...
...
Next Story

ఫొటోగ్రాఫర్లపై విరుచుకుపడిన బోల్డ్ హీరోయిన్- కూతురు దేవి మొహం చూపించకుండా తీసుకెళ్లిన బిపాసా బసు

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ బిపాసా బసు ముంబైలోని బాంద్రాలో తన కుమార్తె దేవితో కలిసి కెమెరా కంటికి చిక్కారు. అయితే ప్యాపరాజీలు (ఫొటోగ్రాఫర్స్) తన చిన్నారి ముఖాన్ని క్లిక్ చేసేందుకు ప్రయత్నించడంతో బిపాసా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఫొటోగ్రాఫర్లపై విరుచుకుపడుతూ నిలదీసింది.

Updated on: Jan 22, 2026, 13:17:31 IST
Advertisement

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ బిపాసా బసు చాలా కాలం తర్వాత తన కుటుంబంతో కలిసి బయట కనిపించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్, కుమార్తె దేవితో కలిసి ఒక అరుదైన అవుటింగ్‌లో బిపాసా సందడి చేశారు. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

“ఎవరు మీరు?” అంటూ బిపాసా ప్రశ్న

ఫొటోగ్రాఫర్లపై విరుచుకుపడిన బోల్డ్ హీరోయిన్- కూతురు దేవి మొహం చూపించకుండా తీసుకెళ్లిన బిపాసా బసు
ఫొటోగ్రాఫర్లపై విరుచుకుపడిన బోల్డ్ హీరోయిన్- కూతురు దేవి మొహం చూపించకుండా తీసుకెళ్లిన బిపాసా బసు

గురువారం (జనవరి 22) నాడు బాంద్రాలో కారు దిగుతున్న సమయంలో బిపాసాను, తన చిన్నారి దేవిని ఫొటోగ్రాఫర్లు క్లిక్ చేసేందుకు ప్రయత్నించారు. తన కుమార్తె దేవిని ఎత్తుకున్న బిపాసా, వెంటనే అప్రమత్తమై పాప ముఖాన్ని తన చేతులతో కవర్ చేశారు.

కరణ్ సింగ్ గ్రోవర్ బ్యాగ్ తగిలించుకుని వారి వెంటే నడిచారు. ప్యాపరాజీలు (ఫొటోగ్రాఫర్స్) తన కూతురు దేవి ముఖాన్ని ఫొటో తీయడానికి ప్రయత్నిస్తుండటంతో బిపాసా తీవ్ర అసహనానికి గురయ్యారు. బిల్డింగ్‌లోకి వెళ్తున్న సమయంలో కోపంగా ఒక ఫొటోగ్రాఫర్‌ వైపు చూస్తూ “అసలు ఎవరు మీరు?” (కౌన్ హో ఆప్?) అని ప్రశ్నిస్తూ లోపలికి వెళ్లిపోయారు.

విరుచుకుపడటంతో

ఫోటోగ్రాఫ్లపై బిపాసా బసు విరుచుకుపడటంతో సెలబ్రిటీలు తమ పిల్లల ప్రైవసీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ఈ బోల్డ్ బ్యూటీ ప్రవర్తన మరోసారి నిరూపించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం బిపాసా తన కూతురితో గడిపిన సరదా క్షణాలను అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. రీసెంట్‌గా ఈ జంట తమ గారాల పట్టి దేవితో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

పదేళ్ల బంధం.. ముచ్చటైన కుటుంబం

ఇక బిపాసా బసు చివరిగా ‘డేంజరస్’ అనే ఓటీటీ సిరీస్‌లో కనిపించారు. ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ ద్వారా బిపాసా బసు ఓటీటీలోకి అడుగుపెట్టారు. తెలుగులో మహేశ్ బాబు సరసన టక్కరి దొంగ మూవీలో హీరోయిన్‌గా కూడా చేసింది బిపాసా బసు. చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

మరోవైపు కరణ్ సింగ్ గ్రోవర్ గతేడాది ‘ఫైటర్’ సినిమాలో నటించారు. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 358 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe