...
...
Next Story

OTT Trending: 2 ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న రఘు కుంచె క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్.. 50 మిలియన్ వాచ్ మినిట్స్‌తో!

Gedela Raju OTT Trending On 2 Platforms: సినిమా హాళ్లలో అలరించిన గేదెల రాజు చిత్రం ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచే ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన ఈ వైవిధ్యభరిత చిత్రం గేదెల రాజు ఓటీటీ స్ట్రీమింగ్, ట్రెండింగ్ వివరాలు చూద్దాం.

Published on: Aug 8, 2026, 15:08:40 IST
Advertisement

Gedela Raju OTT Trending On 2 Platforms: చిన్న సినిమాలకు సరైన కంటెంట్ ఉంటే థియేటర్లలోనే కాకుండా ఓటీటీ వేదికలపైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించి సంగీతం అందించిన చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలూకా అనేది క్యాప్షన్.

2 ఓటీటీల్లో స్ట్రీమింగ్

2 ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న రఘు కుంచె క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్.. 50 మిలియన్ వాచ్ మినిట్స్‌తో!
2 ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న రఘు కుంచె క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్.. 50 మిలియన్ వాచ్ మినిట్స్‌తో!

పొలిటికల్ క్రైమ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గేదెల రాజు సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన గేదెల రాజు సినిమా ఆ తర్వాత రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది గేదెల రాజు. అయితే, ఆ రెండిట్లో గేదెల రాజు ఓటీటీ ట్రెండింగ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో కట్టిపడేసిన కొత్త దర్శకుడు

మోటూరి క్రియేషన్స్ బ్యానర్‌పై రఘు కుంచె సమర్పణలో రూపుదిద్దుకున్న గేదెల రాజు చిత్రానికి నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. మొదటి సినిమానే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా నాన్-లీనియర్ (Non-linear) స్క్రీన్‌ప్లే విధానంలో కథను నడిపించిన తీరు సినీ ప్రియులను, విమర్శకులను అమితంగా ఆకట్టుకుంది.

సాధారణ కథలకు భిన్నంగా

"సాధారణ కథలకు భిన్నంగా నాన్-లీనియర్ పద్ధతిలో ఉత్కంఠభరితంగా కథనాన్ని తీర్చిదిద్దడం వల్లనే ఈ చిత్రం డిజిటల్ వేదికలపై ఇంతటి ప్రజాదరణ పొందుతోంది" అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆకట్టుకున్న నటన.. ప్రాణం పోసిన నేపథ్య సంగీతం

టైటిల్ రోల్ ‘గేదెల రాజు’ పాత్రలో రఘు కుంచే నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నటుడిగానే కాకుండా ఆయన అందించిన పాటలు, సన్నివేశాలకు ప్రాణం పోసిన నేపథ్య సంగీతం (Background Score) సినిమా స్థాయిని పెంచాయి.

సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (Aha) వేదికగా గేదెల రాజు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ రెండు ఓటీటీల్లో గేదెల రాజు ఊహించని రీతిలో వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

వ్యూస్‌లో దూకుడు.. ప్రేక్షకుల రీ-వాచ్ ట్రెండ్

సాధారణంగా డిజిటల్ మీడియాలో ఒక్కసారి చూసిన సినిమాలను మళ్లీ చూడటం చాలా అరుదు. అయితే 'గేదెల రాజు' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏకంగా 50 మిలియన్ వాచి మినిట్స్‌తో ట్రెండింగ్ అవుతోంది. దీంతో ప్రైమ్ ఓటీటీలో అత్యధికంగా రీ-వాచ్ (Re-watch) అవుతున్న చిత్రాల జాబితాలో చేరి విశేష ఆదరణ సొంతం చేసుకుంది ఈ గేదెల రాజు సినిమా.

ఓటీటీ ట్రెండింగ్‌లో గేదెల రాజు

మరోవైపు ప్రాంతీయ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'ఆహా'లోనూ టాప్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల వరుసలో నిలిచి దూసుకుపోతోంది. కథలో ఉన్న విలక్షణత, కట్టిపడేసే కథనం వల్లనే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe