Aishwarya Lekshmi About Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ 'రాకా'. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రెండు పార్ట్స్‌గా రాకా

రెండు భాగాల ఎపిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రాకా సినిమాలో నటీనటుల ఎంపికపై రోజుకో ప్రచారం వెలుగులోకి వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి ఒక కీలకమైన విలన్ పాత్రలో నటిస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. ఈ ప్రచారంపై హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పందించి అసలు నిజాలేంటో వివరిస్తూ స్పష్టత ఇచ్చారు.
ఐశ్వర్య లక్ష్మి క్లారిటీ
తమిళం, మలయాళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'రాకా' పుకార్లను పూర్తిగా కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ ప్రచారంలో నిజం లేదు.. కానీ నన్ను తీసుకోండి
"ఆ సినిమాలో నేను భాగం కావడం లేదు. ప్లీజ్ ఎవరైనా నన్ను ఆ సినిమాలో తీసుకుంటే చాలా సంతోషిస్తాను" అని ఐశ్వర్య లక్ష్మి చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేయడంతో పాటు, అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో నటించేందుకు తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని ఈ రకంగా వ్యక్తపరిచారు.
విభిన్న ప్రాజెక్ట్‌లతో ఆకట్టుకుంటున్న నటి
ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి వరుస ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అర్జున్ దాస్‌తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ ఓటీటీ సిరీస్ '#లవ్' (#Love) అక్టోబర్ 2న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో #లవ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఐశ్వర్య సినిమాలు
{{/usCountry}}ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి వరుస ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అర్జున్ దాస్‌తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ ఓటీటీ సిరీస్ '#లవ్' (#Love) అక్టోబర్ 2న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో #లవ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఐశ్వర్య సినిమాలు
{{/usCountry}}ఇందులో డేటింగ్ యాప్ సీఈఓ 'తారా' పాత్రలో ఐశ్వర్య లక్ష్మి కనిపించారు. ఊర్వశి, జోజూ జార్జ్‌లతో కలసి నటించిన మలయాళ థ్రిల్లర్ 'ఆశా', తమిళంలో విష్ణు విశాల్ సరసన చేసిన 'గట్ట కుస్తీ 2' చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
'రాకా'పై వరల్డ్ వైడ్ క్రేజ్
'పుష్ప' సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, కోలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్లు సాధించి 'జవాన్'తో బాలీవుడ్‌ను ఊపేసిన అట్లీ కలయికలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో 'రాకా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రెండు విభిన్న కాలఘట్టాల నేపథ్యం
రెండు విభిన్న కాలఘట్టాల నేపథ్యంలో సాగే ఈ విజువల్ వండర్‌కు సంబంధించి గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. "మేము ఊహించడానికి, సాధించడానికి సాహసించాం" అనే సందేశంతో వచ్చిన ఆ టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
కొత్త మైలురాయిగా రాకా
భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచేలా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇతర కీలక నటీనటులు ఎవరనేది చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.