Sharwanand Bhogi OTT Streaming: కుటుంబ కథా చిత్రాలు, ఆహ్లాదకరమైన వినోదంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శర్వానంద్. తొలిసారి తన పంథా మార్చుకుని పక్కా మాస్, పీరియాడిక్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించిన 'భోగి' నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది.

అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న రిలీజైన భోగి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
కథా నేపథ్యం ఇదే
1962 నాటి కాలం. ఆదిలాబాద్ జిల్లాలోని 'బొగ్గుల గుట్ట' అనే మారుమూల గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో పటేల్ (శరత్ లోహితాశ్వ) చెప్పిందే వేదం. స్థానిక ఎమ్మెల్యే సైతం ఆయన కాళ్ల దగ్గర కూర్చుని ఆజ్ఞలు పాటించాల్సిందే. చుట్టుపక్కల గూడేల్లో అప్పుడప్పుడు అమ్మాయిలు మాయమవుతుంటారు. బొగ్గుల గుట్టను బంగారు గుట్టగా మార్చాలంటే ఇదంతా తప్పదని గ్రామస్థులను పటేల్ నమ్మిస్తుంటాడు.
అదే ఊరిలో తన ఐదుగురు చెల్లెళ్లను పంచప్రాణాల్లా చూసుకుంటూ గంగ (శర్వానంద్) జీవనం సాగిస్తుంటాడు. ఓ అనుకోని ఘటన ద్వారా గ్రామంలో అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నది పటేల్ అని గంగకు తెలుస్తుంది. దాంతో ఆ అరాచక శక్తికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత గంగకు, అతని చెల్లెళ్లకు ఎలాంటి ఆపదలు ఎదురయ్యాయి? గంగతో కలిసి నడవాలనుకున్న సులోచన (అనుపమ పరమేశ్వరన్) ఎవరు? ఆమెకు మందారం (డింపుల్ హయాతి)కు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ: మెప్పించిన తొలి భాగం.. నిరాశపరిచిన ద్వితీయార్ధం
"మంత్రం అనేది మందు అవ్వాలి.. నమ్మకం నలుగురి జీవితాల్ని నిలబెట్టాలి" అనే బలమైన సామాజిక అంశం చుట్టూ దర్శకుడు సంపత్ నంది ఈ కథను అల్లుకున్నారు. వేళ్లూనుకుపోయిన మూఢనమ్మకాలను భోగి మంటల్లో వేసి కాల్చేయాలనే ఆలోచన బాగుంది.
{{/usCountry}}"మంత్రం అనేది మందు అవ్వాలి.. నమ్మకం నలుగురి జీవితాల్ని నిలబెట్టాలి" అనే బలమైన సామాజిక అంశం చుట్టూ దర్శకుడు సంపత్ నంది ఈ కథను అల్లుకున్నారు. వేళ్లూనుకుపోయిన మూఢనమ్మకాలను భోగి మంటల్లో వేసి కాల్చేయాలనే ఆలోచన బాగుంది.
{{/usCountry}}1962 నాటి బొగ్గుల గుట్ట వాతావరణాన్ని సృష్టించిన తీరు ప్రేక్షకులను ఆరంభంలోనే కథలోకి తీసుకెళ్తుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, గంగ-సులోచన మధ్య ప్రేమ సన్నివేశాలు, పటేల్ అంటే భయపడే గ్రామస్థుల తీరుతో ప్రథమార్ధం ఆసక్తికరంగా సాగుతుంది.
మితిమీరిన రక్తపాతం
అయితే అసలు చిక్కంతా ద్వితీయార్ధంలోనే మొదలైంది. ఇంటర్వెల్ తర్వాత కథ కొత్త మలుపులు తిరుగుతుందని ఆశించిన ప్రేక్షకులకు రొటీన్ ప్రతీకార కథనం ఎదురవుతుంది. బొగ్గు గనులు, మార్కండేయ అంటూ కథను అటు ఇటు తిప్పినా సాగదీతగా అనిపిస్తుంది.
"దేహం దేవాలయమైతే ప్రాణమే దేవుడు" అని సందేశం ఇస్తూనే, సినిమా నిండా తలలు, కాళ్లు చేతులు తెగిపడే స్థాయిలో విపరీతమైన హింసను చూపించారు. మితిమీరిన రక్తపాతం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు
నటుడిగా శర్వానంద్ మరోసారి తన సత్తా చాటారు. గంగ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి, భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు. ఎలాంటి పాత్రకైనా తాను సరిపోతానని నిరూపించుకున్నారు. డీ-గ్లామర్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించినా, ఆమె పాత్రకు తగినంత బలం లేకుండా పోయింది.
లోతైన భావాలను పలికించే మందారం పాత్రలో డింపుల్ హయాతి మెప్పించారు. పటేల్‌గా శరత్ లోహితాశ్వ తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, వాటి చిత్రీకరణ బాగున్నాయి.
నేపథ్య సంగీతం అక్కడక్కడా కాస్త బిగ్గరగా అనిపించినా సన్నివేశాలకు బలాన్నిచ్చింది. కెమెరా పనితనం, ప్రొడక్షన్ డిజైన్ ఆ నాటి కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. సంపత్ నంది రాసిన సంభాషణలు పదునుగా ఉన్నా, కథనంలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది.
ఓటీటీ రిలీజ్ ఎక్కడంటే?
థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న భోగి సినిమాకు ఐఎమ్‌డీబీలో మాత్రం 9.3 రేటింగ్ వచ్చింది. ఇలాంటి భోగి ఓటీటీలోకి వచ్చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో భోగి ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ లెక్కన అమెజాన్ ప్రైమ్‌లో భోగి ఓటీటీ రిలీజ్ కానుంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ 5 భాషల్లో భోగి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందట. అయితే, థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత డిసెంబర్ మధ్యలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి భోగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కానీ, శర్వానంద్ మాస్ యాక్షన్, సినిమా ఆర్ట్ వర్క్ మంచి అనుభూతిని ఇవ్వాలంటే భోగి మూవీని థియేటర్లలో చూడటమే ఉత్తమం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.