Anirudh Kavya Wedding Invitation To Sonia Gandhi Nirmala Sitharaman: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ల పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న వీరి పెళ్లి వార్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా అధికారిక ముద్ర పడగా, తాజాగా వివాహ ఆహ్వానాల పర్వం శరవేగంగా సాగుతోంది.
ఢిల్లీలో వెడ్డింగ్ కార్డులు పంపిణీ చేసిన కళానిధి మారన్

నవంబర్ 21న చెన్నై నగరంలో వైభవంగా జరగనున్న వివాహ విందు (రిసెప్షన్) కోసం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతిమణి కావేరి మారన్లు దేశరాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులను కలిశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రిసెప్షన్ కార్డును అందించారు.
ఆర్థిక శాఖ మంత్రికి ఇన్విటేషన్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను సన్ నెట్‌వర్క్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
రేవంత్ రెడ్డి ట్వీట్‌తో బయటపడ్డ అసలు విషయం
అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ల వివాహ వార్తలు చాలాకాలంగా వార్తల్లో నిలుస్తున్నప్పటికీ, ఇరు కుటుంబాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కళానిధి మారన్ దంపతులు, ఆయనను పెళ్లికి ఆహ్వానించారు.
సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
"సన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ కళానిధి మారన్, వారి సతిమణి శ్రీమతి కావేరీ మారన్ నన్ను కలసి కావ్య మారన్-అనిరుధ్ రవిచందర్ వివాహ విందుకు ఆహ్వానించారు" అని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ విషయం అధికారికంగా బయటకు వచ్చింది.
ఐపీఎల్ పాపులారిటీ, అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్
{{/usCountry}}"సన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ కళానిధి మారన్, వారి సతిమణి శ్రీమతి కావేరీ మారన్ నన్ను కలసి కావ్య మారన్-అనిరుధ్ రవిచందర్ వివాహ విందుకు ఆహ్వానించారు" అని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ విషయం అధికారికంగా బయటకు వచ్చింది.
ఐపీఎల్ పాపులారిటీ, అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్
{{/usCountry}}సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్‌ల వేళ స్టేడియంలో కనిపించే కావ్య మారన్‌కు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన క్రేజ్ ఉంది. మ్యాచ్‌లలో జట్టు జయాపజయాల వేళ ఆమె ఇచ్చే హావభావాలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి.
ది ప్యారడైజ్, జైలర్ 2 సినిమాలకు
మరోవైపు, దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ అనిరుధ్ రవిచందర్ అగ్ర సంగీత దర్శకుడిగా కొసాగుతున్నారు. ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన 'ది ప్యారడైజ్', రజనీకాంత్ 'జైలర్ 2' వంటి భారీ చిత్రాలకు సంగీతం అందించారు.
సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు
అంతేకాకుండా.. షారుఖ్ ఖాన్ 'కింగ్', రజనీకాంత్ 'ధర్మన్', కమల్ హాసన్ 'భారతీయుడు 3' (ఇండియన్ 3) ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అనిరుధ్ రవిచందర్. ఇకపోతే చెన్నై వేదికగా జరగనున్న అనిరుధ్, కావ్య వివాహ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.