...
...
Next Story

Dhanush Kalai Asuran: కమల్, అజిత్ తరహాలో ధనుష్‌కు కళై అసురన్ బిరుదు- స్టేజీపై రెజెక్ట్ చేసిన హీరో- అసలు దాని అర్థం ఇదే!

Dhanush Kalai Asuran Title: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలకు బిరుదులు ఇవ్వడం ఒక ఆనవాయితీ. కమల్ హాసన్, అజిత్ కుమార్ దారిలోనే వెళ్తూ నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్‌కు 'కళై అసురన్' అనే కొత్త బిరుదు ఇచ్చినట్లు డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తెలిపారు. అయితే, ఈ బిరుదును అందరి ముందే ధనుష్ రెజెక్ట్ చేశారు.

Published on: Apr 27, 2026, 20:27:02 IST
Advertisement

Dhanush Kalai Asuran Title KS Ravikumar: కోలీవుడ్ స్టార్ హీరోలకు అభిమానులు లేదా సినీ పెద్దలు రకరకాల బిరుదులు ఇవ్వడం దశాబ్దాలుగా వస్తోంది. రజనీకాంత్ 'సూపర్ స్టార్'గా, కమల్ హాసన్ 'ఉలగ నాయగన్'గా, అజిత్ 'తలా'గా గుర్తింపు పొందారు. కానీ, మారుతున్న కాలంతో పాటు నటుల ఆలోచనా విధానం మారుతోంది. ఆ పేర్లతో వారిని పిలవడం ఇష్టంలేదని ఆ హీరోలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

కమల్, అజిత్ తరహాలో ధనుష్‌కు కళై అసురన్ బిరుదు- స్టేజీపై రెజెక్ట్ చేసిన హీరో- అసలు దాని అర్థం ఇదే!
కమల్, అజిత్ తరహాలో ధనుష్‌కు కళై అసురన్ బిరుదు- స్టేజీపై రెజెక్ట్ చేసిన హీరో- అసలు దాని అర్థం ఇదే!

అయితే, తాజాగా తన తదుపరి చిత్రం 'కర' ప్రమోషన్స్ వేదికగా ధనుష్ తనకు బిరుదులు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రస్తావిస్తూ.. గతంలో తాను కమల్ హాసన్‌కు 'ఉలగ నాయగన్' బిరుదు ఇచ్చానని, ఇప్పుడు వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఇషారి గణేష్ ధనుష్‌కు 'కళై అసురన్' అనే బిరుదు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ బిరుదుకు కళల్లో రాక్షసుడు లేదా అత్యంత నైపుణ్యం గలవాడు అని అర్థం వస్తుంది.

ధనుష్ ఏమన్నారంటే?

కేఎస్ రవికుమార్ అడిగిన ప్రశ్నకు ధనుష్ స్పందిస్తూ.. "నన్ను కళై అసురన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు సార్" అని బదులిచ్చారు. కనీసం 'అసురన్' సినిమా పేరుతో పిలవొచ్చా అని అడగ్గా.. "అది మన సినిమా కాబట్టి ఓకే, కానీ నన్ను ధనుష్ అని పిలిస్తేనే నాకు సంతోషం" అని వినయంగా రెజెక్ట్ చేశారు. ఈ సమాధానం విన్న రవికుమార్ సరదాగా ధనుష్‌పై పూలు విసిరి తన అభిమానాన్ని చాటుకున్నారు.

నిజానికి ధనుష్ ఇలా టైటిల్‌ను వద్దనడం ఇది మొదటిసారి కాదు. 2019లో నిర్మాత కలైపులి ఎస్. థాను ఆయనకు 'ఇళయ సూపర్ స్టార్' (యంగ్ సూపర్ స్టార్) అనే బిరుదు ఇవ్వాలని ప్రయత్నించారు. తన మామ రజనీకాంత్ టైటిల్‌కు అనుబంధంగా ఉన్న ఆ పేరును కూడా ధనుష్ అప్పట్లోనే తిరస్కరించారు ధనుష్. కేవలం తన పేరుతోనే తనను గుర్తించాలని ఆయన కోరుకుంటున్నారు.

మారిన తరం.. మారుతున్న ట్రెండ్

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ధనుష్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. 2025లో ఆయన తన మేనల్లుడు పవిష్ నారాయణ్‌తో 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' (తెలుగులో జాబిలమ్మా నీకు అంత కోపమా), నిత్యా మీనన్‌తో 'ఇడ్లీ కడై' (ఇడ్లీ కొట్టు) వంటి చిత్రాలను రూపొందించారు.

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, రష్మిక మందన్నాతో కలిసి 'కుబేర'లో కూడా యాక్ట్ చేసి తన నటనతో ఫిదా చేశారు ధనుష్. ఇక హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో 'తేరే ఇష్క్ మే' చిత్రంలో కృతి సనన్‌తో అదరగొట్టారు.

కర రిలీజ్ డేట్

ఇక లేటెస్ట్ మూవీ కర ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా చేసింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe