భారతీయ న్యాయ చరిత్రలో మైలురాయిగా నిలిచిన 'షా బానో' రియల్ లైఫ్ కేసు ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘హక్’ (Haq). సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.
తెలుగు సినిమా హీరోయిన్

థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హక్ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో హక్ ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన యామీ గౌతమ్, ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమే హక్.
హక్ కథా నేపథ్యం
హక్ సినిమా కథ షాజియా (యమీ గౌతమ్ ధర్) అనే ఒక సాధారణ గృహిణి చుట్టూ తిరుగుతుంది. చదువుకోకపోయినా సంప్రదాయాలకు కట్టుబడి ఉండే షాజియా.. విజయవంతమైన న్యాయవాది అబ్బాస్ ఖాన్ (ఇమ్రాన్ హష్మీ)ను వివాహం చేసుకుంటుంది.
భరణం, ఆత్మగౌరవం కోసం
కానీ, ఉన్నట్టుండి అబ్బాస్ రెండో పెళ్లి చేసుకోవడం, ఆపై ఆమెకు 'ట్రిపుల్ తలాక్' చెప్పడంతో షాజియా ప్రపంచం తలకిందులవుతుంది. తన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, భరణం కోసం ఒక సామాన్య మహిళ దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేసిన పోరాటమే ఈ ‘హక్’.
నటీనటుల ప్రతిభ
షాజియా పాత్రలో యమీ గౌతమ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకులు కొనియాడారు. భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించే ఆవేదన, నిశ్శబ్దం ప్రేక్షకులను కదిలిస్తాయి.
నేటి సమాజానికి అవసరమైన
ఇమ్రాన్ హష్మీ తన పాత్రలోని స్వార్థాన్ని, గంభీరతను ఎంతో నిజాయితీగా పండించారు. 1985లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమైన సందేశాన్ని అందించేలా డైరెక్టర్ తీర్చిదిద్దారు.
హక్ రేటింగ్
{{/usCountry}}ఇమ్రాన్ హష్మీ తన పాత్రలోని స్వార్థాన్ని, గంభీరతను ఎంతో నిజాయితీగా పండించారు. 1985లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమైన సందేశాన్ని అందించేలా డైరెక్టర్ తీర్చిదిద్దారు.
హక్ రేటింగ్
{{/usCountry}}గతేడాది నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన హక్ మూవీ ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.6 రేటింగ్ కూడా దక్కించుకుంది. ఇలాంటి హక్ ఓటీటీలోకి వచ్చేయనుంది.
హక్ ఓటీటీ రిలీజ్
నెట్‌ఫ్లిక్స్‌లో హక్ ఓటీటీ రిలీజ్ కానుంది. జనవరి 2 అర్థరాత్రి నుంచే హక్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించింది.
నెట్‌ఫ్లిక్స్ పోస్ట్
"ఇంటి నాలుగు గోడల నుంచి న్యాయస్థానం వరకు.. ఈ ప్రయాణం నిస్సహాయతది కాదు, ఆత్మవిశ్వాసానిది" అంటూ హక్ సినిమా పోస్టర్‌ను పంచుకుంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్.