Bigg Boss 10 Telugu Contestants Full List: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున ముగ్గురు హీరోలు హోస్ట్‌గా రాణించిన ఈ బిగ్ బాస్ షో మరో సీజన్‌కు సమయం ఆసన్నమైంది.
ఇవాళ సాయంత్రం 7 గంటలకు

ఇవాళ (సెప్టెంబర్ 6) మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్‌గా లాంచ్ కానుంది. సాయంత్రం 7 గంటలకు అటు స్టార్ మా టీవీ ఛానెల్‌లో ఇటు జియో హాట్‌స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు 10 ప్రసారం కానుంది. ప్రతిసారి సరికొత్త థీమ్‌తో బిగ్ బాస్ షో వస్తోన్న విషయం తెలిసిందే.
ఈసారి బిగ్ బాస్ షో దశవతారం కాన్సెప్ట్‌తో వస్తోంది. ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరా అనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఎన్నో ఊహగానాలు, రూమర్స్ ప్రచారం అయ్యాయి.
ఇదివరకే షూటింగ్ పూర్తి
కానీ, తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‌లోకి అడుగుపెట్టిన ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకొచ్చేసింది. ఈపాటికే అంటే సెప్టెంబర్ 5నే బిగ్ బాస్ 10 తెలుగు లాంచ్ షూటింగ్‌ను మొదలుపెట్టేశారు మేకర్స్. దీంతో ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 10 స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చిన 10 మంది కన్ఫర్మ్‌డ్ కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది.
వారిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ద్వారా సెలెక్ట్ అయిన రైతుబిడ్డ ఝాన్సీ నుంచి సీరియల్ హీరో ముఖేష్ గౌడ వరకు ఉన్న కామనర్స్, సెలబ్రిటీలు ఎవరెవరో, ఎవరు ఎప్పుడు అడుగుపెట్టారో ఆర్డర్ ప్రకారం ఇక్కడ తెలుసుకుందాం.
తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ హీరోయిన్
{{/usCountry}}వారిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ద్వారా సెలెక్ట్ అయిన రైతుబిడ్డ ఝాన్సీ నుంచి సీరియల్ హీరో ముఖేష్ గౌడ వరకు ఉన్న కామనర్స్, సెలబ్రిటీలు ఎవరెవరో, ఎవరు ఎప్పుడు అడుగుపెట్టారో ఆర్డర్ ప్రకారం ఇక్కడ తెలుసుకుందాం.
తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ హీరోయిన్
{{/usCountry}}బిగ్ బాస్ తెలుగు 10లోకి మొదట అడుగుపెట్టిన కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్. ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ దేబ్జానీ మొదటి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చింది.
రెండో కంటెస్టెంట్ పేరు అదిత్ ఈశ్వరన్. నిజానికి అదిత్ ఈశ్వరన్ పేరుతో హీరో ఉన్నాడు. అతనికే త్రిగుణ్ అని కూడా పేరు. ఇటీవలే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పేరు అదిత్ ఈశ్వరన్ అని వినిపిస్తోంది. మరి ఇతను సినిమా హీరో త్రిగుణ్ ఏనా కాదా అనేది తెలియాలాంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.
తొలి కామనర్ కంటెస్టెంట్‌గా ఝాన్సీ
బిగ్ బాస్ 10లోకి మూడో కంటెస్టెంట్‌గా రైతుబిడ్డ ఝాన్సీ అడుగుపెట్టింది. అగ్ని పరీక్ష 2లో టాస్క్‌ల్లో గెలిచి డైరెక్ట్ హౌజ్ ఎంట్రీ టికెట్ దక్కించుకున్న కామనర్ కోటా కంటెస్టెంట్ ఝాన్సీ. నాలుగో కంటెస్టెంట్‌గా మరో కామనర్ అమన్ అడుగుపెట్టాడు. ఇతనికి ఆడియెన్స్ నుంచి అధికంగా ఓటింగ్ రావడం వల్ల సెలెక్ట్ చేసినట్లుగా హోస్ట్ నాగార్జున చెప్పారని సమాచారం.
జబర్దస్త్ షోలో తన ఆటో పంచ్‌లతో నవ్వించిన ఆటో రామ్ ప్రసాద్ ఐదో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టాడు. ఆరో సభ్యుడిగా రోహిత్, ఏడో కంటెస్టెంట్‌గా మరో సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చారు. అత్తారింట్లో అక్కాచెళ్లెల్లు సీరియల్‌లో హీరోయిన్‌గా చైత్ర రాయ్ తెగ పాపులర్ అయింది.
టెంపర్ వంశీ-జబర్దస్త్ నరేష్
ఇక 8వ కంటెస్టెంట్‌గా టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ అడుగుపెట్టాడు. ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటుడిగా టెంపర్ వంశీ మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. 9వ సభ్యుడిగా మరో జబర్దస్త్ కమెడియన్ నరేష్ అడుగుపెట్టాడు.
బిగ్ బాస్ సీజన్ నెంబర్ 10వ కంటెస్టెంట్‌గా బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 11వ కంటెస్టెంట్‌గా కామనర్ చరణ్ అధికంగా ఓటింగ్‌తో సెలెక్ట్ అయ్యాడు. 12వ కంటెస్టెంట్‌గా అధాన్ టాక్స్ యాంకర్ సుధీర్ రెడ్డికి అవకాశం వచ్చింది.
నవదీప్, శ్రీముఖి సెలెక్ట్ చేసిన కామనర్స్
13వ కంటెస్టెంట్‌గా మరో కామనర్ శాలినికి అగ్ని పరీక్ష 2 జడ్జిగా నవదీప్ అవకాశం ఇవ్వగా, 14వ సభ్యుడిగా నటుడు కృష్ణుడు అడుగుపెట్టాడు. విలేజ్‌లో వినాయకుడు సినిమాలో హీరోగా, హ్యాపీడేస్ మూవీలో సీనియర్‌గా కృష్ణుడు అందరికి సుపరిచితమే. ఇక 15వ కంటెస్టెంట్‌గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.
16వ కంటెస్టెంట్‌గా కామనర్ అయిన శ్రష్టిని అగ్ని పరీక్ష 2 హోస్ట్ శ్రీముఖి సెలెక్ట్ చేసిందని సమాచారం. ఇలా ఇప్పటివరకు బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‌లోకి 16 మంది ఫైనల్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అయితే, అగ్ని పరీక్ష 2లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన రామకృష్ణ, అపూర్వలను వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకునే అవకాశం ఉందని సమాచారం.