Ram Kapoor On Cheating In OTT Show Lock Upp 2: బుల్లితెరపై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు రామ్ కపూర్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఓటీటీలో ప్రసారమవుతున్న 'లాక్ అప్: సచ్ యా సజా' రియాలిటీ షోలో ఆయన ప్రవర్తన, వ్యాఖ్యలు మొదటి నుంచీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి.

గతంలో గ్యాంగ్ రేప్ అంశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, టాస్క్ సమయంలో నీళ్లు ఇవ్వలేదని రచ్చ చేయడం లాంటి ఘటనలతో వార్తల్లో నిలిచిన రామ్ కపూర్.. ఇప్పుడు వైవాహిక బంధం, వివాహేతర సంబంధాలపై చేసిన వ్యాఖ్యలతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉంటే భాగస్వామి మోసం చేసినా బంధాన్ని తెంచుకోవాల్సిన అవసరం లేదంటూ రామ్ కపూర్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
అసలేం జరిగింది?
ఓటీటీ షోలో భాగంగా తోటి కంటెస్టెంట్ శ్రేయా కల్రా.. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసినట్లు తెలిస్తే, మీరు ఇంకో బంధాన్ని వెతుక్కుంటారా? అని రామ్ కపూర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. "లేదు, మళ్లీ ఆ బంధాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మీ భాగస్వామిని మీరు నిజంగా ప్రేమిస్తే ఏదీ డీల్ బ్రేకర్ (బంధాన్ని ముగించేది) కాకూడదు. వైవాహిక జీవితం అనేది ఒక కష్టమైన ప్రయాణం, దానికోసం ప్రతిరోజూ శ్రమించాలి" అని చెప్పారు.
మరింత వివరణ ఇస్తూ.. 20-25 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. "కలిసి సాగే ప్రయాణంలో కష్టకాలం ఎదురైనప్పుడు.. పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే, ఆ తర్వాత భాగస్వామి లేకుండా, పిల్లలు లేకుండా బతకలేమని గుర్తిస్తే కాలమే అన్ని గాయాలను నయం చేస్తుంది. కొన్నిసార్లు తప్పులు అనుకోకుండా జరిగిపోతాయి" అని రామ్ కపూర్ వ్యాఖ్యానించారు.
తిప్పికొట్టిన తోటి నటి
రామ్ కపూర్ వ్యాఖ్యలను తోటి కంటెస్టెంట్, నటి ఆకాంక్ష చమోలా తీవ్రంగా వ్యతిరేకించారు. శారీరక సాన్నిహిత్యం అనేది ఎప్పుడూ 'పొరపాటున' జరగదని ఆమె గట్టిగా వాదించారు. అది పూర్తిగా ఒక వ్యక్తి ఆలోచించి తీసుకునే నిర్ణయమని, అది కేవలం ఒక ఛాయిస్ మాత్రమే తప్ప అనుకోకుండా జరిగే ప్రమాదం కాదంటూ రామ్ కపూర్‌కు ముఖం మీదే చెప్పేశారు.
{{/usCountry}}రామ్ కపూర్ వ్యాఖ్యలను తోటి కంటెస్టెంట్, నటి ఆకాంక్ష చమోలా తీవ్రంగా వ్యతిరేకించారు. శారీరక సాన్నిహిత్యం అనేది ఎప్పుడూ 'పొరపాటున' జరగదని ఆమె గట్టిగా వాదించారు. అది పూర్తిగా ఒక వ్యక్తి ఆలోచించి తీసుకునే నిర్ణయమని, అది కేవలం ఒక ఛాయిస్ మాత్రమే తప్ప అనుకోకుండా జరిగే ప్రమాదం కాదంటూ రామ్ కపూర్‌కు ముఖం మీదే చెప్పేశారు.
{{/usCountry}}ఈ చర్చకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు రామ్ కపూర్ తీరును ఎండగడుతున్నారు. "మనం ఆరాధించే వ్యక్తులు లోపల ఎంత సమస్యాత్మకంగా ఉన్నారో ఇలాంటి అన్‌స్క్రిప్టెడ్ షోల వల్లే బయటపడుతోంది" అని ఒకరు కామెంట్ చేశారు.
మరికొందరు ఆయనకు పిచ్చి పట్టిందని, మోసం చేయడాన్ని సమర్థించే ఇలాంటి వ్యక్తులు తీవ్రమైన స్వార్థపరులని మండిపడుతున్నారు. కుటుంబం అంత ముఖ్యమైనప్పుడు అసలు మోసం చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
లాక్ అప్ అప్‌డేట్
ప్రస్తుతం ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి సునీతా అహుజా, హర్షద్ చోప్డా, ఆకాంక్ష చమోలా సురక్షితంగా బయటపడగా.. మిగిలిన వారు సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు పోరాడుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ కంటెస్టెంట్ల ఆట తీరును సమీక్షించి, కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న ఈ షోలో మొత్తం 15 మంది సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతి శనివారం నుంచి బుధవారం వరకు రాత్రి 8 గంటలకు ఈ లాక్ అప్ 2 సరికొత్త ఎపిసోడ్లు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.