Bharat Bhhagya Viddhaata OTT Release: దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ముంబై 26/11 ఉగ్రదాడుల వెనుక ఎన్నో భయానక దృశ్యాలు, మరెన్నో త్యాగాల కథలు దాగున్నాయి. సరిహద్దుల్లో పోరాడే సైనికుల శౌర్యాన్ని సమాజం గుర్తించినట్లే, క్లిష్ట సమయంలో తుపాకుల మోతల మధ్య రోగుల ప్రాణాలు కాపాడిన సామాన్య ఆసుపత్రి సిబ్బంది కథ ఆధారంగా రూపొందిన చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata).
ఐఎమ్‌డీబీ రేటింగ్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ కీలక పాత్రలో నటించిన భారత్ భాగ్య విధాత సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఐఎమ్‌డీబీలో 7 రేటింగ్ సంపాదించుకున్న భారత్ భాగ్య విధాత ఓటీటీలోకి వచ్చేయనుంది.
కామా ఆసుపత్రి కాళరాత్రి.. అసలు కథ ఇదే
2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదులు విరుచుకుపడిన సమయంలో కామా అండ్ ఆల్బ్‌లెస్ మహిళా ఆసుపత్రి ప్రాంగణంలోకి టెర్రరిస్టులు చొరబడ్డారు. ఆ సమయంలో లోపల ఉన్న గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులను కాపాడేందుకు అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సులు, వార్డు బాయ్స్, సఫాయి కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
కంగనా, గిరిజా పాత్రలు
మెడికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భారత్ భాగ్య విధాత సినిమాలో కంగనా రనౌత్ గీతా మాధవ్ గంధారే అనే సీనియర్ నర్సు పాత్రలో కనిపించగా, సోషల్ మీడియా సెన్సేషన్ గిరిజా ఓక్, స్మితా తాంబే ఇతర కీలక పాత్రలు పోషించారు.
కంగనా రనౌత్ కామెంట్స్
"కొన్ని కథలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంటుంది, అందుకే ఈ చిత్రాన్ని మేం ఎంచుకున్నాం. ఉగ్రవాదులు విరుచుకుపడిన ఆ కాళరాత్రి వేళ, వైద్య సిబ్బంది స్వార్థం లేకుండా చూపించిన మానవత్వం, ధైర్యం భారతీయ ఆత్మకు ప్రతీక. సరిహద్దుల్లోనే కాదు, ప్రాణాపాయ స్థితిలో సామాన్యులు చూపించే అంకితభావం కూడా దేశభక్తే" అని కంగనా రనౌత్ ప్రమోషన్స్ సమయంలో తెలిపారు.
భారత్ భాగ్య విధాత కలెక్షన్స్
{{/usCountry}}"కొన్ని కథలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంటుంది, అందుకే ఈ చిత్రాన్ని మేం ఎంచుకున్నాం. ఉగ్రవాదులు విరుచుకుపడిన ఆ కాళరాత్రి వేళ, వైద్య సిబ్బంది స్వార్థం లేకుండా చూపించిన మానవత్వం, ధైర్యం భారతీయ ఆత్మకు ప్రతీక. సరిహద్దుల్లోనే కాదు, ప్రాణాపాయ స్థితిలో సామాన్యులు చూపించే అంకితభావం కూడా దేశభక్తే" అని కంగనా రనౌత్ ప్రమోషన్స్ సమయంలో తెలిపారు.
భారత్ భాగ్య విధాత కలెక్షన్స్
{{/usCountry}}భారత్ భాగ్య విధాత సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. డైరెక్టర్ మనోజ్ తపాడియా ఈ చిత్రాన్ని అత్యంత ఉద్వేగభరితంగా తీర్చిదిద్దారు. పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 7.04 కోట్లు నెట్ సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 8.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది.
భారత్ భాగ్య విధాత ఓటీటీ స్ట్రీమింగ్
స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5లో భారత్ భాగ్య విధాత ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. భారత్ భాగ్య విధాత ఓటీటీ రిలీజ్ సందర్బంగా మేకర్స్ కొత్త ట్రైలర్ విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు.
జీ5 ఓటీటీలో
భయానక వాతావరణంలో, ప్రాణాలకు తెగించి కష్టపడిన నర్సులు, కామా ఆసుపత్రి సిబ్బంది యథార్థ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ట్రైలర్‌లో చూడొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారికి ఈ అన్-సంగ్ హీరోల కథను జీ5 ఓటీటీలో భారత్ భాగ్య విధాత సినిమా ద్వారా చూడొచ్చు.