Best 5 OTT Release Movies Today Friday: ఇవాళ (అక్టోబర్ 2) గాంధీ జయంతి పురస్కరించుకుని వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఓటీటీ ప్రియులకు వినోదాల విందు సిద్ధమైంది. అక్టోబర్ 2న థియేటర్లలోనే కాకుండా వివిధ ఓటీటీల్లో విభిన్న జోనర్లలో తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఓటీటీలో బెస్ట్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు

ఇందులో ఇవాళ ఓటీటీలో ది బెస్ట్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదలయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, హారర్ వంటి విభిన్న జోనర్లలో తప్పకుండా చూడాలనిపించే ఆ టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పూజా మేరీ జాన్ (Pooja Meri Jaan) - జీ5
మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన 'పూజా మేరీ జాన్' చిత్రం జీ5 (ZEE5) వేదికగా ఓటీటీ రిలీజ్ అయింది. 'సీతా రామం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్ నటించిన లీగల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
నవజోత్ గులాటీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. వన్ సైడ్ లవ్, వేధింపులు (స్టాకింగ్), విషపూరితమైన వ్యామోహం, ఆమోదం (కన్సెంట్) వంటి అంశాల చుట్టూ కోర్టు రూమ్ డ్రామాగా కథ సాగుతుంది.
బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) - జియోహాట్‌స్టార్
మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'బెత్లెహెం కుటుంబ యూనిట్' జియోహాట్‌స్టార్ (JioHotstar)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆష్లీ (మమితా బైజు) జీవితంలోకి పక్కింట్లో జరిగే ఒక పెళ్లి వేడుక ఎలాంటి మార్పు తెచ్చింది? తన తొలిప్రేమ జస్టిన్ (నివిన్ పౌలీ) జ్ఞాపకాలు మళ్లీ ఎలా చిగురించాయనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
{{/usCountry}}మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'బెత్లెహెం కుటుంబ యూనిట్' జియోహాట్‌స్టార్ (JioHotstar)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆష్లీ (మమితా బైజు) జీవితంలోకి పక్కింట్లో జరిగే ఒక పెళ్లి వేడుక ఎలాంటి మార్పు తెచ్చింది? తన తొలిప్రేమ జస్టిన్ (నివిన్ పౌలీ) జ్ఞాపకాలు మళ్లీ ఎలా చిగురించాయనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
{{/usCountry}}తెలుగులోనూ మంచి ఆదరణ ఉన్న నివిన్ పౌలీ, మమితా బైజు కాంబినేషన్ కావడంతో ఈ చిత్రం దక్షిణ భారత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జియోహాట్‌స్టార్‌లో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ రిలీజ్ అయింది.
#లవ్ (#Love) - నెట్‌ఫ్లిక్స్
కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ '#లవ్' నెట్‌ఫ్లిక్ లో అలరిస్తోంది. డేటింగ్ యాప్‌లైన 'ఫౌండ్', 'ఫైండ్ మై బే'లకు అధిపతులుగా ఉండే తారా (ఐశ్వర్య లక్ష్మి), మాథ్యూ (అర్జున్ దాస్) మధ్య సాగే వృత్తిపరమైన పోటీ, ఆధునిక సంబంధాలపై వారి అభిప్రాయాలను ఎలా సవాలు చేసిందనే నేపథ్యంలో ఈ సిరీస్ నడుస్తుంది.
నేటితరం ప్రేమ సంబంధాలను విశ్లేషిస్తూ బాలాజీ మోహన్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా దీనిని రూపొందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ వంటి 6 భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో #లవ్ స్ట్రీమింగ్ అవుతోంది.
డూయింగ్ లైఫ్ (Doing Life) - నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ రిలీజ్ అయిన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'డూయింగ్ లైఫ్' ఒక ఒంటరి తల్లి జీవన పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది. జైలు అధికారిణిగా పనిచేసే సమయంలో జరిగిన దాడుల నుంచి కాపాడిన ఒక మాజీ ఖైదీ కారౌసెల్ (జే రీవ్స్), అనిక (నెఓమి బేకర్) మధ్య ఏర్పడే వినూత్న బంధం ఈ సినిమా ఇతివృత్తం. ఇది కూడా తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.
ఈవిల్ డెడ్ బర్న్ (Evil Dead Burn) - జీ5
'ఈవిల్ డెడ్ బర్న్' హర్రర్ ప్రియులను భయపెట్టేందుకు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. సెబాస్టియన్ వానిచెక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో, కారు ప్రమాదంలో భర్త విల్ హఠాన్మరణం చెందిన తర్వాత అలిస్ అనే మహిళ తన అత్తవారింటికి వెళుతుంది.
అక్కడ తాతయ్య పరిశోధనలకు సంబంధించిన 'నెక్రోనామికన్' పుస్తకాన్ని యాదృచ్ఛికంగా తెరవడంతో రక్తపిశాచాలు విరుచుకుపడతాయి. భయంకరమైన ఈ విపత్తు నుంచి అలిస్ ఎలా ప్రాణాలు దక్కించుకుందనేది మిగతా కథ. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ నాలుగు భాషల్లో ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
వీకెండ్‌కు బెస్ట్
ఇలా ఇవాళ ఓటీటీ రిలీజైన ది బెస్ట్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఒక్క పూజా మేరీ జాన్ తప్పా మిగతా 4 తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ లాంగ్ వీకెండ్‌లో ఇటు థ్రిల్లర్లు, అటు రొమాంటిక్ వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఐదు చిత్రాలు, సిరీస్‌లు మంచి ఆప్షన్ అనుకోవచ్చు.