బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కల్కి 2898 ఏడీ బ్యూటీ దీపికా పదుకొణె ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుంది. దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె త్వరలో పెళ్లి చేసుకోనుందని డెక్కన్ క్రానికల్ మీడియా తెలిపింది. అయితే, అనీషా వివాహ విషయంపై దీపికా కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అనీషాకు కాబోయే భర్త

కానీ, బాలీవుడ్ మీడియాలో అనీషా పదుకొణె పెళ్లి టాపిక్ జోరుగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అనీషా పదుకొణె పెళ్లి చేసుకునేది ఎవరిని, అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
అనీషా పదుకొణె వ్యాపారవేత్త రోహన్ ఆచార్యను పెళ్లి చేసుకోనుందని హిందీ మీడియా పేర్కొంది. హిందీ దిగ్గజ నిర్మాత బిమల్ రాయ్ మని మనవడు ఈ రోహన్ ఆచార్య. అలాగే, రోహన్ ఆచార్య బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్‌ను వివాహం చేసుకున్న దిశా ఆచార్య సోదరుడు.
పేరుకే బిజినెస్‌మ్యాన్
అంటే సన్నీ డియోల్‌కు రోహన్ ఆచార్య కోడలు దిశా తరఫు నుంచి అల్లుడు వరస అవుతాడు. పేరుకు బిజినెస్ మ్యాన్ అయిన రోహన్ ఆచార్యకు సినీ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనీషా పదుకొణె, రోహన్ ఆచార్య పెళ్లి గురించి వారి కుటుంబం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
కాగా అనీషా, రోహన్ తమ లవ్ రిలేషన్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచారు. రోహన్ ఆచార్య కుటుంబానికి దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ చాలా క్లోజ్‌గా ఉండేవాడు. రోహన్ ఫ్యామిలీతో రణ్‌వీర్ సింగ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి. అప్పుడు అనీ, రోహన్‌పై లవ్ ట్రాక్ రూమర్స్ వచ్చేవి. కానీ, వాటికి ఇద్దరూ రియాక్ట్ అయ్యేవారు కాదు.
ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ డైరెక్టర్
{{/usCountry}}కాగా అనీషా, రోహన్ తమ లవ్ రిలేషన్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచారు. రోహన్ ఆచార్య కుటుంబానికి దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ చాలా క్లోజ్‌గా ఉండేవాడు. రోహన్ ఫ్యామిలీతో రణ్‌వీర్ సింగ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి. అప్పుడు అనీ, రోహన్‌పై లవ్ ట్రాక్ రూమర్స్ వచ్చేవి. కానీ, వాటికి ఇద్దరూ రియాక్ట్ అయ్యేవారు కాదు.
ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ డైరెక్టర్
{{/usCountry}}ఇకపోతే పాపులర్ బ్యాడ్‌మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె- ఉజ్జల పదుకొణె దంపతుల చిన్న కుమార్తె అనీషా. దీపికా పదుకొణె ప్రారంభించిన ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌కు అనీషా డైరెక్టర్‌గా ఉంది. మెంటల్ హెల్త్, ఒత్తిడిని అధిగమించడంపై అవగాహన కల్పిస్తుంటుంది అనీషా పదుకొణె.
కాగా, గతంలో హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో చెల్లి గురించి దీపికా మాట్లాడుతూ.. "అనీషా తెగ మాటకారి. మాట్లాడుతూనే ఉంటుంది. కానీ, తాను చెప్పాలనుకుంది చాలా చాలా స్పష్టంగా, అతి సున్నితంగా చెబుతుంది. అవతలి వ్యక్తిని బాధించకుండా తన అభిప్రాయాలను ఎలా చెప్పాలో ఆమెకు తెలుసు" అని తెలిపింది.
నా గురించి ఏం చెప్పదు
"నా గురించి నాకు మంచి అనుభూతి కలిగించడానికి మాత్రం అనీషా ఏమీ చెప్పదు. అనీషాకు నేను నటించిన రామ్-లీలా (గోలియోన్ కి రాస్‌లీలా) సినిమా అంటే చాలా ఇష్టం" అని దీపికా పదుకొణె పేర్కొంది.
ఇదిలా ఉంటే, యాక్షన్ కామెడీ చిత్రాల డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'సింఘం ఎగైన్' మూవీలో దీపికా పదుకొణె చివరి సారిగా కనిపించింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు నటించారు. ఇది గత ఏడాది థియేటర్లలో విడుదలై ఆకట్టుకోలేదు.
షారుక్-అల్లు అర్జున్ సినిమాల్లో
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తున్న కింగ్ మూవీలో దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.