...
...
Next Story

నీలాంటి నటుల కోసం నేను సినిమాలు తీయను- మనోజ్ బాజ్‌పాయ్‌తో దర్శకేంద్రుడు- కానీ, చిన్న పాత్రకే హీరో రేంజ్ రెమ్యునరేషన్!

Manoj Bajpayee Reveals Yash Chopra Comments: విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, క్లాసిక్ హిట్ వీర్ జారా సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. హిందీ దర్శకేంద్రుడు యష్ చోప్రా తనతో అన్న మాటలు, చిన్న పాత్రకు ఇచ్చిన భారీ రెమ్యునరేషన్ గురించి చెప్పారు.

Published on: Jun 13, 2026, 13:31:15 IST
Advertisement

Manoj Bajpayee Reveals Yash Chopra Comments And Given Remuneration: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అద్భుతమైన నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ది ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ సిరీస్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మనోజ్ బాజ్‌పాయ్ నటనకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

కఠినమైన నిర్ణయాలే

నీలాంటి నటుల కోసం నేను సినిమాలు తీయను- మనోజ్ బాజ్‌పాయ్‌తో దర్శకేంద్రుడు- కానీ, చిన్న పాత్రకే హీరో రేంజ్ రెమ్యునరేషన్!
నీలాంటి నటుల కోసం నేను సినిమాలు తీయను- మనోజ్ బాజ్‌పాయ్‌తో దర్శకేంద్రుడు- కానీ, చిన్న పాత్రకే హీరో రేంజ్ రెమ్యునరేషన్!

అల్లు అర్జున్ క్లాసిక్ హిట్ 'వేదం' సినిమాలో రహీముద్దీన్ ఖురేషీగా ఆయన పండించిన భావోద్వేగాలు, హ్యాపీ మూవీలో పోలీస్‌గా చేసిన కామెడీని ఎవరు మర్చిపోలేరు. కేవలం స్టార్‌డమ్ వెనుక పరిగెత్తకుండా, కథాబలానికి ప్రాధాన్యమిచ్చే మనోజ్ బాజ్‌పాయ్.. తన కెరీర్ తొలినాళ్లలో తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలే నేడు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి.

అయితే, తాజాగా ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ టాక్ షో 'శేఖర్ టునైట్'లో పాల్గొన్న మనోజ్ బాజ్‌పాయ్ తన సినీ ప్రయాణంలోని ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలను పంచుకున్నారు.

టైప్‌కాస్ట్ ముద్ర పడకూడదనే.. ఆ భారీ ఆఫర్లు తిరస్కరణ!

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'సత్య' సినిమా సాధించిన అద్భుతమైన విజయం తర్వాత మనోజ్ బాజ్‌పాయ్ బాలీవుడ్‌లో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. అయితే ఆ సక్సెస్ తర్వాత ఆయనకు వచ్చే ఆఫర్లన్నీ దాదాపు విలన్ పాత్రలే కావడం గమనార్హం.

ఒకే రకమైన పాత్రలు చేస్తూ టైప్‌కాస్ట్ ముద్ర వేయించుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే కమర్షియల్‌గా ఎంతో లాభదాయకమైన భారీ విలన్ ఆఫర్లను సైతం ధైర్యంగా తిరస్కరించానని మనోజ్ పేర్కొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ ఆల్-టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ 'వీర్ జారా' (Veer-Zaara) చిత్రంలో తాను చేసిన చిన్న పాత్ర గురించి ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. 'పింజర్' సినిమాలో మనోజ్ నటనను చూసిన లెజెండరీ దర్శకుడు యష్ చోప్రా స్వయంగా ఆయనకు ఫోన్ చేశారని తెలిపారు మనోజ్.

"నా సినిమాలో ఒక చిన్న పాత్ర ఉంది, నువ్వు చేస్తావా? పింజర్ చూశాక ఈ క్యారెక్టర్‌ను నువ్వు తప్ప ఎవరూ చేయలేరనిపించింది" అని యష్ చోప్రా అడిగారట. పెద్ద దర్శకుడి మార్గదర్శకత్వంలో పనిచేయాలనే కోరికతో స్క్రిప్ట్ కూడా వినకుండా మనోజ్ వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆదిత్య చోప్రా వచ్చి సీన్ మొత్తం వివరించారు.

యష్ చోప్రా క్లారిటీ.. "నీలాంటి వాళ్ల కోసం నేను సినిమాలు తీయను"

"యష్ జీ.. వచ్చేసారి నాకోసం ఏదైనా పెద్ద పాత్రను సిద్ధం చేయండి" అని షూటింగ్ సమయంలో మనోజ్ బాజ్‌పాయ్ అడిగారట. దానికి యష్ చోప్రా ఎంతో నిజాయితీగా, కుండబద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చారు.

"నాయనా.. నేను నీలాంటి నటుల కోసం సినిమాలు తీయను. నా సినిమాల్లో ఒకవేళ అలాంటి పాత్రలు ఉన్నా, నువ్వు వాటిని అస్సలు చేయవు. కాబట్టి ఈ దొరికిన చిన్న పాత్రనే అద్భుతంగా చెయ్యి" అని యష్ చోప్రా చాలా స్పష్టంగా చెప్పారని మనోజ్ బాజ్‌పాయ్ నవ్వుతూ వెల్లడించారు. యష్ చోప్రా ఎప్పుడూ లేనిపోని అబద్ధపు వాగ్దానాలు చేయకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తనకు ఎంతో నచ్చిందని మనోజ్ అన్నారు.

ఫ్రీగా చేస్తానన్నా.. లీడ్ హీరో రేంజ్ రెమ్యునరేషన్!

ఈ సినిమాలో అతిథి పాత్ర చేసినందుకు తాను ఎలాంటి ఫీజు తీసుకోనని యష్ చోప్రాతో మనోజ్ బాజ్‌పాయ్ చెప్పారట. కానీ, ఆ మాటను లెజెండరీ మేకర్ అంగీకరించలేదు. తాను కచ్చితంగా పారితోషికం ఇస్తానని చెప్పారు.

అన్నట్లుగానే, ఆ చిన్న క్యారెక్టర్‌కు కూడా మనోజ్ బాజ్‌పాయ్ రెగ్యులర్‌గా వేరే సినిమాల్లో లీడ్ హీరోగా తీసుకునే అంత భారీ మొత్తాన్ని చెక్కు రూపంలో పంపించి బాలీవుడ్ దర్శకేంద్రుడు యష్ చోప్రా తన పెద్ద మనసును చాటుకున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా మనోజ్ పాత్ర

షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'వీర్ జారా' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, ఉత్తమ పాపులర్ చిత్రంగా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది. చిన్న పాత్రయినా మనోజ్ బాజ్‌పాయ్ వేసిన ముద్ర ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe