...
...
Next Story

Bhumi Pednekar: స్విమ్మింగ్ పూల్ గోడపై మహిళ ఫొటో, అసభ్యకరంగా తాకుతూ యువకుల వికృత చేష్టలు- క్లాస్ పీకిన హీరోయిన్ భూమి

Bhumi Pednekar Reacts To Obscene Wall Painting: దేశంలో మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న గోడపై మహిళ పెయింటింగ్ వేసి ఉంది. ఆ మహిళ ఫొటో పట్ల కొందరు యువకులు ప్రవర్తించిన అసభ్యకర తీరుపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: May 25, 2026, 10:40:21 IST
Advertisement

Bhumi Pednekar Reacts To Obscene Wall Painting: మహిళల భద్రత, సమాజంలో వారిపై జరుగుతున్న అన్యాయాలపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ మరోసారి గళమెత్తారు. దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, కట్న వేధింపుల మరణాలు కలవరపెడుతున్న తరుణంలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వికృత వీడియోపై భూమి తీవ్రంగా స్పందించారు.

33 ఏళ్ల నటి మృతి

స్విమ్మింగ్ పూల్ గోడపై మహిళ ఫొటో, అసభ్యకరంగా తాకుతూ యువకుల వికృత చేష్టలు- క్లాస్ పీకిన హీరోయిన్ భూమి
స్విమ్మింగ్ పూల్ గోడపై మహిళ ఫొటో, అసభ్యకరంగా తాకుతూ యువకుల వికృత చేష్టలు- క్లాస్ పీకిన హీరోయిన్ భూమి

భోపాల్‌లో ఇటీవల కట్న వేధింపులు తట్టుకోలేక 33 ఏళ్ల నటి ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణంపై ఇప్పటికే కంగనా రనౌత్ వంటి తారలు స్పందిస్తూ, పెళ్లయిన తర్వాత కూతుళ్లను పుట్టింటి వారు పట్టించుకోకుండా వదిలేసే సామాజిక పోకడలను తప్పుబట్టారు. ఈ వివాదం కొనసాగుతుండగానే, యువత వికృత మనస్తత్వాన్ని బయటపెట్టే మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

గోడచిత్రంపైనా అసభ్య చేష్టలా?

'ట్యూబ్ ఇండియన్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న గోడపై గీసిన మహిళా చిత్రాన్ని చూసి కొందరు యువకులు అత్యంత అసభ్యకరంగా తాకుతూ, హావభావాలు ప్రదర్శిస్తూ వికృతానందం పొందారు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంటూ భూమి పెడ్నేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

"ఇదీ మన యువత మానసిక స్థితి. రేపు మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడులకు ఒడిగట్టేది ఇలాంటి మనస్తత్వం ఉన్నవారే. మనం ఒక ప్రమాదకరమైన సామాజిక మహమ్మారి మధ్య బతుకుతున్నాం. కేవలం ఖండించడం, సిగ్గుపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నిందితులకు కఠినమైన చట్టాలు, ఇంకా కఠినమైన చట్టాలు మాత్రమే బుద్ధి చెబుతాయి" అని భూమి పెడ్నేకర్ అన్నారు.

సమాజం విఫలమవుతోంది!

"చిన్న వయసు పిల్లలు ఇంతటి ఘోరానికి తెగబడటం చూస్తుంటే గుండె పగిలిపోతోంది. వారు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారో ఊహించుకోవచ్చు. దేశంలో నోరులేని వారిని శిక్షిస్తూ, వీధి కుక్కల బెడద లాంటి విషయాలను పెద్దవిగా చూపిస్తూ అసలైన నేరాలను పక్కదారి పట్టిస్తున్నారు" అని భూమి విమర్శించారు. ఇటీవలి కాలంలో రిధి డోగ్రా, కంగనా రనౌత్ వంటి నటీమణులు కూడా మహిళల స్వావలంబన, పెళ్లిళ్ల తర్వాత ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా మాట్లాడుతున్నారు.

ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో మెరిసిన భూమి

'దమ్ లగా కే హైషా' సినిమాతో ఆకట్టుకున్న భూమి పెడ్నేకర్, ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన 'దల్‌దల్' (Daldal) వెబ్ సిరీస్‌లో నటించారు. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, ప్రముఖ రచయిత విష్ ధమీజా రాసిన 'బెండీ బజార్' పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.

ఓటీటీ ట్రెండింగ్‌లోనూ

ఇందులో భూమి డీసీపీ రీటా ఫెరీరా అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు సాగించిన పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమర తిజోరి, ఆదిత్య రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 30 నుంచి దల్‌దల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లోనూ నిలిచింది.

యువకుల ప్రవర్తన వీడియోపై భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నటి భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో దేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు?

ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న మహిళా గోడచిత్రం (వాల్ పెయింటింగ్) పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోపై భూమి పెడ్నేకర్ తీవ్రంగా మండిపడ్డారు.

2. మహిళల భద్రతపై భూమి పెడ్నేకర్ ఎలాంటి డిమాండ్ చేశారు?

కేవలం మాటలతో సరిపెట్టకుండా, మహిళలపై, చిన్నారులపై దారుణాలకు ఒడిగట్టే మృగాళ్లకు బుద్ధి చెప్పేలా దేశంలో మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

3. ఇటీవల భోపాల్‌లో జరిగిన ఏ ఘటనపై బాలీవుడ్ తారలు స్పందించారు?

భోపాల్‌లో కట్న వేధింపులు తట్టుకోలేక 33 ఏళ్ల నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై కంగనా రనౌత్ వంటి నటీమణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

4. భూమి పెడ్నేకర్ నటించిన తాజా వెబ్ సిరీస్ ఏది?

ప్రైమ్ వీడియోలో జనవరి 30న విడుదలైన 'దల్ దల్' (Daldal) వెబ్ సిరీస్‌లో భూమి పెడ్నేకర్ డీసీప రీటా ఫెరీరాగా పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe