...
...
Next Story

Akhil Hello Brother Remake: అక్కినేని అఖిల్ హలో బ్రదర్ రీమేక్- బ్రహ్మానందం ప్లేసులో గెటప్ శ్రీను-చీప్ జోక్స్ పెట్టాలంటూ!

Akkineni Akhil On Nagarjuna Hello Brother Remake: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ మూవీ ఇవాళ విడుదలైంది. లెనిన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గెటప్ శ్రీనుతో జరిపిన ఇంటర్వ్యూలో నాగార్జున కల్ట్ క్లాసిక్ హిట్ హలో బ్రదర్ సినిమాను రీమేక్ చేయడంపై అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో చూద్దాం.

Published on: Jul 10, 2026, 18:00:53 IST
Advertisement

Akkineni Akhil On Nagarjuna Hello Brother Remake: టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ 'హలో బ్రదర్' సినిమాను రీమేక్ చేయడంపై అక్కినేని అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కమెడియన్ గెటప్ శ్రీనుతో కలిసి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలనుందంటూ సరికొత్త లైన్ గీశారు ఈ లెనిన్.

ద్విపాత్రాభినయంతో నాగార్జున

అక్కినేని అఖిల్ హలో బ్రదర్ రీమేక్- బ్రహ్మానందం ప్లేసులో గెటప్ శ్రీను-చీప్ జోక్స్ పెట్టాలంటూ!
అక్కినేని అఖిల్ హలో బ్రదర్ రీమేక్- బ్రహ్మానందం ప్లేసులో గెటప్ శ్రీను-చీప్ జోక్స్ పెట్టాలంటూ!

1994లో గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్' సినిమా ఎంతో ఘన విజయం సాధించడమే కాకుండా నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దేవా, రాజా అనే ద్విపాత్రాభినయంలో నాగార్జున పండించిన మాస్ కామెడీ, వినోదం ప్రేక్షకులను ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్‌ను కట్టిపడేస్తూనే ఉన్నాయి.

అక్కినేని వారసుల్లో ఎవరైనా ఈ సినిమాను రీమేక్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో బలంగా కోరుకుంటున్నారు. అయితే, తాజాగా అఖిల్ అక్కినేని చేసిన వ్యాఖ్యలు ఆ ఆశలకు మళ్లీ ప్రాణం పోశాయి. ఇవాళే (జూలై 10) అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా థియేటర్లలో విడుదల అయింది.

లెనిన్ ఫన్ ఇంటర్వ్యూ

భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసిన లెనిన్ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు మూవీ యూనిట్. ఈ క్రమంలోనే లెనిన్ విడుదలకు ముందు టాలెంటెడ్ కమెడియన్ గెటప్ శ్రీనుతో అఖిల్ అక్కినేని సరదాగా ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అఖిల్, శ్రీను ఇద్దరు కలిసి చాలా ఫన్ జెనరేట్ చేశారు.

"ఎగ్జామ్‌లో ఏమైనా కాపీ కొట్టేవారా" అని శ్రీను అడిగితే "హండ్రెడ్ పర్సంట్" అని అఖిల్ సమాధానం ఇచ్చాడు. "ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏంటీ" అని గెటప్ శ్రీను అడిగితే.. "కన్నెపెట్టెరో.." అని అఖిల్ అంటుండగానే గెటప్ శ్రీను అందుకుని పాడాడు. "దాంట్లో ఉంటారు.. నాగార్జున గారు.. చిచోరలు అంటారుగా.. చిచోరస్.." అని గెటప్ శ్రీను నవ్వుతూ అంటే.. అఖిల్ కూడా తెగ నవ్వేశాడు.

"ఆ రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. దాంట్లో ఒకటి ఉంటది.. సీన్.. పొడిచేస్తే పొడిచేస్తే.. అంటే నాకు కళ్లు లేవు పొడిచేయండని అంటారు" అని గెటప్ శ్రీను నవ్వాడు. "నేను హలో బ్రదర్ రీమేక్ చేస్తే నువ్వు ఉండాల్సిందే.." అని అక్కినేని అఖిల్ సడెన్‌గా అనేశాడు. అప్పుడే "హండ్రెడ్ పర్సంట్.. థియేటర్లో అని మాత్రం చెప్పకండి.. సినిమా చూడాలని అలా అనకండి, సినిమాలో ఉండాలని అనండి" అని గెటప్ శ్రీను అన్నాడు.

కాంబినేషన్ అదిరిపోద్ది

"సినిమాలోనే" అని అఖిల్ అన్నాడు. "జస్ట్ ఇమాజిన్ గెటప్ శ్రీను.. హలో బ్రదర్.. అండ్ చీప్ జోక్స్.. సారీ సారీ.." అక్కినేని అఖిల్ అంటుంటే.. "ఫన్నీ జోక్స్" అని పదం అందించాడు గెటప్ శ్రీను. "కాంబినేషన్ అదిరిపోద్ది" అని బ్రహ్మానందం ప్లేసులో గెటప్ శ్రీను అన్నట్లుగా అఖిల్ చెప్పుకొచ్చాడు.

"ఫస్ట్‌ది పర్సనల్.. చీప్ జోక్స్ అనేది" అని గెటప్ శ్రీను సెటైర్ వేశాడు. "లేదు బ్రదర్.. చాలా ఇంటర్వ్యూలు చేశాను కదా.. మాటలు సరిగా రావట్లే.. మైండ్‌కు టంగ్‌కు" అని అక్కినేని అఖిల్ అంటుండగా.. "మీరు రెండు రోజులు ఇక్కడే ఉండండి. జూలై 10 (లెనిన్ రిలీజ్ డేట్)కి ఇంకా రెండు రోజులు ఉంది. ప్రశాంతంగా ఇక్కడే ఉండండి" అని గెటప్ శ్రీను చెప్పడంతో ఆ వీడియో ముగిసింది.

నాగ్, బ్రహ్మీ మ్యాజిక్ రిపీట్?

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఒకవేళ హలో బ్రదర్ సినిమాను రీమేక్ గనుక చేస్తే నాగార్జున-బ్రహ్మానందం కాంబినేషన్ మ్యాజిక్‌ని అఖిల్-గెటప్ శ్రీను రిపీట్ చేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe