Bigg Boss 10 Telugu Krishnudu Remuneration: బిగ్ బాస్ షో అంటేనే ఊహించని ట్విస్టులు, గొడవలు, అలకలు, ఇగోలు. ఇటీవల స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ కూడా ఇలాంటి అంశాలతోనే జోరుగా సాగుతోంది. సెప్టెంబర్ 6న చాలా గ్రాండ్‌గా బిగ్ బాస్ 10 తెలుగు ప్రారంభమైంది.
16 మంది కంటెస్టెంట్స్‌తో

ఈ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ని పరీక్ష 2 నుంచి సెలెక్ట్ అయిన ఆరుగురు కామనర్స్‌తోపాటు పది మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ తెలుగు 10లోకి మొత్తంగా 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వారిలో కామనర్స్‌గా ఝాన్సీ, అమన్ మసూద్, శాలిని పటేల్, సృష్టి వ్యాకరణం, చరణ్ మహాదేవ్, రోహిత్ పటేల్ ఉన్నారు.
ఇక సెలబ్రిటీల్లో త్రిగుణ్, దేబ్జానీ మోదక్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, చైత్ర రాయ్, ముఖేష్ గౌడ, యాంకర్ సుధీర్ రెడ్డి, వర్షిణి సౌందర రాజన్, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ పదిమంది ఉన్నారు. అయితే, మొదటి వారంలోనే రెండుసార్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది.
మొదటి వారం నో ఎలిమినేషన్
ఇందులో భాగంగానే చరణ్ మహాదేవ్, సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దాంతో మొదటి వారం వీకెండ్‌లో జరిగే రెగ్యులర్ ఎలిమినేషన్ లేదంటూ అందరికి గుడ్ న్యూస్ చెప్పాడు హోస్ట్ నాగార్జున. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు ఆడియెన్స్ ద్వారా ఓటింగ్ నిర్వహించి తిరిగి హౌజ్‌లోకి కామనర్ చరణ్ మహాదేవ్‌ను తీసుకొచ్చారు.
తాజాగా సింగర్, రైతుబిడ్డ ఝాన్సీ బిగ్ బాస్ 10 తెలుగు ఫస్ట్ కెప్టెన్ అయి లక్ష రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం నామినేషన్స్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో టాప్ 1, 2,3 ప్లేసుల్లో రోహిత్, త్రిగుణ్, ముఖేష్ పోటీ పడుతూ వచ్చారు.
అతి తక్కువ ఓటింగ్
{{/usCountry}}తాజాగా సింగర్, రైతుబిడ్డ ఝాన్సీ బిగ్ బాస్ 10 తెలుగు ఫస్ట్ కెప్టెన్ అయి లక్ష రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం నామినేషన్స్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో టాప్ 1, 2,3 ప్లేసుల్లో రోహిత్, త్రిగుణ్, ముఖేష్ పోటీ పడుతూ వచ్చారు.
అతి తక్కువ ఓటింగ్
{{/usCountry}}అలాగే, చివరి రెండు స్థానాలైనా 10, 11లో నటుడు కృష్ణుడు, యాంకర్ వర్షిణి తొలి రోజు నుంచే ఉంటూ వచ్చారు. ఈ ఇద్దరికే అతి తక్కువ ఓటింగ్ వస్తోందని రిపోర్ట్స్ తెలిపాయి. ఇక వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్స్ ఆట తీరుపై రివ్యూలు ఇవ్వడం సాధారణంగా జరిగే విషయమే.
ఈ వీకెండ్ కూడా వచ్చి అదే చేశారు నాగార్జున. ముఖ్యంగా కృష్ణుడు, సృష్టిపై బాగా సీరియస్ అయ్యారు నాగార్జున. బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్‌ల పోటీ పడకుండా ఆడియెన్స్‌లా కేవలం చూస్తూ మాత్రమే ఉంటున్నారని ఫైర్ అయ్యారు. నాగార్జున ఫైర్ అయినట్లుగానే ఇవాళ అంటే బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 20 ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ కృష్ణుడు, సృష్టి మధ్యే జరిగింది.
నటుడు కృష్ణుడు ఎలిమినేషన్
ఫైనల్‌గా అతి తక్కువ ఓట్లతో నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన షూటింగ్ నిన్ననే (సెప్టెంబర్ 19) జరిగిపోయింది. కాకపోతే ఈ ప్రక్రియను ఇవాళ చూపించనున్నారు. ఇలా బిగ్ బాస్ నుంచి ఇవాళ కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.
హౌజ్‌లో సృష్టి అయిన ఇతరులతో మాట్లాడటం, తన అభిప్రాయాలు పంచుకోవడం వంటివి చేసింది. కానీ, నటుడు కృష్ణుడు మాత్రం అలాగే కూర్చోవడం. పెద్దగా టాస్కుల్లో పాల్గొనకపోవడమే కాకుండా వాటిపై ఇంట్రెస్ట్ కూడా చూపించకుండా బద్ధకంగా ఉండటం వంటివి జనాలకు నచ్చలేదని తెలుస్తోంది.
కృష్ణుడు పారితోషికం
కృష్ణుడు బద్ధకమే ఆయన కొంపముంచిందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కృష్ణుడు బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన 2 వారాలు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కృష్ణుడు సుమారుగా రూ. 6 లక్షలకుపైగా సంపాదించినట్లు తెలుస్తోంది.