...
...
Next Story

బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్- సెల్ఫ్ ఎలిమినేట్ అయిన సింగర్ రాము రాథోడ్- ఇవాళ మరొకరు ఎలిమినేట్- ఈ వారం డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈపాటికే తనకు తానుగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు ఫోక్ సింగర్ రాము రాథోడ్. పాట పాడి సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు రాము. ఇక ఇవాళ మరొకరు హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. అది ఎవరో తెలుసుకుందాం.

Published on: Nov 9, 2025, 08:20:54 IST
Advertisement

బిగ్ బాస్ 9 తెలుగులో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. బిగ్ బాస్ అన్నాక ఇలా అనుకోని ట్విస్టులు, అరుపులు, గొడవలు సర్వసాధారణమే. ఎలిమినేషన్‌లో ప్రతి రెండు మూడు వారాలకు ఏదో ఒక ట్విస్ట్ ఉంటూనే ఉంటుంది. అది కొన్ని సార్లు డబుల్ ఎలిమినేషన్ అయితే.. మరికొన్ని సార్లు సెల్ఫ్ ఎవిక్ట్ అవుతుంది.

ఫోక్ సింగర్ రాము ఎలిమినేట్

బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్- సెల్ఫ్ ఎలిమినేట్ అయిన సింగర్ రాము రాథోడ్- ఇవాళ మరొకరు ఎలిమినేట్- ఈ వారం డబుల్ ఎలిమినేషన్
బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్- సెల్ఫ్ ఎలిమినేట్ అయిన సింగర్ రాము రాథోడ్- ఇవాళ మరొకరు ఎలిమినేట్- ఈ వారం డబుల్ ఎలిమినేషన్

అదే ఈ వారం జరిగింది. ఓటింగ్ బాగున్నా కూడా స్వయంగా ఎలిమినేట్ అయి కంటెస్టెంట్స్ వెళ్లిపోతుంటారు. గత బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో నాగ మణికంఠ సొంతంగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.

బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 8 నాటి ఎపిసోడ్‌లో వీకెండ్‌లో భాగంగా హోస్ట్ నాగార్జున వచ్చాడు. వారం అంతా డల్‌గా ఉన్న రామును ఏమైందని, ఎలా ఉన్నావని నాగార్జున అడిగాడు. కుటుంబం గుర్తుకు వస్తుందని, అమ్మ గుర్తుకు వస్తుందని, నిద్ర పట్టడం లేదని, అందరూ ఉన్న కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నానని రాము రాథోడ్ తెలిపాడు.

సూపర్ హిట్ సాంగ్ పాడి వీడ్కోలు

యూట్యూబ్‌లో సూపర్ హిట్ అయిన "బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా" పాటను పాడి తన బాధ చెప్పుకున్నాడు రాము రాథోడ్. సాంగ్ పాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

"మాది పెద్ద ఫ్యామిలీ. చాలా హడావిడిగా ఉంటుంది. నేను లేకపోతే ఎలా ఉందో అని టెన్షన్‌గా ఉంది. భయమేస్తుంది సర్. ఇంట్లో ఏడెనిమిది మంది పిల్లలుంటారు. వాళ్లు గుర్తుకు వస్తున్నారు. నేను పెంచుకునే డాగ్స్ గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ ఉండలేకపోతున్నాను. సెల్ఫ్ ఎలిమినేట్ అవుతా. వెళ్లిపోతా" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు సింగర్ రాము రాథోడ్.

ఎంత రిక్వెస్ట్ చేసినా

రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో మిగతా కంటెస్టెంట్స్ అంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో రాము రాథోడ్‌తోపాటు సుమన్ శెట్టి, భరణి శంకర్, సాయి శ్రీనివాస, తనూజ పుట్టస్వామి, సంజన గల్రాని, కల్యాణ్ పడాల ఏడుగురు ఉన్నారు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్

నామినేషన్స్ తర్వాత మొదలైన బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం ఓటింగ్‌లో అతి తక్కువ ఓట్లతో సాయి శ్రీనివాస ఉన్నాడు. అయితే, సింగర్ రాము సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో సాయి శ్రీనివాస ఎలిమినేషన్ ఉండదని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా సాయి శ్రీనివాస కూడా ఎలిమినేట్ అయ్యాడు.

దీనికి సంబంధించిన షూటింగ్ శనివారం (నవంబర్ 8) జరగిపోయింది. ఇవాళ (నవంబర్ 9) సాయి శ్రీనివాస ఎలిమినేషన్‌ను ప్రసారం చేయనున్నారు. అంటే, రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్షన్, సాయి శ్రీనివాస ఓటింగ్ ఎలిమినేట్‌తో బిగ్ బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe