Bigg Boss Agnipariksha 2 Flame Tour Launch By Kalyan Padala Demon Pawan: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ సందడి మొదలైపోయింది. సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ 10 తెలుగు ప్రారంభం కానుంది. అయితే, దీనికంటే ముందుగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చి హౌజ్‌లోకి పంపిస్తారని తెలిసిందే.
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్

ఇప్పుడు కూడా పదో సీజన్ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌ను టీమ్ ఘనంగా ప్రారంభించింది. అగ్ని పరీక్ష ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ టూర్‌ను కొనసాగిస్తున్నారు.
గతేడాది అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టి, విజేతగా నిలిచిన కల్యాణ్ పడాల ఈ ఫ్లేమ్ టూర్‌ను విజయనగరంలో ఘనంగా ప్రారంభించారు. విజయనగరం జిల్లాకు చెందిన కల్యాణ్ పడాల బిగ్‌బాస్ హౌస్‌లో తన క్రమశిక్షణ, పట్టుదల, సహనంతో పాటు అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
కల్యాణ్ పడాలతో సెల్ఫీలు
అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా నిలిచి కల్యాణ్ పడాల చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఇంతటీ క్రేజ్ తెచ్చుకున్న కల్యాణ్ పడాలను చూసేందుకు ‘అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్’లో అభిమానులు భారీగా తరలివచ్చారు. కల్యాణ్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.
కళ్యాణ్ పడాల తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తన బిగ్‌బాస్ ప్రయాణంలో విజయనగరం ప్రజలు, అభిమానులు అందించిన ప్రేమ, మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. విజయనగరం నుంచి బిగ్‌బాస్ వేదిక వరకు సాగిన తన ప్రయాణం ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే సాధ్యమైందని కల్యాణ్ పడాల పేర్కొన్నారు.
విశాఖలో డీమాన్ పవన్ సందడి
{{/usCountry}}కళ్యాణ్ పడాల తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తన బిగ్‌బాస్ ప్రయాణంలో విజయనగరం ప్రజలు, అభిమానులు అందించిన ప్రేమ, మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. విజయనగరం నుంచి బిగ్‌బాస్ వేదిక వరకు సాగిన తన ప్రయాణం ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే సాధ్యమైందని కల్యాణ్ పడాల పేర్కొన్నారు.
విశాఖలో డీమాన్ పవన్ సందడి
{{/usCountry}}బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్ సందర్భంగా అభిమానుల ఉత్సాహం, కేరింతలతో విజయనగరం సందడిగా మారింది. కల్యాణ్ పడాల ఫ్లేమ్ టూర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ టూర్ విశాఖపట్నానికి చేరుకుంది. అక్కడ బిగ్ బాస్ 9 ఫైనలిస్ట్ డీమాన్ పవన్ సందడి చేశారు.
విశాఖలో నిర్వహించిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో అభిమానులను ఉద్దేశించి డీమాన్ పవన్ ఉత్తేజకరమైన ప్రసంంగాన్ని అందించారు. అగ్ని పరీక్ష అనేది ఓ గొప్ప వేదిక అని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలనే ఆశయాన్ని నెరవేర్చే వారధి అని డీమాన్ పవన్ అన్నారు.
డీమాన్ పవన్ అదిరిపోయే స్పీచ్
అగ్ని పరీక్ష అంటే కేవలం టాస్కులు కావని, మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా చేసే ఓ వేదిక అని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలనే కోరికని, మనలోని ఫైర్‌ని సజీవంగా ఉంచే వేదిక అని డీమాన్ పవన్ పేర్కొన్నారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ ఫ్లేమ్ టూర్‌ను చేపట్టారు. ఈ టూర్‌లో కల్యాణ్ పడాల, డీమాన్ పవన్ సందడి చేశారు.
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఓటీటీ స్ట్రీమింగ్
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా టీవీ ఛానెల్‌తోపాటు జియో హాట్‌స్టార్‌లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.