Don't Be Shy Trailer Released And OTT Streaming: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్, నిర్మాతగానూ వరుస వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. ఆమె సొంత నిర్మాణ సంస్థ 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' పతాకంపై రూపుదిద్దుకున్న నూతన చిత్రం 'డోంట్ బీ షై' (Don’t Be Shy) ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ శుక్రవారం (సెప్టెంబర్ 11) విడుదల చేసింది.
ఆకట్టుకుంటున్న ట్రైలర్..

టీనేజ్ డ్రామా, క్యాంపస్ రొమాన్స్ కలగలిపిన కథాంశంతో ఈ ఓటీటీ సినిమా రూపుదిద్దుకుంది. సుమారు 2 నిమిషాల 32 సెకన్ల నిడివి ఉన్న ఈ డోంట్ బీ షై ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
అసలు కథేంటంటే?
శ్యామిలీ అలియాస్ 'షై' దాస్ (ఆరుషి బజాజ్) అనే కళాశాల విద్యార్థిని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ప్రతీ విషయాన్ని ముందే ప్రణాళిక వేసుకునే షై ఆశలు ఉన్నట్టుండి తలకిందులవుతాయి. ఈ క్రమంలో ఆమె కళాశాలలో ధనవంతుడు, అందరి దృష్టిని ఆకర్షించే మయాంక్ (పీయూష్ ఖాటి) వైపు ఆకర్షితురాలవుతుంది.
సరిగ్గా అదే సమయంలో దూరమైన చిన్ననాటి మిత్రుడు ధ్రువ్ (అన్ష్ దుగ్గల్) మళ్లీ షై జీవితంలోకి వస్తాడు. వీరిద్దరి మధ్య నలిగిపోయే షై జీవితంలోకి తార (బియాంకా అరోరా) రాకతో కథ అనేక మలుపులు తిరుగుతుంది.
"తొలి ప్రేమ.. తప్పు నిర్ణయాల సమాహారమే ఈ సినిమా"
డోంట్ బీ షై సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అలియా భట్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "తొలి ప్రేమ, బెస్ట్ ఫ్రెండ్స్, గుండెకోతలు, మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు.. ఇవన్నీ కలిపితేనే యుక్తవయసులోకి అడుగుపెట్టే ఆ మధుర జ్ఞాపకాలు" అని అలియా భట్ పేర్కొన్నారు.
దర్శకురాలు శ్రీతి ముఖర్జీ మాట్లాడుతూ.. "చిన్నతనంలో నన్ను ఎంతగానో అలరించిన, ఓదార్పునిచ్చిన సినిమాలను గుర్తుచేసుకుంటూ ఈ కథను రాసుకున్నాను. యుక్తవయసులో అడుగుపెట్టే వేళ ప్రతీ ఒక్కరి జీవితంలో ఎదురయ్యే గందరగోళం, అమాయకత్వం, మళ్లీ మనల్ని మనం వెతుక్కునే ప్రయాణమే ఈ చిత్రం" అని తెలిపారు.
సరికొత్త నటీనటులు.. సీనియర్ల కలయిక
{{/usCountry}}దర్శకురాలు శ్రీతి ముఖర్జీ మాట్లాడుతూ.. "చిన్నతనంలో నన్ను ఎంతగానో అలరించిన, ఓదార్పునిచ్చిన సినిమాలను గుర్తుచేసుకుంటూ ఈ కథను రాసుకున్నాను. యుక్తవయసులో అడుగుపెట్టే వేళ ప్రతీ ఒక్కరి జీవితంలో ఎదురయ్యే గందరగోళం, అమాయకత్వం, మళ్లీ మనల్ని మనం వెతుక్కునే ప్రయాణమే ఈ చిత్రం" అని తెలిపారు.
సరికొత్త నటీనటులు.. సీనియర్ల కలయిక
{{/usCountry}}హీరోయిన్‌గా నటించిన ఆరుషి బజాజ్ తన పాత్రపై స్పందిస్తూ.. "నా నిజ జీవిత స్వభావానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది. ఈ క్యారెక్టర్ చేయడం నాకు సవాలుగా అనిపించినా, నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి దోహదపడింది" అని చెప్పారు.
డోంట్ బీ షై సినిమాలో ఆరుషి బజాజ్, పీయూష్ ఖాటి, బియాంకా అరోరా, అన్ష్ దుగ్గల్ వంటి నూతన నటీనటులతో పాటు కుణాల్ రాయ్ కపూర్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బాసు, నేహా ధూపియా, అంజు ఆల్వా నాయక్ కీలక పాత్రల్లో నటించారు.
డోంట్ బీ షై ఓటీటీ స్ట్రీమింగ్
శ్రీతి ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలియా భట్, షాహీన్ భట్ నిర్మించగా, గ్రీష్మా షా, వికేష్ భూతానీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. నేటి తరం యువత భావోద్వేగాలను, క్యాంపస్ లైఫ్‌ను ప్రతిబింబించేలా ఉన్న డోంట్ బీ షై ఓటీటీలోకి వచ్చేయనుంది. సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డోంట్ బీ షై ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.