ఓటీటీ ఆడియెన్స్‌కు ఎక్కువగా ఇష్టమైన జోనర్లలో ముందు వరుసలో ఉంంటుంది హారర్ థ్రిల్లర్. ఈ జోనర్స్‌కు విభిన్న ఎలిమెంట్స్ యాడ్ చేసి మరి డిఫరెంట్‌గా సినిమాలను రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా ఇటీవల వచ్చి మంచి హిట్ అందుకున్న ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీనే జరణ్.
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ కథాంశంతో మతిపోగొట్టే ట్విస్టులతో జరణ్ సినిమాను తెరకెక్కించారు. మరాఠీలో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జరణ్ జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న జరణ్ ఆగస్ట్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ ట్రెండింగ్‌లో
అయితే, కేవలం మరాఠీ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రమే జరణ్ ఓటీటీ రిలీజ్ అయింది. అయినా కూడా ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్‌లో దూసుకుపోయింది జరణ్ సినిమా. అలా ట్రెండింగ్‌లో ఉంటూ ఓటీటీలో సూపర్ హిట్ అయిన జరణ్ ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు భాషలో జరణ్ ఓటీటీ రిలీజ్ అయింది.
జరణ్ ఓటీటీ స్ట్రీమింగ్
నవంబర్ 7 నుంచి అంటే నిన్నటి నుంచి తెలుగులో జరణ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో జరణ్ ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం జీ5లో తెలుగు, మరాఠీ భాషల్లో జరణ్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. ఈ విషయాన్ని తాజాగా జీ5 అధికారికంగా ప్రకటించింది.
కిష్కింధపురి ఓటీటీ తర్వాత
ఇటీవల అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి వంటి హారర్ థ్రిల్లర్‌తో వినోదం పంచిన జీ5 ఇప్పుడు జరణ్తో మరోసారి ఎంటర్టైన్ చేయనుంది. ఇకపోతే జరణ్ సినిమాకు హృషికేష్ గుప్త కథ, దర్శకత్వం అందించారు.
జరణ్ నటీనటులు
{{/usCountry}}ఇటీవల అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి వంటి హారర్ థ్రిల్లర్‌తో వినోదం పంచిన జీ5 ఇప్పుడు జరణ్తో మరోసారి ఎంటర్టైన్ చేయనుంది. ఇకపోతే జరణ్ సినిమాకు హృషికేష్ గుప్త కథ, దర్శకత్వం అందించారు.
జరణ్ నటీనటులు
{{/usCountry}}అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఎ అండ్ ఎన్ సినిమాస్ ఎల్‌ఎల్పీ, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా సర్వీసెస్ ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో పాపులర్ నటి అమృతా సుభాష్, అనితా డేట్ కెల్కర్, కిశోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోష్ కీలక పాత్రలు పోషించారు.
జరణ్ మూవీ కథ
జరణ్ కథలోకి వెళితే.. రాధ (అమృత సుభాష్), తన కుమార్తె సయీ (అవనీ జోషి)తో కలిసి తన పూర్వీకుల ఇంటికి వెళ్తుంది. ఓ పాత బొమ్మ దొరికిన తర్వాత తనకు చిన్నతనంలో ఎదురైన వింత అనుభవాలను గుర్తు చేసుకుంటుంది.
రాధలో వింత మార్పు
ఆ తర్వాత అక్కడ పరిస్థితి అంతా మారిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? అనే సంఘటనలను వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీతో జరణ్ సినిమాను తెరకెక్కించారు డైరక్టర్. రాధలో నిగూఢంగా దాగి ఉన్న భయాలన్నీ ఒక్కసారిగా పురివిప్పడం, ఆమె ప్రవర్తనలో వింత మార్పు కనిపించడం వంటివి జరుగుతాయి.
జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్
వాస్తవానికి, ఇల్యూజన్‌కి మధ్య ఉన్న గీత చెరిగిపోవడం, అప్పటి నుంచి ట్రామా, మెమరీ, సూపర్‌నేచురల్ ఇంటర్వైన్ కలగలిపి కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు ప్రతి క్షణం థ్రిల్‌ని పంచుతాయని జరణ్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ జీ5 చెబుతోంది.