తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ వెండితెరకు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి జన నాయగన్ ట్రైలర్‌ను శనివారం (జనవరి 3) విడుదల చేశారు మేకర్స్.

శనివారం విడుదలైన జన నాయగన్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అయితే, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌లో ఒక చిన్న ‘ఏఐ’ (AI) పొరపాటు దొర్లడం ఇప్పుడు చిత్ర యూనిట్‌ను ఇరకాటంలో పడేసింది.
ఏం జరిగిందంటే?
జన నాయగన్ ట్రైలర్ ఆరంభంలో ఒక వ్యక్తి షాట్‌గన్‌ను లోడ్ చేస్తున్న సీన్ వస్తుంది. సరిగ్గా ఆ సీన్ తర్వాత వచ్చే కొన్ని క్షణాల విజువల్‌లో గూగుల్‌కు చెందిన ఏఐ టూల్ ‘జెమిని’ (Gemini) లోగో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జెమినీ ఏఐ వాటర్‌మార్క్‌ను తొలగించడం కూడా ఎడిటర్ మర్చిపోయారా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ట్విట్టర్ (X) లో దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్‌లు వైరల్ కావడంతో జన నాయగన్ మూవీ టీం అప్రమత్తమైంది. ఆదివారం (జనవరి 4) ఉదయం నాటికి జన నాయగన్ ట్రైలర్ నుంచి ఆ లోగో ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వందల కోట్ల బడ్జెట్.. మరీ ఇంత నిర్లక్ష్యమా?
"సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమాలో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఏంటి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో ఏఐ వాడటం కళాత్మకతను అవమానించడమేనని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}"సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమాలో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఏంటి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో ఏఐ వాడటం కళాత్మకతను అవమానించడమేనని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}"ఒక రీమేక్ సినిమాకు కూడా ఏఐ వాడాలా?" అని మరొకరు సెటైర్లు వేయగా, "ఇది విజయ్ గారి ఆఖరి సినిమా.. కనీసం ఎడిటింగ్‌లోనైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా" అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలిటికల్ యాక్షన్ డ్రామా
కాగా, తమిళ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన జన నాయగన్ సినిమా తెలుగులో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ అన్నీ కూడా భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని చెప్పేలా ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ జోరుగా నడుస్తోంది.
ఇకపోతే జన నాయగన్ సినిమాలో విజయ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. హీరోయిన్స్ పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం జన నాయగన్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
దళపతి విజయ్ తన సొంత పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను స్థాపించి 2026 ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా అభివర్ణిస్తున్నారు.
ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఏదేమైనా, జన నాయగన్ ఏఐ వివాదం సినిమాపై హైప్‌ను పెంచుతుందో లేక డ్యామేజ్ చేస్తుందో చూడాలి.