గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha) విడుదలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’తో బాక్సాఫీస్ వద్ద తలపడటం ఇష్టం లేక అలియా భట్ తన సినిమాను వాయిదా వేసుకున్నారని కామెంట్స్ వచ్చాయి.

అంతేకాకుండా ఆల్ఫా సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ సోమవారం (మార్చి 9) ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
జూలై 10న థియేటర్లలో ‘ఆల్ఫా’ జాతర
తాజాగా ఆల్ఫా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘ఆల్ఫా’ చిత్రం జూలై 10, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని 2025 క్రిస్మస్ కానుకగా తీసుకురావాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 17, 2026కు మార్చారు.
సల్లూ భాయ్‌తో పోటీ ఎందుకు
అయితే అదే రోజున సల్మాన్ ఖాన్ నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ కూడా విడుదలవుతుండటంతో, సల్లూ భాయ్‌తో తలపడటం ఎందుకు అని భావించిన ఆదిత్య చోప్రా తన ఆల్ఫా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
హీరోయిన్ అలియా భట్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "#ALPHA 10.07.2026 థియేటర్లలో కలుద్దాం" అని క్యాప్షన్ ఇచ్చారు. దీనితో ఈ ఆల్ఫా సినిమా నేరుగా ఓటీటీ రిలీజ్ అవుతుందున్న వార్తలకు తెరపడింది.
సల్మాన్ కోసం తప్పుకున్న ఆదిత్య చోప్రా
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా ఈ మార్పును ధృవీకరించారు. "సల్మాన్ ఖాన్ కోసం ఆదిత్య చోప్రా ఒక అడుగు వెనక్కి వేశారు. ఏప్రిల్ 17న జరగాల్సిన పోటీని నివారించేందుకు ‘ఆల్ఫా’ తేదీని మార్చారు" అని ఆయన పేర్కొన్నారు. కేవలం బాక్సాఫీస్ క్లాష్ వల్ల సినిమాల వసూళ్లపై ప్రభావం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్పై యూనివర్స్‌లో మొదటి మహిళా చిత్రం
{{/usCountry}}ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా ఈ మార్పును ధృవీకరించారు. "సల్మాన్ ఖాన్ కోసం ఆదిత్య చోప్రా ఒక అడుగు వెనక్కి వేశారు. ఏప్రిల్ 17న జరగాల్సిన పోటీని నివారించేందుకు ‘ఆల్ఫా’ తేదీని మార్చారు" అని ఆయన పేర్కొన్నారు. కేవలం బాక్సాఫీస్ క్లాష్ వల్ల సినిమాల వసూళ్లపై ప్రభావం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్పై యూనివర్స్‌లో మొదటి మహిళా చిత్రం
{{/usCountry}}శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ‘ఆల్ఫా’.. యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో వస్తున్న ఏడో చిత్రం. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3, వార్ 2 వంటి భారీ చిత్రాల సరసన ఇది నిలవనుంది.
గతేడాది 'వార్ 2' పోస్ట్ క్రెడిట్స్ సీన్‌లో ఈ ఆల్ఫా సినిమా గురించి చిన్న క్లూ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి అలియా భట్ మాట్లాడుతూ.. "వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఇది మొదటి మహిళా ప్రధాన యాక్షన్ చిత్రం. మేల్ యాక్టర్స్ లీడ్ రోల్స్ చేసిన సినిమాల స్థాయిలోనే ఇది కూడా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఇది ఒక పెద్ద సాహసం" అని చెప్పుకొచ్చారు.
బాబీ డియోల్, అనిల్ కపూర్ కీ రోల్స్
ఇక ఆల్ఫా సినిమాలో అలియా భట్, శార్వరి వాఘ్‌తోపాటు బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక మహిళా స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.