Srikanth OTT Entry With Objection My Lord Streaming Date: తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటీటీ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. వెండితెరపై అలరించిన స్టార్ హీరోలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల యువ హీరో సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు' సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
నాగ చైతన్య ధూత సంచలనం

అలాగే, అక్కినేని నాగ చైతన్య నటించిన ధూత ఓటీటీ సిరీస్ ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సిరీస్ సీక్వెల్ కూడా లైన్‌లో ఉంది. ఈ డిజిటల్ హవాలో తానేమీ వెనకబడలేదని నిరూపిస్తూ సీనియర్ హీరో మేకా శ్రీకాంత్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశారు.
శ్రీకాంత్ ఓటీటీ ఎంట్రీ
సరికొత్త కోర్టు రూమ్ డ్రామా సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీకి రెడీ అయ్యారు హీరో శ్రీకాంత్. లాయర్‌గా శ్రీకాంత్ పవర్‌ఫుల్ పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పేరు 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord). ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 వేదికగా జులై 31 నుంచి ఈ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
లాయర్ పరశురామ్‌గా శ్రీకాంత్.. కటకటాల వెనుక మంటలు
ఈ సందర్భంగా విడుదల చేసిన అబ్జెక్షన్ మై లార్డ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది. ఈ సిరీస్‌లో శ్రీకాంత్ 'పరశురామ్' అనే లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కథలోని తీవ్రతను ప్రతిబింబిస్తోంది. కోర్టు బోనులో ఉన్న ఒక వ్యక్తి చుట్టూ మంటలు అంటుకుంటున్నట్లుగా ఉన్న విజువల్స్ సస్పెన్స్‌ను రేకెత్తిస్తున్నాయి.
న్యాయ వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించేలా?
'ప్రతీ అభ్యంతరమూ వ్యవస్థను సవాల్ చేస్తుంది.. ప్రతీ గొంతుకూ వినబడే అర్హత ఉంది' అని పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఓటీటీ సిరీస్ థీమ్‌ను స్పష్టం చేస్తోంది. సమాజంలోని లోపాలను, న్యాయ వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించేలా ఈ సిరీస్ సాగనుందని చిత్ర బృందం హింట్ ఇచ్చింది.
భారీ తారాగణం.. సీనియర్ నటుల సందడి
{{/usCountry}}'ప్రతీ అభ్యంతరమూ వ్యవస్థను సవాల్ చేస్తుంది.. ప్రతీ గొంతుకూ వినబడే అర్హత ఉంది' అని పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఓటీటీ సిరీస్ థీమ్‌ను స్పష్టం చేస్తోంది. సమాజంలోని లోపాలను, న్యాయ వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించేలా ఈ సిరీస్ సాగనుందని చిత్ర బృందం హింట్ ఇచ్చింది.
భారీ తారాగణం.. సీనియర్ నటుల సందడి
{{/usCountry}}ఈ కోర్టు రూమ్ డ్రామా థ్రిల్లర్‌లో శ్రీకాంత్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సీనియర్ నటి మధుబాల, విలక్షణ నటుడు ముఖేష్ రిషి, సుమన్, షఫీ, అనన్య శర్మ, సిజ్జు మీనన్ లాంటి భారీ తారాగణం ఈ సిరీస్‌లో భాగమయ్యారు.
ముఖేష్ జి దర్శకత్వంలో
ఇంతమంది సీనియర్ నటులు ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో సీన్ల మధ్య డ్రామా పీక్స్‌లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రేజీ వెబ్ సిరీస్‌ను దర్శకుడు ముఖేష్ జి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
జీ5 ఓటీటీలో రిలీజ్
థియేటర్లలో కోర్టు రూమ్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. మరి జీ5లో ఓటీటీ రిలీజ్ అవనున్న ఈ లీగల్ థ్రిల్లర్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.