...
...
Next Story

OTT Action: 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్- 7.8 రేటింగ్- కార్పోరేట్ vs ఊరి భవిష్యత్తు- తెలుగులో!

OTT Family Action Thriller Blast Streaming Today: ఇవాళ రెండు ఓటీటీల్లోకి ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బ్లాస్ట్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 7.8 రేటింగ్ ఉన్న ఈ సినిమా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ నటించిన బ్లాస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

Published on: Jun 25, 2026, 22:30:58 IST
Advertisement

OTT Family Action Thriller Blast Release Today On 2 Platforms: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మార్క్ మార్షల్ ఆర్ట్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందిన తాజా చిత్రం 'బ్లాస్ట్' (Blast) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లోకి అడుగుపెట్టేసింది.

రెండు ఓటీటీల్లోకి బ్లాస్ట్

2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్- 7.8 రేటింగ్- కార్పోరేట్ vs ఊరి భవిష్యత్తు- తెలుగులో!
2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్- 7.8 రేటింగ్- కార్పోరేట్ vs ఊరి భవిష్యత్తు- తెలుగులో!

థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ తమిళ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఓటీటీ వీక్షకుల ముందుకు రావడం విశేషం. అది కూడా ఒకటి కాదు రెండు ఓటీటీల్లో బ్లాస్ట్ స్ట్రీమింగ్ అవుతోంది.

సుభాష్ కె. రాజ్ కథ, దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాస్ట్ చిత్రానికి థియేటర్లలో విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయినప్పటికీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అసలు కథేంటంటే?

బ్లాస్ట్ సినిమా కథాంశం విషయానికి వస్తే.. రాజారామ్ (అర్జున్ సర్జా) ఒక గౌరవప్రదమైన కరాటే మాస్టర్. ఆయన తన భార్య నీలవేణి (అభిరామి), కుమార్తె నీలా (ప్రీతి ముకుందన్) లతో కలిసి ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుంటాడు. పైకి చాలా సాధారణ కుటుంబంలా కనిపించినప్పటికీ, ఈ ముగ్గురికీ మార్షల్ ఆర్ట్స్‌లో అసాధారణమైన ప్రావీణ్యం ఉంటుంది.

వీరి ప్రశాంత జీవితంలోకి వరుణ్ దయాలన్ అనే ఒక శక్తివంతమైన వ్యాపారవేత్త ప్రవేశిస్తాడు. ఒక కొండ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామంలో భారీ మైనింగ్ (గనుల తవ్వకం) ప్రాజెక్టును అతడు ప్రారంభిస్తాడు. ఈ ప్రాజెక్టుకు అడ్డువచ్చే ఏ శక్తినైనా తొలగించడానికి అబ్రహం అనే ప్రమాదకరమైన గూండాతో పాటు తనకున్న రాజకీయ పలుకుబడిని వాడుతుంటాడు.

గనుల మాఫియాపై కరాటే మాస్టర్ పోరాటం..

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది బీజీఎమ్. 'కేజీఎఫ్' (KGF), 'సలార్' చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాతోనే తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని యాక్షన్ సీన్లను, ఎమోషనల్ సీన్లను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది.

అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకురాగా, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ (AGS Entertainment) బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

బాక్సాఫీస్ వసూళ్లు, ఐఎమ్‌డీబీ రేటింగ్ వివరాలు

అర్చన కల్పాతి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అర్జున్ సర్జాతో పాటు వివేక్ ప్రసన్న, జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం, పవన్, దిలీపన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'బ్లాస్ట్' చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద సాధారణ వసూళ్లను సాధించింది.

ఇండియాలో రూ. 52.31 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 74.49 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ చిత్రానికి రూ. 14.40 కోట్లు వచ్చాయి. థియేటర్లలో యావరేజ్ అనిపించుకున్నా ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ (IMDb) లో దాదాపు 11 వేల మంది యూజర్ల నుంచి 10 కి గాను 7.8 రేటింగ్ లభించింది.

నెట్‌ఫ్లిక్స్, బుక్ మై షో ఓటీటీల్లో

ఇలాంటి బ్లాస్ట్ రెండు ఓటీటీల్లోకి ఇవాళ (జూన్ 25) వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌తోపాటు బుక్ మై షోలోనూ బ్లాస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి 5 భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో బ్లాస్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న బ్లాస్ట్ సినిమాను నెట్‌ఫ్లిక్స్, బుక్ మై షో ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe