ఓటీటీలో ఎన్ని రకాల జోనర్స్‌లలో సినిమాలు ఉన్నప్పటికీ ఆడియెన్స్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేది కామెడీ. అందుకే కామెడీ జోనర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ జోనర్‌లో వచ్చిన ఓటీటీ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. మరి ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించే బెస్ట్ 6 తెలుగు కామెడీ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
సూపర్ సుబ్బు ఓటీటీ

సెక్స్ ఎడ్యుకేషన్‌పై కామెడీగా తెరకెక్కిన సిరీస్ సూపర్ సుబ్బు. సందీప్ కిషన్, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా బ్రహ్మానందం, మురళి శర్మ, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది ముఖ్య పాత్రల్లో నటించారు.
సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సందీప్ కిషన్ చేసిన సూపర్ సుబ్బు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, సూపర్ సుబ్బు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, ఈ సిరీస్ బాగా నవ్విస్తుందని ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది.
మజాకా ఓటీటీ
త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ మజాకా. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా, రావు రమేష్, అన్షు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కామెడీ పరంగా మంచి టాక్ తెచ్చుకుంది. జీ5 ఓటీటీలో మజాకా స్ట్రీమింగ్ అవుతోంది.
బ్రహ్మ ఆనందం ఓటీటీ
తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ తాత, మనవడుగా నటించిన కామెడీ చిత్రం బ్రహ్మ ఆనందం. వెన్నెల కిశోర్ మరో కీలక పాత్రలో నవ్వించిన ఈ సినిమాను ఆహా ఓటీటీలో వీక్షించవచ్చు. 70 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకునే కథతో ఈ సినిమా నవ్విస్తుంది.
కీడా కోలా ఓటీటీ
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించి దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం కీడా కోలా. థియేటర్లలో హాయిగా నవ్వించిన ఈ సినిమాలో చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్, విష్ణు ఓయి, జీవన్ కుమార్, రవీంద్ర విజయ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఆహాలోనే కీడా కోలా ఓటీటీ రిలీజ్ అయింది.
మై డియర్ దొంగ ఓటీటీ
{{/usCountry}}డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించి దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం కీడా కోలా. థియేటర్లలో హాయిగా నవ్వించిన ఈ సినిమాలో చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్, విష్ణు ఓయి, జీవన్ కుమార్, రవీంద్ర విజయ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఆహాలోనే కీడా కోలా ఓటీటీ రిలీజ్ అయింది.
మై డియర్ దొంగ ఓటీటీ
{{/usCountry}}ఓ ఇంట్లోకి ఆహారం కోసం చొరబడిన దొంగ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. అభినవ్ గోమఠం దొంగగా, షాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషించారు. ఆహాలో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మై డియర్ దొంగ నవ్వించేందుకు బెస్ట్ ఆప్షన్.
సామజవరగమన ఓటీటీ
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కామెడీ సినిమాల్లో సామజవరగమన ఒకటి. శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిశోర్ ఇతర పాత్రల్లో నవ్వించారు. ఈ సినిమాను కూడా ఆహా ఓటీటీలో వీక్షించవచ్చు.
ఇలా టాప్ 6 తెలుగు కామెడీ సినిమాల్లో 4 ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.