Top 6 OTT Horror Thrillers On Amazon Prime: వీకెండ్ వస్తే చాలు ఓటీటీల్లో భయపెట్టే హారర్ చిత్రాల కోసం వెతికే సినీప్రియులు ఎందరో ఉన్నారు. కేవలం రొటీన్ జంప్ స్కేర్లు, దెయ్యాల కొంపల కథలు కాకుండా, చూస్తున్నంత సేపు వెన్నులో వణుకు పుట్టించి, రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపట్టకుండా చేసే కథలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేక క్రేజ్ ఉంది.
బెస్ట్ 6 హారర్ థ్రిల్లర్స్

ఇక తెలుగు ప్రేక్షకులకు సాధారణంగా 'మంత్ర', 'అరుంధతి' నుంచి ఇటీవలి 'మసూద' వరకు మంచి హారర్ కంటెంట్‌ను ఆదరించే అలవాటుంది. ది కంజూరింగ్, తుంబాడ్, హెరిడిటరీ వంటి క్రేజీ సినిమాలను ఇప్పటికే చూసేసి కొత్తదనం కోసం చూస్తున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ, రేపు వీకెండ్‌కు మిమ్మల్ని భయాందోళనకు గురిచేసే టాప్ 6 అత్యుత్తమ హారర్ సినిమాల వివరాలు ఇక్కడ చూద్దాం.
ఆసియా హారర్ మేజిక్: కొరియన్ మాస్టర్‌పీసెస్
ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్ (A Tale of Two Sisters - కొరియన్):
మానసిక చికిత్స పొందిన తర్వాత తన సోదరి సు-యోన్‌ను కలిసే సు-మి కథ ఇది. వీరిద్దరూ తమ తండ్రి, సవతి తల్లితో కలిసి పల్లెటూరి ఇంటికి వెళ్లిన తర్వాత విచిత్ర సంఘటనలు మొదలవుతాయి. సాధారణ దెయ్యాల కాన్సెప్ట్ కాకుండా నేరభావం, మానసిక వేదన, ఒంటరితనాన్ని భయంకరంగా చూపించడంలో ఈ చిత్రం అద్భుతం సృష్టించింది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఎగ్జుమా (Exhuma - కొరియన్):
శాపగ్రస్తమైన ఒక పాత సమాధిని వేరే చోటుకి మార్చేందుకు వాస్తు నిపుణుడు, భూతవైద్యురాలు, శవాల కాపరి పూనుకుంటారు. ఆ తవ్వకాల్లో వారి గతానికి సంబంధించిన ఒక భయానక రహస్యం బయటపడుతుంది. అనవసరపు జంప్ స్కేర్లు లేకుండా, సాంప్రదాయ పూజలు, ఉత్కంఠభరిత దృశ్యాలతో మాస్టర్‌పీస్‌గా నిలిచిని ఎగ్జుమా తెలుగులోనూ ఓటీటీ రిలీజ్ అయింది.
తెలుగు రికార్డు చిత్రం నుంచి హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ వరకు
మసూద (Masooda - తెలుగు):
{{/usCountry}}శాపగ్రస్తమైన ఒక పాత సమాధిని వేరే చోటుకి మార్చేందుకు వాస్తు నిపుణుడు, భూతవైద్యురాలు, శవాల కాపరి పూనుకుంటారు. ఆ తవ్వకాల్లో వారి గతానికి సంబంధించిన ఒక భయానక రహస్యం బయటపడుతుంది. అనవసరపు జంప్ స్కేర్లు లేకుండా, సాంప్రదాయ పూజలు, ఉత్కంఠభరిత దృశ్యాలతో మాస్టర్‌పీస్‌గా నిలిచిని ఎగ్జుమా తెలుగులోనూ ఓటీటీ రిలీజ్ అయింది.
తెలుగు రికార్డు చిత్రం నుంచి హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ వరకు
మసూద (Masooda - తెలుగు):
{{/usCountry}}సింగిల్ మదర్ పెంపకంలో పెరిగే నజియా అనే అమ్మాయిని ఒక దుష్టశక్తి ఆవహిస్తుంది. కుమార్తెను కాపాడుకోవడానికి తల్లి నీలం, తన పక్కింటి కుర్రాడు గోపి సహాయం తీసుకుంటుంది. మన దేశంలో వచ్చే హారర్ సినిమాల్లో దెయ్యం వెనుక ఏదో ఒక సానుభూతి కథ ఉంటుంది. కానీ, ఇందులో స్వచ్ఛమైన క్రూరమైన దుష్టశక్తినే ప్రధాన విలన్‌గా చూపించి తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో భయపెట్టిన విషయం తెలిసిందే.
ఖౌఫ్ (Khauf - హిందీ సిరీస్):
ఎవరైనా నిరంతరం తమను గమనిస్తున్నారనే భయం మహిళలకు కొత్త కాదు. ఎనిమిది ఎపిసోడ్ల ఈ ఓటీటీ సిరీస్ ఆ భయాన్నే ఒక పీడకలగా మార్చింది. ఢిల్లీలోని హాస్టల్ గదిలో ఉండే ఒక యువతి, తన గదిలోనే తనకు రక్షణ లేదని భావిస్తూ తీవ్ర మనోవేదనకు గురవుతుంది. సమాజంలో మహిళలు ఎదుర్కొనే అభద్రతాభావాన్ని సైకలాజికల్ హారర్‌గా మలిచిన తీరు అదిరిపోతుంది. ఖౌఫ్ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
హాలీవుడ్ ఉత్కంఠ: నవ్వుల వెనుక దాగి ఉన్న మరణం
స్మైల్ (Smile - ఇంగ్లీష్):
విచిత్రమైన, భయంకరమైన చిరునవ్వును చూపిస్తూ మనుషులను బలితీసుకునే వింత రాక్షసి కథ ఇది. మానసిక గాయాలు ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ, ఆ శాపాన్ని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసే కాన్సెప్ట్ సీటు అంచున కూర్చోబెడుతుంది. కథలోని విజువల్స్, ఉన్నపళంగా వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను భయాందోళనకు గురిచేస్తాయి.
దెమ్ (Them - ఇంగ్లీష్ సిరీస్):
1950ల కాలంలో ఒక నల్లజాతి కుటుంబం ఉత్తర కరోలినా నుంచి తెల్లజాతి వారు ఎక్కువగా ఉండే లాస్ ఏంజెల్స్‌కు మారుతుంది. అక్కడ వారికి దుష్టశక్తుల నుంచి ఎదురయ్యే ముప్పు కంటే, మనుషుల నుంచి ఎదురయ్యే జాతి వివక్షే అతిపెద్ద హారర్‌గా మారుతుంది. సామాజిక అన్యాయాన్ని, దెయ్యాల కాన్సెప్ట్‌కు జోడించి తీసిన విధానం ఆలోచింపజేస్తుంది.
తెలుగులో 4 ఓటీటీ స్ట్రీమింగ్
ఈ సినిమాలు కేవలం మిమ్మల్ని భయపెట్టడమే కాకుండా, మానసిక విశ్లేషణ, సామాజిక కోణాలను స్పృశిస్తాయి. ఈ వీకెండ్‌లో సరికొత్త థ్రిల్ అనుభవించాలనుకుంటే లైట్లు ఆపేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ టాప్ 6 హారర్ థ్రిల్లర్స్‌ను వీక్షించండి. ఇందులో 4 సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం.