌గా, మెచ్యూరిటీగా ఉన్నట్లు చూపించారు. ముంబైకి తగినట్లుగా ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల శాతాన్ని పెంచినట్లుగా అనిపించింది.
ఈ ముగ్గురు స్నేహితులు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతుంటారు. మొదటి ఎపిసోడ్‌లో ఈ ముగ్గురి జీవితాలను పరిచయం చేసిన విధానం చాలా చక్కగా ఉంది. పూర్తిగా కామెడీతో ఈ సీజన్ నిండిపోయింది. స్టార్ కమెడియన్ సత్య తన హాస్యంతో మంచి వినోదాన్ని పంచాడు.
డార్క్ కామెడీతో
ఆయన పాత్ర ఈ సిరీస్‌కు కొత్త జీవం తీసుకొచ్చింది. ఈ సిరీస్‌ను ఒక వెబ్ షో కంటే కూడా సినిమా తరహాలో ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇందులో డార్క్ కామెడీని బాగా హ్యాండిల్ చేశారు. కానీ ఎక్కడా హద్దులు దాటలేదు. ఇది సిరీస్‌కు ఒక బలం అని చెప్పొచ్చు.
అయితే, కథనం చాలా సులభంగా ఉండటంతో పాటు కొత్తదనం ఏమీ లేదు. దీని ముగింపు ఏమై ఉంటుందో ఈజీగా ఊహించేయవచ్చు. ఇకపోతే సిరీస్‌లోని ఒక పార్టీ సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది. ఆ ఎపిసోడ్‌లో హాస్యం బాగా పండింది. ఆ ఎపిసోడ్‌లో వచ్చే ఒక ట్విస్ట్‌ను కూడా దర్శకుడు బాగా ఆలోచించి పెట్టారు.
ఈ సిరీస్ కేవలం హాస్యాన్ని అందించాలనే ఏకైక ఆలోచనతో తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. అయితే, అమ్మాయిల అవసరాలను ఆసర చేసుకుని వాడుకునే వారి నుంచి ఎలా బయటపడాలో కూడా లోతైన సందేశాన్ని ఇచ్చారు.
కన్విన్సింగ్‌గా చూపిస్తూ
ముగ్గురు మహిళా పాత్రల వ్యక్తిగత సమస్యల వెనుక ఉన్న భావోద్వేగాలను కన్విన్సింగ్‌గా చూపించారు. నాలుగో ఎపిసోడ్‌లో కథ పూర్తి కానట్లు ఇంకా ఎపిసోడ్స్ ఉన్నట్లుగా ముగించారు. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత ముగ్గురు తమ నటనతో ఎంతో మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు.
బోల్డ్ సీన్స్‌లో కుషిత కల్లపు గ్లామర్ డోస్‌తో అదరగొట్టింది. క్యూట్‌గా, అమాయకంగా కనిపిస్తూ అట్రాక్ట్ చేసింది. ఇక కమెడియన్ సత్య తన కామెడీతో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. సిరీస్‌లో సత్య కామెడీ హైలెట్ అని చెప్పొచ్చు. అలాగే, వైవా హర్షకు మంచి పాత్ర పడింది. ఆ పాత్రకు నూరు శాతం హర్ష న్యాయం చేశాడు.
స్త్రీలంటే వ్యామోహం ఉండే బాస్ పాత్రలో ప్రభాస్ శ్రీను పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించాడు. మిగతా పాత్రలు కూడా నవ్వించాయి, కవ్వించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సిరీస్‌ను రెండు గంటల్లో ముగించి పర్‌ఫెక్ట్ ఎడిటింగ్ అనిపించుకున్నారు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
దర్శకుడు కిరణ్ కథను సరళమైన పద్ధతిలో చెప్పారు. ముగ్గురు మహిళా పాత్రలకు మరింత బలమైన క్యారెక్టర్ ఆర్క్‌లు ఇచ్చి ఉండాల్సిందని అనిపిస్తుంది. అయితే, చివరికి మేఘన, రీతు పాత్రలు కొన్ని సన్నివేశాల్లో అలా ఎందుకు ప్రవర్తించాయో స్పష్టమవుతుంది.
విజువల్స్, బీజీఎమ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ముంబైలో ముగ్గురు ముద్దుగుమ్మల రొమాంటిక్ ఫన్ రైడ్ ఇంకా ఉందని చెప్పే 3 రోజెస్ సీజన్ 2.