Hushar Pittalu OTT Release Details: యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసే జొనర్లలో రొమాంటిక్ ఒకటి. అలాంటి రొమాంటిక్ జోనర్‌కు కాస్తా బోల్డ్, కామెడీ ఎలిమెంట్స్, ఎమోషన్స్ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమానే హుషార్ పిట్టలు. యువతరం ఆలోచనలు, నేటితరం సంబంధాల్లో వచ్చే హెచ్చుతగ్గులతో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్.
బిక్షు యాదవ్ దర్శకత్వం

హుషార్ పిట్టలు సినిమాలో వాసవి గణేశన్, అన్ష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌కు భిక్షు యాదవ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హుషార్ పిట్టలు చిత్రం ప్రమోషనల్ కంటెంట్, పాటలతోనే యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ముఖ్యంగా హుషార్ పిట్టలు టీజర్‌లోని బోల్డ్ సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు చరణ్ అర్జున్ అందించగా.. సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడం విశేషం.
థియేట్రికల్ రన్, అడ్వాన్స్ బుకింగ్స్ హవా
ప్రముఖ నిర్మాణం, పంపిణీ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసింది. పీవీఆర్, మిరాజ్ సినిమాస్‌తో పాటు ప్రముఖ సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. బుక్‌మైషో, జస్ట్‌టికెట్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో టికెట్ల బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
కేవలం యూత్‌కి పరిమితం కాకుండా, తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సందేశం ఈ కథలో ఉండటం విశేషం. అలాంటి హుషార్ పిట్టలు ఓటీటీ వివరాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. హుషార్ పిట్టలు ఓటీటీ రైట్స్ కొనుగోలుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఈటీవీ విన్, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్ రేసులో ఉన్నాయి.
హుషార్ పిట్టలు ఓటీటీ స్ట్రీమింగ్
అయితే, ఈ పోటీని దాటి హుషార్ పిట్టలు ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి ధరకు సొంతం చేసుకున్నట్లు ఓ టాక్ నడుస్తోంది. ఈ లెక్కన అమెజాన్ ప్రైమ్‌లోనే హుషార్ పిట్టలు ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, సాధారణంగా ఏ చిన్న లేదా పెద్ద సినిమాలైనా థియేటర్లలో విడుదలైన తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తాయి.
{{/usCountry}}అయితే, ఈ పోటీని దాటి హుషార్ పిట్టలు ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి ధరకు సొంతం చేసుకున్నట్లు ఓ టాక్ నడుస్తోంది. ఈ లెక్కన అమెజాన్ ప్రైమ్‌లోనే హుషార్ పిట్టలు ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, సాధారణంగా ఏ చిన్న లేదా పెద్ద సినిమాలైనా థియేటర్లలో విడుదలైన తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తాయి.
{{/usCountry}}కొన్ని సార్లు, నెల, 20 రోజుల్లోపే కొత్త సినిమాలు ఓటీటీ బాట పడతాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో హుషార్ పిట్టలు ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమచారాం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
హుషార్ పిట్టలు కథ ఏంటంటే:
పదో తరగతిలో రవి (అన్ష్) స్కూల్ ఫస్ట్. చదువు తప్ప మరో ధ్యాస లేని రవిని బాలు గ్యాంగ్ పోర్న్ వీడియోలు చూపించి చెడగొడుతుంది. అప్పటి నుంచి చదువు గాలికొదిలేసి అమ్మాయిలను పడేసే పనిలో ఉంటాడు రవి. ఓ రోజు చిట్టి (వాసవి గణేశన్)ని ఇష్టపడతాడు రవి. అప్పటికే రవిపై అట్రాక్షన్ ఉన్న చిట్టి కూడా ప్రేమిస్తుంది.
ఏజ్‌లో వచ్చే ఫీలింగ్స్ వల్ల ఇద్దరు శారీరకంగా దగ్గరవుతారు. అలా ఓ రోజు ఇంటిమేట్ అవుతున్న సమయంలో తల్లిదండ్రులకు దొరికిపోతారు. ఆ తర్వాత ఏమైంది? వారి తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? దానివల్ల రవి, చిట్టికి జీవితంలో వచ్చిన పరిణామాలు ఏంటీ?, సమాజం నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? రవి, చిట్టి చివరికి ఒక్కటయ్యారా? అనేదే మిగతా కథ.
ఓటీటీలో కంటే ముందుగా
బోల్డ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక, మెసేజ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన హుషార్ పిట్టలు ఓటీటీలోకి వచ్చేవరకు ఎదురుచూడకుండా బిగ్ స్క్రీన్‌పై థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించాలనుకునే వారు ప్రస్తుతం థియేటర్లకు వెళ్లి చూడటం ఉత్తమం.