Alpha OTT Release Date Official: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha). యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్పై యూనివర్స్‌లో మహిళా గూఢచారుల నేపథ్యంతో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
ఆల్ఫా ఓటీటీ రిలీజ్‌పై

భారీ అంచనాల నడుమ జూలై 3న థియేటర్లలో విడుదలైన ఆల్ఫా సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేయగలిగింది. అయితే, ఇప్పుడు తాజాగా ఆల్ఫా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఉత్కంఠ రేపే కథాంశం
ఆల్ఫా చిత్రంలో అలియా భట్ 'సీత' అనే సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించగా, బాబీ డియోల్ ఆమె పెంపుడు తండ్రి కల్నల్ ఫతే సింగ్ లఖావత్‌గా విలన్ పాత్రలో నటించారు. తనను చిన్నప్పుడే కిడ్నాప్ చేసి ఒక ప్రయోగాత్మక ఏజెంట్‌గా మార్చిన ఫతే సింగ్ నెట్‌వర్క్‌ను అంతం చేసేందుకు సీత, ఆమె చెల్లెలు దుర్గ (శార్వరి) చేసే పోరాటమే ఈ సినిమా కథ.
బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన కలెక్షన్లు
అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించగా, 'వార్' సినిమాలోని కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ ఇచ్చిన పవర్ ఫుల్ కామియో ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శివ్ రావల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా దాదాపు రూ. 55.2 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా, గ్రాస్ కలెక్షన్స్ రూ. 65.7 కోట్లుగా నమోదయ్యాయి.
మిగతా సినిమాలతో పోలిస్తే అతి తక్కువ
అలాగే, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 26 కోట్లకు పైగా రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 92 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది. అయితే, యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో వచ్చిన మిగతా చిత్రాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ సంఖ్యలే అని చెప్పాలి. కానీ, ఆల్ఫా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అయిన అలియా భట్, శార్వరి యాక్షన్ సీన్లతో ఆశ్చర్యపరచగా.. గ్లామర్‌తో అట్రాక్ట్ చేశారని ప్రశంసలు దక్కాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
{{/usCountry}}అలాగే, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 26 కోట్లకు పైగా రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 92 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది. అయితే, యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో వచ్చిన మిగతా చిత్రాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ సంఖ్యలే అని చెప్పాలి. కానీ, ఆల్ఫా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అయిన అలియా భట్, శార్వరి యాక్షన్ సీన్లతో ఆశ్చర్యపరచగా.. గ్లామర్‌తో అట్రాక్ట్ చేశారని ప్రశంసలు దక్కాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
{{/usCountry}}ఇలాంటి ఆల్ఫా ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేట్రికల్ రన్ ముగియడంతో ఆల్ఫా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకే సొంతం చేసుకుంది.
ఆల్ఫా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఆల్ఫా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీ భాషలో అందుబాటులోకి తీసుకొస్తుండగా, మిగతా దక్షిణాది భాషల డబ్బింగ్ వెర్షన్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేకపోయిన ఆల్ఫా డిజిటల్ వేదికపై ఓటీటీ ప్రియులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.