ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతి వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ తెలుగులో డిఫరెంట్ జోనర్స్‌తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతోంది.
తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్

ఇందులో భాగంగానే ఇవాళ (డిసెంబర్ 07) ఓ టాలీవుడ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే ఘటన. తెలుగులో ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ ఘటన మూవీ తెరకెక్కింది. ఇది కేవలం మూడు పాత్రల చుట్టూ సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.
ఘటన సినిమాలో రావణ్ రెడ్డి నిట్టూరు, చాందిని రావు, శ్రీనివాస్ గడ్డం ప్రధాన పాత్రలు పోషించారు. రావణ్, చాందిని రావు లవర్స్‌గా చేయగా.. చాందినికి శ్రీనివాస్ తండ్రి పాత్ర పోషించారు. రిషికేష్వర్ యోగి సమర్పించిన ఘటన సినిమాకు కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించారు. అలాగే, స్క్రీన్ ప్లే కూడా అందించారు.
ఘటన టెక్నిషియన్స్
ఘటన సినిమాకు కథ, డైలాగ్స్‌ను అనుదీప్ పోటునుక రాశారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు కొత్తపల్లి సురేష్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ధ్రువ్ చిత్రన్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిరంజన్ దాస్ చేపట్టారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే సంగీతాన్ని ఈ మూవీకి ప్రజ్వల్ క్రిష్ అందించారు.
ఇలాంటి టెక్నిషియన్స్‌తో తెరకెక్కిన ఘటన ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఘటన ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం 24 నిమిషాల 16 సెకన్ల అతి తక్కువ రన్‌టైమ్‌తో నేటి నుంచి ఈటీవీ విన్‌లో ఘటన ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అప్పుల్లో కూరుకుపోయిన జంట
ఘటన సినిమాలో రావణ్, చాందిని అప్పుల్లో కూరుకుపోతారు. బ్యాంక్ వాళ్లు చాలా గొడవ చేసి వార్నింగ్ ఇవ్వడంతో ఎలాగైనా అందులో నుంచి బయటపడాలనుకుంటారు. అందుకు చాందిని తండ్రిని చంపేస్తే అతన నుంచి ఆస్తి వస్తుందని రావణ్ ప్లాన్ ఇస్తాడు. ముందు వద్దని వారించిన చాందిని తర్వాత ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేందుకు ఒప్పుకుంటుంది.
{{/usCountry}}ఘటన సినిమాలో రావణ్, చాందిని అప్పుల్లో కూరుకుపోతారు. బ్యాంక్ వాళ్లు చాలా గొడవ చేసి వార్నింగ్ ఇవ్వడంతో ఎలాగైనా అందులో నుంచి బయటపడాలనుకుంటారు. అందుకు చాందిని తండ్రిని చంపేస్తే అతన నుంచి ఆస్తి వస్తుందని రావణ్ ప్లాన్ ఇస్తాడు. ముందు వద్దని వారించిన చాందిని తర్వాత ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేందుకు ఒప్పుకుంటుంది.
{{/usCountry}}కాఫీలో తండ్రికి విషం పెట్టి చంపుతుంది చాందిని. ఆ తర్వాత ఏమైంది? అత్యవసర పరిస్థితులు మనుషులతో ఎలాంటి పనులు చేయిస్తాయి?, రావణ్‌కు ఏం జరిగింది? ప్రియుడికి తెలియకుండా చాందిని ఏం ప్లాన్ వేసింది? వంటి ఇంట్రెస్టింగ్ అంశాలు తెలియాలంటే ఈ ఘటన చూడాల్సిందే.
ఈటీవీ విన్ ఓటీటీలో
బంధాలు, డబ్బు, మానవ సంబంధాలు, విచక్షణ వంటి అంశాలతో ఘటన తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఘటన సినిమా ఈటీవీ విన్ కథా సుధా ఓటీటీ వీక్లీ సిరీస్‌లో భాగంగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రతివారం కథా సుధా నుంచి సినిమా వస్తున్నట్లుగానే ఇవాళ ఘటన ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అంతేకాకుండా ఇదే కథా సుధాలో ఫోర్ టేల్స్‌లో భాగంగా ఘటన ఓటీటీ రిలీజ్ అయింది. నిజానికి ఈ ఘటన రెండు, మూడు వారాల ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కావాల్సింది. ఘటనకు బదులు మరికొన్ని సినిమాలు ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. తాజాగా ఘటన ఓటీటీలోకి వచ్చేసింది.