...
...
Next Story

Shahneel Gill OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న శుభ్‌మన్ గిల్ అక్క- శత్రువును ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసన్న షెహనీల్!

Shubman Gill Sister Shahneel Gill OTT Entry: టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అక్క షెహనీల్ గిల్ ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా శత్రువును ఎలా దెబ్బతీయాలో తనకు బాగా తెలుసు అంటూ షెహనీల్ గిల్ కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది. మరి షెహనీల్ గిల్ ఓటీటీ ఎంట్రీ ఎక్కడో ఇక్కడ చూద్దాం.

Published on: Jul 31, 2026, 12:11:43 IST
Advertisement

Shubman Gill Sister Shahneel Gill OTT Entry: మైదానంలో తన సోదరుడు శుభ్‌మన్ గిల్ కొట్టే సిక్సర్లు, ఫోర్లను చూస్తూ స్టేడియం గ్యాలరీలో సందడి చేసే షెహనీల్ గిల్ ఇప్పుడు సొంతంగా గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఓటీటీ వేదికగా ఎంటర్‌టైన్‌మెంట్ పంచనున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో 'ది ట్రేటర్స్ సీజన్ 2'తో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

21 మంది సెలబ్రిటీల మధ్య సాగే

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న శుభ్‌మన్ గిల్ అక్క- శత్రువును ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసన్న షెహనీల్!
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న శుభ్‌మన్ గిల్ అక్క- శత్రువును ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసన్న షెహనీల్!

మొత్తం 21 మంది సెలబ్రిటీల మధ్య సాగే ఈ మైండ్ గేమ్‌లో పాల్గొనేందుకు షెహనీల్ గిల్ సిద్ధమయ్యారు. జూలై 30 గురువారం నాడు వైభవంగా జరిగిన ఈ ఓటీటీ షో గ్రాండ్ లాంచ్ వేదికపై షెహనీల్ గిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పవర్‌ఫుల్ డైలాగ్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్

ఈవెంట్ లాంచ్ సమయంలో షెహనీల్ చెప్పిన వన్-లైనర్ డైలాగ్ ఇప్పుడు క్రికెట్ అభిమానులను, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. "నా పేరు గిల్.. శత్రువును ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు" అని షెహనీల్ స్టేజ్ పైన ధీమాగా చెప్పారు.

బిగ్ స్క్రీన్ రియాలిటీ గేమ్‌లో

ఇప్పటివరకు కేవలం శుభ్‌మన్ గిల్ సిస్టర్‌గానే పరిచయమున్న షెహనీల్‌కు సోషల్ మీడియాలో ఇప్పటికే భారీగా ఫాలోయింగ్ ఉంది. కంటెంట్ క్రియేటర్‌గా, ఇన్‌ఫ్ల్యూయెనర్స్‌గా రాణిస్తున్న ఆమె మొదటిసారి ఇంత పెద్ద బిగ్ స్క్రీన్ రియాలిటీ గేమ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

క్రికెటర్ల కుటుంబాల నుంచి మరో ఎంట్రీ!

ఈ ఏడాదిలో ఒక భారతీయ క్రికెటర్ కుటుంబ సభ్యులు రియాలిటీ షోలోకి రావడం ఇది రెండోసారి. కొన్ని నెలల క్రితమే శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన 'లాకప్' సీజన్ 2లో సందడి చేశారు. ఇప్పుడు అదే బాటలో షెహనీల్ గిల్ కూడా ఓటీటీ తెరపై తన మార్క్ చూపించేందుకు వస్తున్నారు.

ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్.. పెరగనున్న డ్రామా!

ఈ సీజన్‌లో షెహనీల్ గిల్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్, మునావర్ ఫారూఖీ, రియా చక్రవర్తి, క్రిస్టల్ డిసౌజా, పార్ శర్మ, ప్రముఖ చెఫ్ రణ్‌వీర్ బ్రార్, సీనియర్ నటుడు దలీప్ తాహిల్ వంటి ప్రముఖులు పోటీపడుతున్నారు. వీరితో పాటు అభిషేక్ మల్హాన్, శ్వేతా తివారీ, ఆర్జే కుల్లు కూడా ఈ వేదికపై అలరించనున్నారు.

సీక్రెట్ పార్ట్‌నర్

ఇదిలా ఉంటే, ఈసారి షోలో ఊహించని పెద్ద ట్విస్ట్ ఉండనుంది. కరణ్ జోహార్‌తో కలిసి రాజప్రాసాదంలో ఒక రహస్య భాగస్వామి (సర్‌ప్రైజ్ పార్ట్‌నర్) ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మైండ్ గేమ్స్, వెన్నుపోట్లు

ఈ కొత్త మలుపు ఆటలో మరిన్ని మైండ్ గేమ్స్, వెన్నుపోట్లకు దారితీస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe