Janhvi Kapoor Reacts To Chuttamalle Morphed: సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న తీరుపై బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఒకరకమైన లైంగిక దాడి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ చిత్రంలోని పాపులర్ ‘చుట్టమల్లె’ సాంగ్ విజువల్స్‌ను ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జాన్వీ కపూర్ ఇది కేవలం సాంకేతిక దుర్వినియోగం మాత్రమే కాదని, ఒక రకమైన లైంగిక దాడితో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు.
సాంకేతికత పేరిట విచక్షణారహిత దాడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించిన తర్వాత సినీ తారలే కాకుండా సామాన్య మహిళలు సైతం డీప్‌ఫేక్ మోసాల బారిన పడుతున్నారు. ఈ అంశంపై జాన్వీ కపూర్ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు.
"మహిళలను కేవలం భోగవస్తువుగా చూపుతూ, వారి అనుమతి లేకుండా ఇటువంటి కల్పిత దృశ్యాలను సృష్టించడం నేరం. ఇది నైతిక విలువలకే కాకుండా ఆత్మగౌరవానికి తగిలిన పెద్ద దెబ్బ. చలనచిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ ఏదో ఒక సమయంలో ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటూనే ఉంది" అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరో రోజు వద్దంటే గౌరవించాలి
సమ్మతి, స్వయంప్రతిపత్తి గురించిన ప్రాథమిక అంశాలను ప్రస్తావిస్తూ.. "ఒక మహిళ ఐదు రోజులు ఒక విషయానికి అంగీకరించి, ఆరో రోజు వద్దంటే ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. మహిళ పొట్టి దుస్తులు వేసుకున్నంత మాత్రాన విపరీతమైన కోణాల్లో కెమెరాలు పెట్టి చిత్రీకరించే హక్కు ఎవరికీ లేదు. తన శరీరంపై, తన సరిహద్దులపై పూర్తి నిర్ణయాధికారం ఆ మహిళకే ఉంటుంది" అని స్పష్టం చేశారు.
డిజిటల్ ప్రపంచంలోనూ భద్రత కరువు
{{/usCountry}}సమ్మతి, స్వయంప్రతిపత్తి గురించిన ప్రాథమిక అంశాలను ప్రస్తావిస్తూ.. "ఒక మహిళ ఐదు రోజులు ఒక విషయానికి అంగీకరించి, ఆరో రోజు వద్దంటే ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. మహిళ పొట్టి దుస్తులు వేసుకున్నంత మాత్రాన విపరీతమైన కోణాల్లో కెమెరాలు పెట్టి చిత్రీకరించే హక్కు ఎవరికీ లేదు. తన శరీరంపై, తన సరిహద్దులపై పూర్తి నిర్ణయాధికారం ఆ మహిళకే ఉంటుంది" అని స్పష్టం చేశారు.
డిజిటల్ ప్రపంచంలోనూ భద్రత కరువు
{{/usCountry}}ఈ సమస్య కేవలం తనకు ఎదురైన ఒక్క సంఘటనకే పరిమితం కాదని, మహిళగా సమాజంలో ఎదుర్కొంటున్న భయానక వాతావరణానికి ప్రతిరూపమని జాన్వీ అభిప్రాయపడ్డారు. భౌతిక ప్రపంచంలోనే మహిళలకు పూర్తి స్థాయి రక్షణ లభించని పరిస్థితుల్లో, ఇప్పుడు డిజిటల్ రూపంలో కొత్త తరహా బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఈ వేధింపుల ఘటనలో తనకు మద్దతుగా నిలిచిన టాలీవుడ్ దిగ్గజాలకు జాన్వీ కపూర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "ఇలాంటి విపరీత ధోరణిపై గళమెత్తి, ఖండించినందుకు ఎన్టీఆర్ సర్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కోట్లాది మంది అభిమానించే ఒక నాయకుడు తనకు నేరుగా సంబంధం లేని అంశంపై స్పందించినప్పుడు, బాధితులకు కొండంత అండ లభిస్తుంది" అని కొనియాడారు.
ఎన్టీఆర్, చిరు, విజయ్, ఖుష్బూ కామెంట్స్‌పై
సీనియర్ నటుడు చిరంజీవి, విజయ్ దేవరకొండ, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఈ పోరాటానికి అండగా నిలవడంపై కితాబిచ్చారు జాన్వీ కపూర్. "మన చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు వేధింపులకు పాల్పడే వారిలో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఒక మహిళను మనిషిగా చూడాలని కోరుకోవడం అత్యాశ అవుతుందా? ఆమె శరీరం, ఆమె చిత్రం, ఆమె సరిహద్దులు, ఆమె ఎంపిక.. ఇవే ప్రాథమిక సూత్రాలు" అంటూ జాన్వీ తన సందేశాన్ని ముగించారు.
అణిచివేతపై ఆలోచించాల్సిన సమయం
ఇదిలా ఉంటే, 2024 సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన 'దేవర: పార్ట్ 1' చిత్రంలో అనిరుధ్ రవిచందర్ స్వరపరిచి, శిల్పా రావు పాడిన 'చుట్టమల్లె' పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఈ పాటలోని జాన్వీ దృశ్యాలను ఏఐ సాంకేతికతతో అశ్లీలంగా మార్చడం తీవ్ర నిరసనలకు దారితీసింది.
ఆర్జీవీ ట్వీట్
ప్రస్తుతం సదరు వీడియోను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించినప్పటికీ, సైబర్ నేరగాళ్ల తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. మరోవైపు చుట్టమల్లే పాటను అశ్లీలంగా మలచడంపై తారక్ ఇతర సెలబ్రిటీలు స్పందించి ఆ వీడియోను పబ్లిసిటీ చేయడం కూడా నేరమే అంటూ ఆర్జీవీ తన స్టైల్‌లో ట్వీట్ పెట్టారు.