Srikanth About Objection My Lord OTT Release: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఎన్నో సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. హీరో తర్వాత నటుడిగా, విలన్‌గా కూడా మెప్పించారు. అలాంటి హీరో శ్రీకాంత్ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు.
శ్రీకాంత్ ఓటీటీ సిరీస్

హీరో శ్రీకాంత్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్. ‘నోటరీ పరశురాం’ అనేది ట్యాగ్ లైన్. వినూత్నమైన కంటెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ అందరి హృదయాల్లో తనదైన స్ధానాన్ని దక్కించుకున్న మోస్ట్ పాపులర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 ఈ ఒరిజినల్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
7 ఎపిసోడ్స్‌తో అబ్జెక్షన్ మై లార్డ్
శ్రీకాంత్‌తోపాటు అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల రూపొందించారు. మొత్తం 7 ఎపిసోడ్స్‌తో ఎమోషనల్ కోర్ట్ రూమ్ లీగల్ డ్రామాగా రూపొందింది.
అబ్జెక్షన్ మై లార్డ్ ఓటీటీ రిలీజ్
జూలై 31 అర్థరాత్రి జీ5లో అబ్జెక్షన్ మై లార్డ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అబ్జెక్షన్ మై లార్డ్ ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఇటీవల ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు హీరో శ్రీకాంత్, పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు.
చిన్నప్పుడు శ్రీకాంత్ సినిమాలు చూసేవాడిని
ఈ సందర్భంగా ఎడిటర్ కిషోర్ మాట్లాడుతూ.. "నా చిన్నప్పుడు శ్రీకాంత్ సినిమాలు చాలా చూసే వాడిని. ఈ సినిమా చాలా సీరియస్ డ్రామా. ఈ నెలలోనే స్టార్ట్ చేసి ఈ నెలలోనే రిలీజ్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్. టీం అంతా చాలా కష్టపడి పని చేశారు" అని అన్నారు.
మూడింటిలో డిఫరెంట్ రోల్స్
{{/usCountry}}ఈ సందర్భంగా ఎడిటర్ కిషోర్ మాట్లాడుతూ.. "నా చిన్నప్పుడు శ్రీకాంత్ సినిమాలు చాలా చూసే వాడిని. ఈ సినిమా చాలా సీరియస్ డ్రామా. ఈ నెలలోనే స్టార్ట్ చేసి ఈ నెలలోనే రిలీజ్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్. టీం అంతా చాలా కష్టపడి పని చేశారు" అని అన్నారు.
మూడింటిలో డిఫరెంట్ రోల్స్
{{/usCountry}}హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. జీ5 ఓటీటీలో నాది ఇది మూడో వెబ్ సిరీస్. ఈ మూడింటిలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడమే చేశారు. జీతో నాకు మంచి అనుబంధం ఉంది. 3 సిరీస్‌లు చేయడంతో పాటు డ్రామా జూనియర్స్ కూడా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.
మంచి క్యారెక్టర్ దొరికింది
"సినిమాలో కంటే సిరీస్‌లోనే కష్టం ఎక్కువగా ఉంది. కానీ, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాము. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ దొరికింది. దర్శకుడు ఎంతో మెలకువతో చాలా క్లారిటీతో ఈ ఓటీటీ సిరీస్ రూపొందించారు. షూటింగ్ సమయంలో నిర్మాత రాజ్‌కుమార్ చాలా సపోర్ట్ చేశారు" అని నటుడు శ్రీకాంత్ చెప్పారు.
మంచి ఎలివేషన్ ఉంటుంది
"ఈ సిరీస్ అవుట్‌పుట్ చూశాక ఫిదా అయ్యాము. మంచి అవుట్‌పుట్ వచ్చింది. నటీనటులంతా ఎంతో ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొన్నారు. ముఖేష్ గారు యాక్టర్ మాత్రమే కాదు ప్యూర్ హార్ట్ మనిషి. ప్రతి క్యారెక్టర్‌లో మంచి ఎలివేషన్ ఉంటుంది. అందరూ బాగా చేశారు. చిరంజీవి గారు కూడా చూసి చాలా బాగుందని చెప్పారు. థాంక్యూ ఆల్" అని తన స్పీచ్ ముగించారు హీరో శ్రీకాంత్.
ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠంగా మలిచారు
యాక్టర్ నారాయణ హరిచంద్ర మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌లో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. శ్రీకాంత్ పక్కన నటించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ సినిమా దర్శకులు ఎంతో కష్టపడి ఈ సిరీస్‌లోని ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠగా మలిచారు. ఈ సిరీస్ మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా" అని ఆశాభావం వ్యక్తం చేశారు యాక్టర్ నారాయణ హరిచంద్ర.