Jathi Rathanam OTT Release Today: ఇటీవల కాలంలో తెలుగు కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ఎక్కువగానే వస్తున్నాయి. అందులోనూ ప్రతి ఆదివారం సరికొత్త కంటెంట్‌తో తెలుగు ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ (జూలై 26) ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఒకటి రిలీజ్ అయింది.
అత్తగా హీరోయిన్ రాశి

ఆ సినిమా పేరే 'జాతి రత్నం'. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస విజయాలతో అలరించిన నటి రాశి, ప్రతిభావంతుడైన నటుడు శశాంక్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో హీరోయిన్ రాశి అత్తగా చేస్తే.. జాతకాలు పిచ్చి అల్లుడుగా శశాంక్ యాక్ట్ చేశాడు.
అదృష్టం వెంటపడే మనిషి జీవితం
జాతకాలు, మూఢనమ్మకాలు, అదృష్టం వెంటపడే ఒక మనిషి జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. కథానాయకుడు విక్రమ్ తన జీవితాన్ని నక్షత్రాలు, రాశిఫలాలు, దురదృష్టం అనే భయాల చుట్టూ బంధించేసుకుంటాడు.
ప్రతీ చిన్న విషయానికీ అదృష్టాన్నే నమ్ముకునే అతని ప్రవర్తన, ఇంట్లో తీవ్ర వివాదాలకు దారితీస్తుంది. కూతురుని ఇచ్చి అత్తకు తంటాలు తీసుకొస్తుంది. పెళ్లయిన మూడేళ్లకు కూడా బిడ్డకు జన్మనివ్వలేదని, జాతకాలు, నమ్మకాలను పట్టుకుని కూర్చుంటే ఎలా అని కూతురుతో తల్లి రాశి మొరపెట్టుకుంటుంది.
ముహుర్తం కోసం
రోజులు గడిచిన తర్వాత కూతురు గర్భవతి అవుతుంది. దాంతో విక్రమ్ తన జీవితంలో అమితమైన సంతోషాన్ని పొందుతాడు. కానీ, ఓ రోజు అనుకోకుండా విక్రమ్ భార్య ఇంట్లోనే ప్రమాదానికి గురి అవుతుంది. త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, విక్రమ్ మాత్రం అదంతా పట్టించుకోకుండా మంచి ముహుర్తం ఉన్న టైమ్ కోసం ఎదురుచూస్తుంటాడు.
ఆకట్టుకునే సస్పెన్స్..
మరి విక్రమ్ తన భార్యను, బిడ్డను కాపాడుకున్నాడా? జీవితం చావుబతుకుల మధ్య నిలిచినప్పుడు విక్రమ్ తన అంతర్గత భయాలను ఎలా ఎదుర్కొన్నాడు? తన మూఢనమ్మకాల వల్ల చేతికి వచ్చిన అద్భుతాన్ని కోల్పోయాడా లేక తప్పు తెలుసుకుని నిజాన్ని గ్రహించాడా అనేదే ఈ చిత్ర అసలు కథ.
{{/usCountry}}మరి విక్రమ్ తన భార్యను, బిడ్డను కాపాడుకున్నాడా? జీవితం చావుబతుకుల మధ్య నిలిచినప్పుడు విక్రమ్ తన అంతర్గత భయాలను ఎలా ఎదుర్కొన్నాడు? తన మూఢనమ్మకాల వల్ల చేతికి వచ్చిన అద్భుతాన్ని కోల్పోయాడా లేక తప్పు తెలుసుకుని నిజాన్ని గ్రహించాడా అనేదే ఈ చిత్ర అసలు కథ.
{{/usCountry}}విక్రమ్‌గా శశాంక్, అతని అత్తగా రాశి పోటీపడి నటించారు. 'సై', 'అనుకోకుండా ఒక రోజు' వంటి సినిమాలతో మెప్పించిన శశాంక్, సుదీర్ఘ విరామం తర్వాత ఈ తరహా విభిన్నమైన పాత్రలో కనిపించడం జాతిరత్నం సినిమాకు ఇంట్రెస్టింగ్ విషయం.
అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు
ఈ 'జాతి రత్నం' చిత్రానికి వర ముళ్లపూడి దర్శకత్వం వహించారు. ఆసమ్ శ్రీనివాస్ అందించిన కథను తెరపై ఎంతో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. 24 సినిమా స్ట్రీట్ పతాకంపై అనుపమ చంద్ర కొడూరి, శరత్ చంద్రరెడ్డి గుర్రాల ఈ చిత్రాన్ని నిర్మించారు.
మురళీ మోహన్ చేగు కెమెరా బాధ్యతలు నిర్వహించగా, సాయి మధుకర్ చక్కని సంగీతాన్ని సమకూర్చారు. రాఘవేంద్ర వర్మ ఎడిటర్‌గా వ్యవహరించారు. మాస్టర్ దక్షేష్, అన్విష, మణి కేఎల్కే, రవి బయ్యావరపు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
ఈటీవీ విన్‌లో జాతిరత్నం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ కథా సుధా సిరీస్‌లో భాగంగా ఇవాళ జాతిరత్నం ఓటీటీ రిలీజ్ అయింది. ఎమోషన్స్, సస్పెన్స్, కామెడీ కలగలిపిన మంచి కంటెంట్ సినిమా చూడాలనుకునే వారికి ఈటీవీ విన్ ఓటీటీ మూవీ జాతిరత్నం బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.